ప్రైవేట్, కార్పొరేట్ కాలేజీల్లో ఫీజులు నియంత్రించాలి
Sakshi Education
రాష్ట్రంలోని కార్పొరేట్, ప్రైవేట్ విద్యా సంస్థల్లో ఫీజుల నియంత్రణకు, ప్రత్యేక ఆర్డినెన్స్ లేదా రాబోయే రాష్ట్ర అసెంబ్లీ సమావేశాల్లో ప్రత్యేక చట్టం తీసుకురావాలని, 2022–23 విద్యా సంవత్సరంలో ఇంటర్ అడ్మిషన్ల ప్రక్రియను ఆన్‌లైన్‌లో నిర్వహించాలని పేరెంట్స్ అసోసియేషన్ ఆఫ్ ఆంధ్రప్రదేశ్ సంస్థ ప్రభుత్వానికి విన్నవించింది.
కార్పొరేట్ ప్రైవేట్ విద్యా సంస్థల్లో 2009 విద్యాహక్కు చట్టం రిజర్వేషన్ల అమలు, కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల ద్వారా లబ్ధి పొందుతున్న అధికార, అనధికారుల పిల్లలను ప్రభుత్వ విద్యాలయాలలోనే చేర్చడం వంటి చర్యలు చేపట్టాలని కోరింది. రాష్ట్రంలో అన్ని స్థాయిల్లో అందరికీ విద్య అందించేందుకు ప్రభుత్వం తీసుకువచ్చిన సంస్కరణలను సమర్థిస్తున్నట్లు పేర్కొంది. సీఎం జోక్యం చేసుకుని రాష్ట్రంలోని కార్పొరేట్ ప్రైవేట్ విద్యాసంస్థల్లో ఫీజుల దోపిడీని నియంత్రించాలని కోరింది. ప్రతి జిల్లాలో ప్రత్యేక పర్యవేక్షణ అధికారిని నియమించాలని విజ్ఞప్తి చేసింది.
చదవండి:
Published date : 09 Jun 2022 01:11PM