EAMCET 2024: ముగిసిన ఎంసెట్ పరీక్షలు.. ఎంతమంది హాజరయ్యారంటే..!
Sakshi Education
వరంగల్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో నిర్వహించిన ఈ ఎంసెట్ పరీక్షలకు హాజరైన, గైర్హాజరైన విద్యార్థుల గురించి వివరించారు ఎంసెట్ కన్వీనర్ డిన్‌కుమార్ తెలిపారు..
విద్యారణ్యపురి: ఇంజనీరింగ్‌లో ప్రవేశాల కోసం నిర్వహించిన ఎంసెట్ పరీక్ష శనివారం ముగిసింది. వరంగల్ జోన్ పరిధిలో ఏర్పాటు చేసిన 10 కేంద్రాల్లో చివరి రోజు ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు నిర్వహించిన పరీక్షకు 2,040 మంది విద్యార్థులకు 1,993 మంది (97.7 శాతం) హాజరయ్యారు.
Transfers and Promotions: ఉపాధ్యాయుల పదోన్నతులు, బదిలీలు చేపట్టాలి..!
47 మంది గైర్హాజరైనట్లు ఎంసెట్ కన్వీనర్ బి.డిన్‌కుమార్ తెలిపారు. నర్సంపేట ప్రాంతంలో రెండు పరీక్ష కేంద్రాల్లో 403 మందికి 389 మంది (96.5శాతం) హాజరవ్వగా, 14 మంది గైర్హాజరైనట్లు పేర్కొన్నారు. ఈనెల 9వ తేదీ నుంచి ప్రారంభమైన ఎంసెట్ పరీక్షలు శనివారంతో ముగిశాయి. మొత్తం ఐదు సెషన్లలో పరీక్షలు జరిగాయి.
Tenth Advanced Supplementary: అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల సన్నద్ధం కోసం ఆదేశాలు జారీ..!
Published date : 13 May 2024 11:10AM