Japanese Language: జాపనీస్‌ భాషలో శిక్షణ.. జపాన్‌లో ఉద్యోగం..!

జపాన్‌లో నర్సులుగా ఉద్యోగం పొందేందుకు జపనీస్‌ భాషలో శిక్షణ ఇస్తున్నట్లు జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి తెలిపారు. ఈ నేపథ్యంలో అర్హత, ఆసక్తి గల అభ్యర్థులు వారి వివరాలను ప్రకటించిన వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాలని తెలిపారు. పూర్తి వివరాలను పరిశీలించండి..

పార్వతీపురం టౌన్‌: రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ హెచ్‌ఆర్‌ ఆధ్వర్యంలో ఏఎన్‌ఎం/జీఎన్‌ఎం/బీఎస్‌సీ, నర్సింగ్‌ చదివిన వారికి జపనీస్‌ భాషను ఎన్‌5, ఎన్‌4, ఎన్‌3 స్థాయిల్లో నేర్పించి, వారికి జపాన్‌ దేశంలో నర్సులుగా ఉద్యోగావకాశం కల్పించనున్నట్లు పార్వతీపురం మన్యం జిల్లా నైపుణ్యాభివృద్ధి అధికారి యు.సాయి కుమార్‌ తెలిపారు. ఈ మేరకు శుక్రవారం ఆయన ఒక ప్రకటన విడుదల చేశారు.

Physiotherapist Jobs: ఫిజియోథెరపిస్ట్‌ పోస్టులకు దరఖాస్తుల ఆహ్వానం

జపాన్‌ దేశంలో పనిచేయడానికి ఆసక్తి కలిగి, 32 సంవత్సరాలలోపు వయసున్న అభ్యర్థులు అర్హులని, శిక్షణ కాలం 6 నెలలు ఉంటుందని, ఈ శిక్షణ నవీస్‌ హెచ్‌ఆర్‌ బెంగళూరులో జరుగుతుందని పేర్కొన్నారు. శిక్షణ ఫీజు రూ.3,50,000 అని, పాక్షిక శిక్షణ రుసుము రూ.50,000లో ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ రూ.25,000లు చెల్లిస్తుందని మిగిలిన రూ. 25,000లు అభ్యర్థి చెల్లించాలన్నారు. ఇంకా మిగిలిన రూ.3,00,000 మూడు విడతలుగా అభ్యర్థి చెల్లిచాల్సి ఉంటుందని తెలియజేశారు.

Artificial Intelligence Lab: ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌ ల్యాబ్‌ ప్రారంభం

శిక్షణ పూర్తి చేసుకున్న వారికి జపాన్‌ దేశంలో ఉద్యోగావకాశం కల్పించడానికి కావాల్సిన సదుపాయాలను రాష్ట్ర నైపుణ్యాభివృద్ధి సంస్థ నవీన్‌స్‌ హెచ్‌ఆర్‌ పర్యవేక్షిస్తుందని ఉద్యోగం పొందిన అభ్యర్థి జీతం 1,10,000 నుంచి 1,40,000 వరకు ఉంటుందని తెలియజేశారు. ఆసక్తి కలిగిన వారు వెబ్‌సైట్‌ https://www.apssdc.in/home/online ప్రోగ్రాంలో రిజిస్ట్రేషన్‌ వివరాలు నమోదు చేసుకోవాలని పేర్కొన్నారు. మరిన్ని వివరాలకు ఫోన్‌ 9676965949 నంబర్‌ను సంప్రదించాలని సూచించారు.

Open Letter: ఉద్యోగులకు బహిరంగ లేఖలో విజ్ఞప్తి..

#Tags