Skip to main content

UPSC Civils Ranker Sneha: ఈ సర్టిఫికెట్‌ చూసే ఐఏఎస్ అవ్వ‌ల‌నుకున్నా.. ఈ ఒక్క మార్క్ తేడాతోనే..

యూపీఎస్సీ-2021 సివిల్స్ ఫ‌లితాల్లో 136వ ర్యాంకు సాధించి నిజామాబాద్ జిల్లాకు ప్ర‌త్యేక గౌరవం తెచ్చింది అరుగుల స్నేహ.
UPSC Civils Ranker Sneha
యూపీఎస్సీ-2021 సివిల్స్ ఫ‌లితాల్లో 136వ ర్యాంక‌ర్‌.. అరుగుల స్నేహతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

మూడు సార్లు సివిల్స్‌లో పోరాడిన తర్వాత నాలుగోసారి సివిల్స్‌లో విజయం సాధించారు స్నేహ. బ‌ల‌మైన విశ్వాసంతో సివిల్స్ ర్యాంక్ సాధించే వరకు పోరాటం చేశారు స్నేహ. చివరికి సక్సెస్ అయ్యారు. చిన్నప్పటి నుంచే కలెక్టర్ కావాలన్న లక్ష్యం పెట్టుకుని చివరికి టార్గెట్ రీచ్ అయ్యారు. నిజామాబాద్ నగరంలోని అంబేద్కర్ కాలనీకి చెందిన అరుగుల స్నేహ.. థర్డ క్లాస్ నుంచి 10 వరకు నిర్మల హృదయ హైస్కూల్‌లో చదువుకున్నారు. ఎప్పుడు 90 శాతం మార్కులతో మంచి స్టూడెంట్‌గా పేరు తెచ్చుకున్నారు స్నేహ. ఈ నేప‌థ్యం అరుగుల స్నేహతో సాక్షి ఎడ్యుకేష‌న్‌.కామ్ ప్ర‌త్యేక ఇంట‌ర్య్వూ..

UPSC Civils Ranker : అమ్మ క‌ల‌ను నిజం చేశానిలా..| ఆ ఒక్క మార్క్ వ‌ల్లే పోయింది

కుటుంబ నేపథ్యం.. :
తల్లి పద్మ, చెల్లెలు సుప్రియ. తల్లి పద్మ కామారెడ్డి కలెక్టరేట్‌లోని పే అండ్ అకౌంట్స్ విభాగంలో డేటా ఎంట్రీ ఆపరేటర్‌. చెల్లెలు సుప్రియ హైదరాబాద్‌లో సంగీతం టీచర్‌గా పనిచేస్తున్నారు. ఎన్నో ఇబ్బందులు ఎదురైనప్పటికీ తన తల్లి అనేక కష్టాలు పడుతూ తనను ఈ విజయం సాధించేందుకు ప్రోత్సహించినట్లు స్నేహ తెలిపారు. చివరి రెండేళ్లలో తన చెల్లెలు సుప్రియ సైతం ఆర్థికంగా ఆదుకుంటూ ప్రోత్సహించినట్లు స్నేహ పేర్కొన్నారు. స్నేహ చిన్నతనంలో కుటుంబ పోషణ తల్లికి భారంగా ఉండేది. నాటి కలెక్టర్ విజయ్ కుమార్ స్నేహ తల్లికి కాంట్రాక్ట్ ఉద్యోగం ఇచ్చారు. అనాటి నుంచి కొంత ఆర్థిక పరిస్థితి కుదుట పడ్డాము. ఎలాంటి కష్టాలను లెక్క చేయకుండా చదువుపై దృష్టి పెట్టాను. తాను చిన్న వయసులో కలెక్టర్ విజయ్ కుమార్ చేసిన సాయాన్ని దృష్టిలో పెట్టుకుని తాను సైతం కలెక్టర్ కావాల‌న్న‌ టార్గెట్ పెట్టుకుని నా కలను నిజం చేసుకున్నాను.

UPSC Civils Ranker Sridhar Interview : అసెంబ్లీ వ‌ద్ద ఆ ఘ‌ట‌న చూసే.. సివిల్స్ వైపు వ‌చ్చా..

నా ఎడ్యుకేష‌న్ :
నేను 8వ తరగతి నుంచే సివిల్స్ లక్ష్యంగా పెట్టుకున్నాను. నగరంలోని నిర్మల హృదయ పాఠశాలలో 3వ తరగతి నుంచి టెన్త్ వరకు చదివారు. ఆ త‌ర్వాత హైదరాబాద్‌లో ఇంటర్ పూర్తి చేసి.. ఆపై నాగపూర్ ఎన్ఐటి (నేషనల్ ఇన్సిటి ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ)లో ఎలక్ట్రికల్స్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజ‌నీరింగ్‌ను 2017లో పూర్తి చేశాను.

UPSC Civils Results 2022: ప‌రీక్ష రాయలేని స్మరణ్‌ను.. అమ్మ గెలిపించిదిలా.. గంటకు 40 పేజీలు..

