Skip to main content

Legend IPS : సినిమాలో హీరోలా.. ప్రజల హృదయాల్లో దేవుడిలా..

విజయకుమార్ ఐపీఎస్.. గంధపు చెక్కలు, ఏనుగు దంతాల స్మగ్లింగ్‌తో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలకు నిద్రలేకుండా చేసిన వీరప్పన్‌ను మట్టుబెట్టిన ఎస్టీఎఫ్ కు నేతృత్వం వహించిన హీరో ఈయనే.
Vijay kumar, IPS
విజయకుమార్, ఐపీఎస్

విభజన నేపథ్యంలో తలెత్తే శాంతిభద్రతల సమస్యల పరిష్కారానికి అనుసరించాల్సిన వ్యూహాలు రూపొందించేందుకు కేంద్ర హోంమంత్రిత్వ శాఖ ఏర్పాటుచేసిన టాస్క్‌ఫోర్స్‌కు ఈయన అధినేత.ఆయన కేంద్ర హోంమంత్రిత్వ శాఖ భద్రతా సలహాదారుగా ప‌నిచేశారు. అలాగే ఈయ‌న ఎన్‌కౌంటర్లు చేయడంలో స్పెషలిస్ట్‌గా మంచి గుర్తింపు పొందినారు.

ఐఏఎస్ వ‌చ్చినా కూడా ఐపీఎస్ వైపే..
చిన్నతనం నుంచే పోలీసు యూనిఫాం అంటే విజయకుమార్‌కు చెప్పలేనంత ఇష్టం. సివిల్ సర్వీసుల కోసం పరీక్ష రాసినప్పుడు ఐఏఎస్ అయ్యేలా మంచి ర్యాంకు వచ్చినా.. దాన్ని వద్దనుకుని ఐపీఎస్ ఎంచుకున్నారు. అందరికీ ఐపీఎస్ అంటే ఇండియన్ పోలీస్ సర్వీస్ అనే తెలుసు. కానీ ఆయన మాత్రం ఐడియల్ పబ్లిక్ సర్వీస్ అనుకుంటారు. ఆయన గురించి అభిమానులు చెప్పే మాటలు చూస్తే చాలు.. విజయకుమార్ అంటే ఏంటో తెలుస్తుంది.

సినిమాలో హీరోలా.. ప్రజల హృదయాల్లో దేవుడిలా..

vijay kumar ips

''సినిమాలో హీరోలు మూడు గంటలే వెలుగుతారు.. రాజకీయ నాయకులు ఐదేళ్లలో మబ్బుల చాటుకు వెళ్లిపోతారు.. లెజెండ్స్ ఒక తరం పాటు వెలిగిపోతారు.. యోధులు మాత్రం ప్రజల హృదయాల్లో చిరకాలం నిలిచిపోతారు"

కుటుంబ నేప‌థ్యం..

vijay kumar ips biography


విజయకుమార్ 1952 సెప్టెంబర్ 15న జ‌న్మించారు. తండ్రి కృష్ణన్ నాయర్, తల్లి కౌసల్య. ఆరుగురు సంతానంలో ఈయన రెండోవారు. తండ్రి కృష్ణన్ నాయర్ కూడా పోలీసు అధికారే కావడంతో విజయకుమార్ చిన్నతనం నుంచి పోలీసు యూనిఫాం పట్ల మక్కువ పెంచుకున్నారు. 1975లో ఆయన యూపీఎస్సీ పరీక్షలు రాసీ ఐపీఎస్ అయ్యారు. ఆయన పట్టుకొట్టాయ్, తిరుచ్చి, సెంబియాం (చెన్నై)లలో ఏఎస్పీగా పనిచేశారు. అనంతరం ధర్మపురి, సేలం జిల్లాలకు ఎస్పీగా వ్యవహరించారు. అదేసమయంలో వాల్టర్ దవారం అనే యువ పోలీసు అధికారితో చాలాకాలం కలిసి పనిచేశారు. ఆయన ధైర్యసాహసాలను విజయకుమార్ ఎప్పుడూ మెచ్చుకునేవారు.

గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్ విష‌యంలో..

