Skip to main content

Scholarships: ప్రీ–మెట్రిక్, పోస్ట్‌–మెట్రిక్, మెరిట్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్‌లు

Pre-matric, Post-matric, Merit Means Scholarship

భారత ప్రభుత్వ మైనారిటీ వ్యవహారాల మంత్రిత్వశాఖ 2021–22 విద్యా సంవత్సరానికి అర్హులైన మైనారిటీ(జైన్, బౌద్ధులు, సిక్కు, జోరాష్ట్రి యన్లు, ముస్లింలు, క్రిస్టియన్లు) అభ్యర్థుల నుంచి స్కాలర్‌షిప్‌లకు దరఖాస్తులు కోరుతోంది.

ప్రీ–మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌
»    అర్హత: 1 నుంచి పదో తరగతి వరకు చదివే మైనారిటీ విద్యార్థులకు ఈ ఉపకార వేతనాలు అందిస్తారు. గతేడాది నిర్వహించిన తుది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.లక్షకు మించకుండా ఉండాలి.
»    ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, వార్షికాదాయం ఆధారంగా ఎంపికచేస్తారు.

పోస్ట్‌ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌
»    అర్హత: ప్రభుత్వ/ప్రైవేటు కాలేజ్‌/యూనివర్సిటీల్లో హయ్యర్‌ సెకండరీ చదివే మైనారిటీ విద్యార్థులకు వీటిని అందిస్తారు. గతేడాది నిర్వహించిన తుది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌ సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.రెండు లక్షలకు మించకుండా ఉండాలి.
»    ఎంపిక విధానం: అకడమిక్‌ మెరిట్‌ మార్కులు, వార్షికాదాయం ఆధారంగా ఎంపికచేస్తారు. ఈ రెండు సమానమైనప్పుడు పుట్టిన తేదీని పరిగణనలోకి తీసుకొని సీనియారిటీ ఆధారంగా ఎంపికచేస్తారు.

మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్స్‌
»    అర్హత: ప్రొఫెషనల్, టెక్నికల్‌ కోర్సులు చదివే పేద, ప్రతిభావంతులైన మైనారిటీ విద్యార్థులు ఈ స్కాలర్‌షిప్‌కు అర్హులు. గతేడాది నిర్వహించిన తుది పరీక్షలో కనీసం 50 శాతం మార్కులు/తత్సమాన గ్రేడ్‌ సాధించి ఉండాలి. తల్లిదండ్రుల వార్షికాదాయం రూ.2.50 లక్షలు మించకుండా ఉండాలి.
»    ఎంపిక విధానం: మెరిట్, వార్షికాదాయం ఆధారంగా ఎంపికచేస్తారు.
»    స్కాలర్‌షిప్‌ మొత్తం: కోర్సు ఫీజు కింద ఏడాదికి రూ.20,000, మెయింటెనెన్స్‌ అలవెన్స్‌ కింద హాస్టలర్‌కు నెలకు రూ.1000,

డేస్కాలర్‌కు నెలకు రూ.500 చెల్లిస్తారు.
»    దర ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
»    ప్రీ మెట్రిక్‌ స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబర్‌ 15.
»    పోస్ట్‌ మెట్రిక్, మెరిట్‌ కమ్‌ మీన్స్‌ స్కాలర్‌షిప్స్‌ దరఖాస్తులకు చివరి తేది: 2021, నవంబర్‌ 30.
»    వెబ్‌సైట్‌: https://minorityaffairs.gov.in

Last Date

Photo Stories