Skip to main content

MANUU: దూరవిద్య ప్రవేశాల దరఖాస్తు తేదీ పొడిగింపు

Maulana Azad National Urdu Universityలోని దూర విద్యాకోర్సుల్లో ప్రవేశాలకు దరఖాస్తు గడువు తేదీని పెంచినట్లు ఉర్దూ విశ్వవిద్యాలయం డైరెక్టరేట్‌ ఆఫ్‌ డిస్టెన్స్‌ ఎడ్యుకేషన్‌ డైరెక్టర్‌ ప్రొఫెసర్‌ మహ్మద్‌ రజావుల్లాఖాన్‌ అక్టోబర్‌ 19న తెలిపారు.
MANUU
దూరవిద్య ప్రవేశాల దరఖాస్తు తేదీ పొడిగింపు

అక్టోబర్‌ 20 వరకు ఉన్న గడువు తేదీని నవంబర్‌ 10వ తేదీ వరకు పొడిగించినట్లు విద్యార్థులు గమనించాలన్నారు. యూజీసీ నిర్ణయం మేరకు ఈ గడువు తేదీని పెంచినట్లు పేర్కొన్నారు. ఆసక్తి ఉన్న విద్యార్థులు నవంబర్‌ 10 వరకు ఆన్‌లైన్‌లో నమోదు చేసుకోవచ్చని వెల్లడించారు. అడ్మిషన్‌ ఫీజు చెల్లింపునకు చివరి తేదీ నవంబర్‌ 15 వరకు అవకాశం కల్పించినట్లు చెప్పారు. యూజీసీ ఆమోదించిన ఎంఏ ఉర్దూ, ఇంగ్లిష్, ఇస్లామిక్‌ స్టడీస్, అరబిక్, హిందీ, హిస్టరీ, బీఏ, బీకాం, డిప్లొమా కోర్సులు (టీచ్‌ ఇంగ్లిష్, జర్నలిజం మాస్‌ కమ్యూనికేషన్, సర్టిఫికెట్‌ కోర్సుల్లో ఇంగ్లిష్, ఉర్దూలో ప్రావీణ్యం కోర్సుల్లో అడ్మిషన్లు అందుబాటులో ఉన్నాయని వివరించారు.

చదవండి: MANUU: ‘మనూ’లో కొత్త కోర్సు

యూజీసీ మార్గదర్శకాల ప్రకారం విద్యార్థులు ఏవైనా రెండు ప్రోగ్రామ్‌లలో ఏకకాలంలో నమోదు చేసుకోవచ్చన్నారు. ఇ–ప్రాస్పెక్టస్, ఆన్‌లైన్‌ దరఖాస్తు ఫారమ్‌లు, అడ్మిషన్‌ పోర్టల్, యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉన్నాయని రజావుల్లాఖాన్‌ వెల్లడించారు. మరిన్ని వివరాలకు స్టూడెంట్‌ సపోర్ట్‌ యూనిట్‌ హెల్ప్‌లైన్‌లు 040–23008463, 040–23120600 ఫోన్‌నెంబర్లలో సంప్రదించాలన్నారు. యూనివర్సిటీ వెబ్‌సైట్‌లో కూడా పూర్తి వివరాలుంటాయని, దాన్ని కూడా సందర్శించవచ్చని సూచించారు. 

చదవండి: UGC – HRDC: మూడోస్థానంలో ‘మనూ’

Published date : 20 Oct 2022 03:39PM

Photo Stories