IPS Plan


విజయ్ కుమార్ తమిళనాడుకు చెందిన 1975 బ్యాచ్ ఐపీఎస్ అధికారి. ఈయనకు పెద్ద సక్సెస్‌ఫుల్ ట్రాక్ రికార్డే ఉంది. కర్ణాటక-తమిళనాడు ప్రభుత్వాలకు కంటిలో నలుసులో మారిన గంధపు చెక్కల స్మగ్లర్ వీరప్పన్‌ను 2004 అక్టోబర్‌లో అంతమొందించిన తమిళనాడు స్పెషల్ టాస్క్ ఫోర్స్ చీఫ్‌గా వ్యవహరించారు. వీరప్పన్‌ను పట్టుకున్న తర్వాత విజయ్ పేరు ప్రపంచానికి తెలిసింది. అంతేకాదు చెన్నై పోలీస్ కమిషనర్‌గా పనిచేసిన సమయంలో.. ఎంతోమంది నేరస్థులను ఎన్‌కౌంటర్ చేశారు. 2008లో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీ చీఫ్‌గా నియమితులయ్యారు. 2010నాటి దంతెవాడ ఘటన తర్వాత విజయ్ కుమార్ సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా నియమితులయ్యారు. సీఆర్పీఎఫ్ డైరెక్టర్ జనరల్‌గా 2010-2012 మధ్య కాలంలో మావోయిస్టుల ఏరివేత, అటు జమ్మూకశ్మీర్‌లో ఉగ్రవాదుల ఆటకట్టించడంలో కీలక పాత్ర పోషించారు. 2018లో కశ్మీర్ గవర్నర్‌కు భద్రతా వ్యవహారాల సలహాదారుగా బాధ్యతలు చేపట్టారు. 

కశ్మీర్‌కు పంపితే అక్క‌డ కూడా..IPS Jobs
హైదరాబాద్‌ నగరంతో కూడా ఆయనకు మంచి సంబంధాలున్నాయి. గతంలో హైదరాబాద్‌లోని సర్దార్ వల్లభాయ్ పటేల్ నేషనల్ పోలీస్ అకాడమీకి అధిపతిగా పనిచేశారు. ఆ తర్వాత డీజీ, సీఆర్పీఎఫ్ డీజీగా పనిచేసి పదవీ విరమణ అయ్యారు. ఆ తర్వాత కూడా వామపక్ష తీవ్రవాద ప్రాంతాలకు హోం మంత్రిత్వ శాఖకు సీనియర్ సలహాదారుగా పనిచేశారు. ప్రస్తుతం, హోమ్, ఫారెస్ట్, ఎకాలజీ & ఎన్విరాన్మెంట్, హెల్త్ & మెడికల్ ఎడ్యుకేషన్, యూత్ సర్వీసెస్ & స్పోర్ట్స్, హాస్పిటాలిటీ & ప్రోటోకాల్, సివిల్ ఏవియేషన్, ఎస్టేట్స్, ఇన్ఫర్మేషన్ పోర్ట్‌ఫోలియోలతో జమ్ముకశ్మీర్ గవర్నర్‌కు సలహాదారుగా ఉన్నారు. 
 
విజయకుమార్ నిర్వహించిన మరికొన్ని కీలక పోస్టులు...

Jobs


☛ మాజీ ప్రధాని రాజీవ్ గాంధీకి భద్రత కల్పించిన ఎస్పీజీ సభ్యుడు
☛ కేంద్రంలోకి డిప్యూటేషన్ మీద బీఎస్ఎస్ ఆపరేషన్స్ ఐజీ
☛ చెన్నై నగర పోలీసు కమిషనర్/ అదనపు డీజీపీ
☛ స్పెషల్ టాస్క్ఫోర్స్ చీఫ్ (వీరప్పన్ను హతమార్చిన బృందం)
☛ తమిళనాడు అదనపు డీజీపీ, శాంతిభద్రతలు
☛ హైదరాబాద్‌లో సర్దార్ వల్లభాయ్ పటేల్ జాతీయ పోలీసు అకాడమీ డైరెక్టర్
☛ కేంద్ర రిజర్వు పోలీసు ఫోర్సు డైరెక్టర్ జనరల్

Inspiring Story : విప‌త్క‌ర‌ ప‌రిస్థితిల్లో..ఆప‌ద్బాంధ‌వుడు..ఈ యువ ఐఏఎస్ కృష్ణ తేజ

IAS Lakshmisha Success Story: పేపర్‌బాయ్‌ టూ 'ఐఏఎస్‌'..సెలవుల్లో పొలం పనులే...

Success Story: తొలి ప్రయత్నంలోనే..ఎలాంటి కోచింగ్‌ లేకుండా..22 ఏళ్లకే సివిల్స్‌..

Civils Ranker Srija Success Story: ఈ ఆశయంతోనే సివిల్స్‌ వైపు..నా స‌క్సెస్‌కు కార‌ణం వీరే..

IAS Officer, IAS : నిత్యం పాలమ్మితే వ‌చ్చే పైసలతోనే ఐఏఎస్‌ చ‌దివా..ఈ మూడు పాటిస్తే విజయం మీదే :యువ ఐఏఎస్‌ డాక్టర్‌ బి.గోపి

Veditha Reddy, IAS : ఈ సమస్యలే న‌న్ను చదివించి..ఐఏఎస్ అయ్యేలా చేశాయ్‌...

Srijana IAS: ఓటమి నుంచి విజయం వైపు...కానీ చివరి ప్రయత్నంలో..

Chandrakala, IAS: ఎక్క‌డైనా స‌రే..‘తగ్గేదే లే’

Published date : 08 Jan 2022 01:48PM

Photo Stories