Sheshadrini Reddy IPS Success Story : అప్పుడే ఇలా నిశ్చయించుకున్నా.. ఇప్పుడు ఐపీఎస్ ఈజీగా కొట్టానిలా..
లక్ష్య సిద్ధి ఉంటే విజయం ఖాయమని నిరూపించారు. ఈ నేపథ్యంలో యువ ఐపీఎస్ శేషాద్రిని రెడ్డి సక్సెస్ స్టోరీ మీకోసం..
☛ IPS Anjali Success Story : అంజలి విశ్వకర్మ.. ఐపీఎస్ సక్సెస్ స్టోరీ.. నా వెనుక ఉన్నది వీళ్లే..
కుటుంబ నేపథ్యం :
నా పేరు శేషాద్రి రెడ్డి. నేను హైదరాబాద్‌లో పుట్టిపెరిగినాను. మా నాన్న సుధాకర్‌రెడ్డి సివిల్ కాంట్రాక్టర్. చిన్నప్పటి నుంచి మా నాన్న ఎంతో ప్రోత్సహించేవారు. సివిల్ సర్వీసెస్ ఆఫీసర్‌గా ప్రజలకు ఎంత సేవ చేసే అవకాశం ఉంటుంది.. వాళ్లకు సమాజంలో ఎంత గౌరవం ఉంటుందన్నది బాగా చెప్పేవారు. అది నాలో ఎంతో ప్రేరణ నింపింది. అలా చిన్ననాటి నుంచే నేను ఐపీఎస్ కావాలని నిశ్చయించుకున్నా.
☛ జీవితంలో కష్టాలు రావడం కూడా అదృష్టమే.. ఈ ఐపీఎస్ స్టోరీ చదివితే..మీకే తెలుస్తుంది..
నా సివిల్స్ ప్రిపరేషన్ ఇలా..
ముందు నుంచి నేను ప్రణాళిక ప్రకారం చదువుకుంటూ వచ్చాను. ఇంజినీరింగ్ పూర్తి చేసిన తర్వాత ప్రిపరేషన్ పై మరింత ఫోకస్ పెట్టాను. ముఖ్యమైన అంశాలను ఒక ప్రణాళిక ప్రకారం చదివాను. చిన్ననాటి నుంచే నేను ఐపీఎస్ కావాలనే లక్ష్యం నా మనస్సు చదివే సమయంలో ఎప్పుడు గుర్తుకు వచ్చేంది.
☛ IPS Success Story : నన్ను విమర్శించిన వారే.. ఇప్పుడు తలదించుకునేలా చేశానిలా..
నా విజయంలో..
అమ్మా నాన్నల సహకారం.., నా కష్టంతో చివరకు విజయం సాధించడం సంతోషంగా ఉంది. హైదరాబాద్‌లో పుట్టిపెరిగిన నాకు మళ్లీ తెలంగాణ కేడర్‌లో సొంత రాష్ట్రంలోనే సేవ చేసే అవకాశం రావడం ఇంకా సంతోషంగా ఉంది.
ఇప్పుడు నా లక్ష్యం ఇవే..
తెలంగాణలో పోలీస్ టెక్నాలజీ పరంగా, ఇతర అంశాల్లోనూ ఎంతో బాగున్నాయి. ఇప్పటికే మా సీనియర్ అధికారులు అమలు చేస్తున్న విధానాలను తెలుసుకుంటూనే ప్రజలకు పోలీసింగ్ మరింత చేరువ చేసేందుకు కృషి చేస్తాను. భవిష్యత్తులో మరింతగా పెరగనున్న సైబర్ నేరాలను ఎలా కట్టడి చేయాలన్న దానిపైన మాకు ప్రత్యేకంగా శిక్షణ ఇచ్చారు. అది మరింత ఉపయోగపడుతుందని నేను భావిస్తున్నాను.
☛ Inspiring Success Story : ప్రసూతి సెలవుల్లో సివిల్స్‌కు ప్రిపేరయ్యా.. ఐపీఎస్ సాధించానిలా.. కానీ..