Digital Content: డిజిటల్ కంటెంట్‌తో మెరుగైన బోధన.. ఉచితంగా..
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు ఉపకరించేలా జైనథ్ మోడల్ స్కూల్ వృక్షశాస్త్ర అధ్యాపకుడు సత్యనారాయణ రూపొందించిన ఉచిత డిజిటల్ కంటెంట్‌ను కలెక్టర్ డిసెంబర్ 29న తన క్యాంపు కార్యాలయంలో ఆవిష్కరించారు. మొదటి, రెండో సంవత్సరానికి సంబంధించిన అధ్యాయాలను పరిశీలించారు.
చదవండి: TG TET 2024 Lessons: టీ–శాట్‌లో టెట్ పాఠాలు.. యూ ట్యూబ్‌లో కూడా..
ప్రభుత్వ జూనియర్ కళాశాలలు, మోడల్ స్కూళ్లు, కేజీబీవీల విద్యార్థుల కోసం ఆంగ్లమాధ్యమంలో రూపొందించిన కంటెంట్ బోర్డు పరీక్షలతో పాటు నీట్ వంటి పోటీ పరీక్షలకు ఉపయోగపడేలా రూపొందించినట్లుగా తెలిపారు.
సీడీ, లింక్, క్యూ ఆర్ కోడ్ ద్వారా ఉచితంగా ఈ సదుపాయం కల్పిస్తున్నట్లు చెప్పారు. కార్యక్రమంలో డీఈవో ప్రణీత, కేజీబీవీ జిల్లా ప్రత్యేక అధికారి ఉదయశ్రీ, జిల్లా సంక్షేమ అధికారి మిల్కా, ఆరోగ్య పాఠశాల సంధానకర్త అజయ్, ప్రిన్సిపాల్ రాము తదితరులు పాల్గొన్నారు.
▶ Join our WhatsApp Channel: Click Here ▶ Join our Telegram Channel: Click Here |
▶ Follow our YouTube Channel: Click Here ▶ Follow our Instagram Page: Click Here |