నా సివిల్స్ ప్ర‌యాణంలో..
గ్రాడ్యుయేషన్ పూర్తి చేసిన వెంటనే సివిల్స్ వైపు దృష్టి సారించాను. సివిల్స్ కోసం ఢిల్లీ వెళ్లి ప్రిపరేషన్ మొదలుపెట్టాను. సివిల్స్ కోసం ఢిల్లీలోని వాజీరాం అండ్ ర‌వి ఇన్సిటిట్యూట్‌లో శిక్షణ తీసుకున్నాను. ఢిల్లీలోని ఫోరమ్ ఐఏఎస్, విజన్ ఐఏఎస్ సంస్థల్లో టెస్టులు రాశాను. అలాగే హైదరాబాద్ లోని బాలలత మేడమ్ వద్ద మాక్ ఇంటర్వ్యూలకు హాజ‌ర‌య్యాను.

UPSC 2021 Civils Ranker: ఈ ఆప‌రేష‌న్ వ‌ల్లే ఉద్యోగం కొల్పోయా.. నాన్న చెప్పిన ఆ మాట‌లే ర్యాంక్ కొట్టేలా చేశాయ్‌..

ఈ సర్టిఫికెట్‌ను చూసే ఇన్‌స్పైర్ అయ్యా..

UPSC 2021 Topper


నాకు అమ్మే అన్ని తానై పెంచింది. మా అమ్మకు వచ్చిన సర్టిఫికెట్‌ను చూసి ఇన్‌స్పైర్‌ అయ్యాను. ఆ సర్టిఫికెట్‌లో వినయ్‌కుమార్‌ ఐఏఎస్‌ అనే సంతకం చూసి.. ఎలాగైనా నేను కూడా ఐఏఎస్‌ కావాలనుకొని అప్పుడే లక్ష్యాన్ని నిర్దేశించుకున్న. సమాజానికి నా వంతు సేవలు అందించాల‌నుకుంటున్నా.. 

UPSC Civils Ranker -2021: పిచ్చోడన్నారు.. తూటాలు దింపారు.. ఈ సివిల్స్ ర్యాంక‌ర్ స్టోరీకి షాక్ అవ్వాల్సిందే..

ఆ ఒక్క మార్క్ తేడాతోనే..
మూడోసారి ర్యాంకు వస్తుంద‌ని చాలా కష్టపడ్డాను. కానీ ఒకేఒక్క‌ మార్కుతో ర్యాంకు రాకపోయేసరికి కొంత ఆత్మన్యూనతకు లోనయ్యాను. ఇంటర్వ్యూ అయ్యాక .. పది రోజుల్లోనే మళ్లీ ప్రిలిమ్స్‌ ఉండే. ఆ పది రోజులు సరిపోవు. మళ్లీ అటెండ్‌ చేద్దామా వద్దా అనే ఆలోచనలో పడ్డాను. అమ్మ ప్రోత్సాహంతో ఎలాగైనా సరే ఈసారి వదిలేది లేద‌ని.. చదవడానికి కూర్చున్న.. బాధను దిగమింగుకొని లక్ష్యం వైపు అడుగులు వేశాను. మెయిన్స్‌లో 797, ఇంటర్వ్యూలో 179 మార్కులు వచ్చాయి. ఇప్పుడు చాలా సంతోషంగా ఉంది.

UPSC Ranker Shivangi Goyal: వీళ్ల హింస‌ను భ‌రించ‌లేక పుట్టింటికి వ‌చ్చా.. ఈ క‌సితోనే సివిల్స్‌ ర్యాంక్ కొట్టానిలా..

నా సలహా ఇదే..
ఎవరైనా సరే సమయం కేటాయించి చదివి లక్ష్యం వైపు అడుగులు వేస్తే తప్పక సాధిస్తారు. ఎన్నిసార్లు ఓడినా ధైర్యంగా ప్రణాళికతో చదివితే విజయం వరిస్తుంది.

నా ఇష్టాలు:
నాకు బయోపిక్స్ చూడడం అంటే ఇష్టం. జీవితంలో తాను నేర్చుకున్న అంశాలు, ఎదురైన అనుభవాల గురించి రాయడం అలవాటు అని తెలిపారు. 

UPSC Civils Ranker : ఓట‌మిలోనే.. విజ‌యం దొరికిందిలా..

ఈ విజ‌యం అమ్మ‌కు అంకితం..
ఆర్థికంగా అనేక ఇబ్బందులు ఎదురైనప్పటికీ అమ్మ ఎంతో ప్రోత్సాహం ఇస్తూ వచ్చారు. ఈ విజయం సాధించడానికి స్ఫూర్తి అమ్మే అంటున్నారు స్నేహ. ఈ విజయం అమ్మకు అంకితం. హైదరాబాద్‌లో ఉండే పిన్ని, బాబాయి సైతం ప్రోత్సహించారు. చిన్నప్పటి నుంచి అమ్మ ఎదుర్కొన్న ఇబ్బందులు చూశాను. 

నేను దీని కోస‌మే ప‌నిచేస్తా..
నేను సర్వీసులో చేరాక మహిళా సాధికారతపై ప్రధానంగా దృష్టి సారిస్తానన్నారు.నాలాంటి ఎందరో మహిళలకు తోడ్పాటునందించాలనుకుంటున్నాను. విద్య, వైద్యం ఇవి రెండు సరిగ్గా అందినప్పుడే మహిళా సాధికారిత సాధించగలుగుతాం.

UPSC- 2021 Civils Ranker : సివిల్స్ ఇంట‌ర్య్వూలో న‌న్ను అడిగిన ప్ర‌శ్న‌లు ఇవే..

Published date : 04 Jun 2022 07:19PM

Photo Stories