Skip to main content

సీబీఐటీ, ఎంజీఐటీ ఫీజులు పెంపు

ప్రైవేటు ఇంజనీరింగ్‌ కాలేజీలైన సీబీఐటీ, ఎంజీఐటీ ఫీజుల పెంపునకు రాష్ట్ర అడ్మిషన్లు, ఫీజుల నియంత్రణ కమిటీ (టీఎస్‌ఎఫ్‌ఆర్‌సీ) మే 12న ఆమోదం తెలిపింది.
Increase in CBIT and MGIT fees
సీబీఐటీ, ఎంజీఐటీ ఫీజులు పెంపు

2016–19 మధ్య కాలంలో రూ. 1,13,500గా ఉన్న సీబీఐటీ వార్షిక ఫీజును రూ.1.40 లక్షలకు, ఎంజీఐటీ ఫీజు రూ.లక్ష నుంచి 1.20 లక్షలకు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. తాము ఫీజులు పెంచుకునేందుకు అనుమతించాలని ఈ రెండు సంస్థలు 2016లో కోర్టుకు వెళ్లాయి. సీబీఐటీ 2 లక్షలు, ఎంజీఐటీ 1.60 లక్షల ఫీజు వసూలు చేసుకునేందుకు అవకాశం ఇవ్వాలని కోరాయి. అప్పట్నుంచి హైకోర్టు, సుప్రీం కోర్టుల్లో వాదనలు సాగాయి. హైకోర్టులోనే తేల్చుకోవాలని సుప్రీంకోర్టు చెప్పింది. ఫీజుల ఖరారు బాధ్యతను ఎఫ్‌ఆర్‌సీకి అప్పగిస్తూ హైకోర్టు గత ఏడాది ఉత్తర్వులిచి్చంది. అప్పట్నుంచి తెలంగాణ ఉన్నత విద్య మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ ఆర్‌.లింబాద్రి, ఉస్మానియా, జేఎన్ టీయూ వీసీలు డి.రవీందర్, కట్టా నర్సింహారెడ్డి నేతృత్వంలోని కమిటీ కొనసాగించిన సంప్రదింపుల అనంతరం ఫీజులు ఖరారు అయ్యాయి. 

ఎక్కువ వసూలు చేస్తే విద్యార్థులకు తిరిగివ్వాలి

పెంచిన ఫీజులు 2016 నుంచి వర్తిస్తాయి కాబట్టి, అప్పట్లో ప్రవేశాలు పొందిన ప్రతి విద్యార్థి పెంచిన ఫీజును చెల్లించాల్సి ఉంటుంది. అయితే కాలేజీల యాజమాన్యాలు ముందే ఫీజులు పెంచి వసూలు చేసినట్టు తెలిసింది. ఈ నేపథ్యంలో ప్రస్తుతం ఖరా రుచేసిన దానికన్నా ఎక్కువ వసూలు చేస్తే విద్యార్థులకు తిరిగి ఇవ్వాలని ఎఫ్‌ఆర్‌సీ ఆదేశించినట్టు ఉన్నత విద్యా మండలి చైర్మన్ ప్రొఫెసర్‌ లింబాద్రి తెలిపారు. ఇదిలా ఉంటే, ఫీజు రీయింబర్స్‌మెంట్‌ పొందే కనీ్వనర్‌ కోటా విద్యార్థులకు ప్రభుత్వం పెరిగిన మొత్తాన్ని చెల్లించాల్సి ఉంటుంది. 

Published date : 13 May 2022 12:47PM

Photo Stories