APFPS Recruitment 2023: ఏపీఎఫ్‌పీఎస్‌లో డీఆర్సీ పోస్టులకు దరఖాస్తులు

తుమ్మపాల: రాష్ట్ర ఫుడ్‌ ప్రాసెసింగ్‌ సొసైటీ(ఏపీఎఫ్‌పీఎస్‌)లో జిల్లా రిసోర్స్‌ పర్సన్‌(డీఆర్సీ)గా పనిచేసేందుకు ఆసక్తి గల నిరుద్యోగుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు సొసైటీ ఎగ్జిక్యూటివ్‌ డైరెక్టర్‌ జి.ప్రభాకరరావు బుధవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఫుడ్‌ ప్రాసెసింగ్‌లో డిగ్రీ కలిగిన వారికి ప్రాధాన్యత ఇస్తామన్నారు. వ్యవసాయ, ఉద్యాన, డిగ్రీలతో పాటు ఇతర డిగ్రీలు పూర్తి చేసి, బ్యాంకింగ్‌పై అవగాహన కలిగిన వారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చన్నారు. సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల ఏర్పాటుకు ఔత్సాహికులకు అవగాహన కల్పించడం, బ్యాంకు లింకేజీ చేయించడం, ఆహార పరిశ్రమల స్థాపనకు వీరు కృషి చేయాల్సి ఉంటుందన్నారు. పూర్తిగా ఇన్సెంటివ్‌ పద్ధతిలో మాత్రమే ప్రయోజనం ఉంటుందన్నారు. ఆసక్తి గల అభ్యర్థులు తమ బయోడేటాతో వచ్చే నెల 4న, మధ్యాహ్నం 2 గంటలకు ఉద్యాన కార్యాలయం, గుండాల వీధి, తుమ్మపాల గ్రామం నందు స్వయంగా హాజరుకావాల్సిందిగా కోరారు.

చదవండి: Private Sector: ఉపాధి అవకాశాలు పుష్కలం

#Tags