Skip to main content

Good News: కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

వాణిజ్య సంస్థలు, కర్మాగారాలు, మోటారు రవాణా సంస్థలు, సహకార సంస్థలు ఇతర ట్రస్టులలో పనిచేసే కార్మికులకు, కార్మికుల పిల్లలకు తెలంగాణ కార్మిక సంక్షేమ మండలి ఉపకార వేతనాలు అందజేయాలని నిర్ణయించినట్లు ఇన్ చార్జి సంక్షేమ కమిషనర్‌ ఒక ప్రకటనలో తెలిపారు.
Good News
కార్మికుల పిల్లలకు ఉపకార వేతనాలు

2020–21 విద్యాసంవత్సరంలో పదో తరగతి నుంచి సాంకేతిక, వైద్య, వ్యవసాయ, హారి్టకల్చర్, నర్సింగ్‌ తదితర కోర్సులలో ఉత్తీర్ణులయిన వారికి ప్రతిభ ఆధారంగా ఉపకార వేతనాల కొరకు దరఖాస్తులు కోరుతున్నట్లు తెలిపారు. దరఖాస్తు ఫారాలు సంబంధిత, సహాయ కారి్మక కమిషనర్‌ వారి కార్యాలయంలో పొందవచ్చు. పూర్తిచేసిన దరఖాస్తులను వచ్చే 2022 ఫిబ్రవరి 15లోపు సంబంధిత కారి్మక శాఖ కార్యాలయములో సమరి్పంచాల్సి ఉంటుందని తెలిపారు. అభ్యర్థులు వారి క్లాసు లేదా కోర్సులలో మార్కుల శాతం ఆధారంగా ఎంపిక చేయబడతారని, ఎంపికయిన అభ్యర్థులకు ఉపకార వేతనాలను సంబంధిత సహాయ కమిషనర్లు మేడే నాటికి లబి్ధదారుల బ్యాంకు ఖాతాల్లో జమచేస్తారని తెలిపారు. 

చదవండి: 

Good News: రూ. 6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌..అర్హతలు ఇవే..

Scholarships: ప్రీ–మెట్రిక్, పోస్ట్‌–మెట్రిక్, మెరిట్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌లు

Good News: నర్సింగ్‌ విద్యార్థులకు శుభవార్త

Published date : 29 Dec 2021 04:13PM

Photo Stories