Skip to main content

Good News: రూ. 6 లక్షల వరకు స్కాలర్‌షిప్‌..అర్హతలు ఇవే..

న్యూఢిల్లీ: టెక్నాలజీ విభాగంలో డిగ్రీ, పీజీ చదువుతున్న 100 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు ఇవ్వనున్నట్లు రిలయన్స్‌ ఫౌండేషన్‌ ప్రకటించింది.
Scholarships for students
Scholarships for students

ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, కంప్యూటర్‌ సైన్సెస్, మాథ్స్, కంప్యూటింగ్, ఎలక్ట్రికల్‌/ఎల్రక్టానిక్స్‌ ఇంజినీరింగ్‌లో ఫస్ట్‌ ఇయర్‌ అండర్‌గ్రాడ్యుయేట్, పోస్ట్‌ గ్రాడ్యుయేట్‌ స్టూడెంట్లలో దీనికి దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు. వీరిలో 60 మంది వరకూ అండర్‌గ్రాడ్యుయేట్‌ విద్యార్థులకు తలో రూ. 4 లక్షల దాకా, 40 మంది వరకూ పీజీ విద్యార్థులకు రూ. 6 లక్షల వరకూ గ్రాంటు లభిస్తుంది. సామాజిక ప్రయోజనం చేకూర్చే టెక్నాలజీలను అభివృద్ధి చేసేందుకు కూడా తోడ్పాటు లభిస్తుందని రిలయన్స్‌ ఫౌండేషన్‌ ఒక ప్రకటనలో తెలిపింది. 2021లో ఆర్టిఫిషియల్ఇంటెలిజెన్స్‌ (ఏఐ), కంప్యూటర్‌ సైన్సెస్‌ విభాగంలో తొలిసారిగా 76 మంది యూజీ, పీజీ విద్యార్థులకు రిలయన్స్‌ ఫౌండేషన్‌ స్కాలర్‌షిప్‌లు అందించింది.

Published date : 21 Dec 2021 06:42PM

Photo Stories