Skip to main content

CBSE: సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌ స్కాలర్‌షిప్‌ 2021.. అర్హత‌లు, ద‌ర‌ఖాస్తు వివ‌రాలు ఇలా..

CBSE Single Girl Child Scholarship

సెంట్రల్‌ బోర్డ్‌ ఆఫ్‌ సెకండరీ ఎడ్యుకేషన్‌(సీబీఎస్‌ఈ).. తల్లిదండ్రులకు ఏకైక బాలికా సంతానంగా ఉన్న ప్రతిభ కలిగిన విద్యార్థినుల కోసం సింగిల్‌ గర్ల్‌ చైల్డ్‌  స్కాలర్‌షిప్‌(ఎస్‌జీసీఎస్‌) పథకాన్ని అమలుచేస్తోంది. ఏకైక సంతానంగా ఉన్న ఆడపిల్లల చదువును ప్రోత్సహించేందుకు గాను ఈ స్కాలర్‌షిప్‌ను సీబీఎస్‌ఈ 2006లో ప్రారంభించింది. సీబీఎస్‌ఈ పదోతరగతి పరీక్షలో ఉత్తీర్ణులైన ప్రతిభావంతులైన బాలికల నుంచి దరఖాస్తులు కోరుతోంది.

అర్హతలు

  • విద్యార్థిని తల్లిదండ్రులకు ఏకైక కుమార్తె(సింగిల్‌ గర్ల్‌చైల్డ్‌) అయి ఉండాలి.
  • ఈ స్కాలర్‌షిప్‌కు కేవలం భారతీయ పౌరులు మాత్రమే అర్హులు.
  • విద్యార్థిని సీబీఎస్‌ఈలో పదోతరగతి ఉత్తీర్ణురాలై, సీబీఎస్‌ఈ అనుబంధ పాఠశాలలో 11వ తరగతి, 12వ తరగతి చదువుతూ ఉండాలి.
  • పదో తరగతి పరీక్షలో కనీసం 60శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
  • విద్యార్థిని ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.1500 కంటే మించకూడదు.
  • 11వ తరగతి, 12వ తరగతి చదువుతున్న విద్యార్థినులు మాత్రమే అర్హులు.
  • 2020 సంవత్సరంలో పదోతరగతి ఉత్తీర్ణులైన విద్యార్థినులు మాత్రమే ఈ స్కాలర్‌షిప్‌నకు అర్హులు.
  • సీబీఎస్‌ఈ బోర్డుకు సంబంధించి ఎన్‌ఆర్‌ఐ విద్యార్థిని అయితే ట్యూషన్‌ ఫీజు నెలకు రూ.6000కు మించకుండా ఉంటే స్కాలర్‌షిప్‌కు అర్హురాలే.
  • విద్యార్థిని ఏకైక సంతానం అని రుజువు చేయడానికి సంబంధించి సీబీఎస్‌ఈ వెబ్‌సైట్లో పేర్కొన్న ఫార్మెట్లో ఫస్ట్‌ క్లాస్‌ జ్యుడీషియల్‌ మేజిస్ట్రేట్‌/ఎడీఎం /ఎగ్జిక్యూటివ్‌ మెజిస్ట్రేట్‌/నోటరీ అటెస్ట్‌ చేసిన ఒరిజనల్‌ అఫిడవిట్‌ను సమర్పించాల్సి ఉంటుంది.

స్కాలర్‌షిప్‌ వ్యవధి

  • స్కాలర్‌షిప్‌కు ఎంపికైన విద్యార్థినులు 11వ తరగతి తర్వాత ప్రతి సంవత్సరం రెన్యువల్‌ చేసుకోవాల్సి ఉంటుంది.
  • స్కాలర్‌షిప్‌ రెన్యువల్‌ చేయించుకోవాలంటే.. విద్యార్థిని 11వ తరగతి నుంచి ఆపై తరగతులలో కనీసం 50శాతం లేదా అంతకంటే ఎక్కువ మార్కులు సాధించి ఉండాలి.
  • విద్యార్ధిని సత్ప్రవర్తనతోపాటు పాఠశాలలో హాజరు శాతం కూడా బాగుండాలి.
  • ఒకవేళ విద్యార్థిని పాఠశాల లేదా కోర్సు మారాలంటే.. బోర్డు ముందస్తు అనుమతి తీసుకుంటేనే స్కాలర్‌షిప్‌ కొనసాగుతుంది.
  • స్కాలర్‌షిప్‌ ఒక్కసారి రద్దయితే తిరిగి పునరుద్ధరించరు.

స్కాలర్‌షిప్‌ మొత్తం

  • విద్యార్థినులకు రెండేళ్ల పాటు నెలకు రూ.500 చొప్పున అందిస్తారు.
  • ఆన్‌లైన్‌ దరఖాస్తులకు చివరి తేది: 17.01.2022 
  • సీబీఎస్‌ఈ పాఠశాలల దరఖాస్తు ధృవీకరణకు చివరి తేది: 25.01.2022
  • వెబ్‌సైట్‌: https://www.cbse.gov.in/
Last Date

Photo Stories