Free Coaching for Group1 Exam: గ్రూప్1 పరీక్షలకు ఉచిత శిక్షణ

న్యూశాయంపేట: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం, మైనార్టీ స్టడీ సర్కిల్, హైదరాబాద్ ఆధ్వర్యంలో గ్రూప్–1 పోస్టులకు దరఖాస్తు చేసుకున్న మైనార్టీ అభ్యర్థులు (ముస్లిం, క్రిస్టియన్, సిక్కులు, జైనులు, పార్శిలు) పోటీ పరీక్షల్లో విజయం సాధించేందుకు వీలుగా ఉచిత శిక్షణ ఇవ్వనున్నట్లు హనుమకొండ జిల్లా మైనార్టీ సంక్షేమాధికారి మేన శ్రీను మంగళవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in beautician and fashion designing: బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ
ఇందుకోసం ఉమ్మడి వరంగల్ జిల్లాలోని అర్హులైన మైనార్టీ అభ్యర్థుల నుంచి దరఖాస్తులు ఆహ్వానిస్తున్నట్లు ఆయన తెలిపారు. ఈ ఉచిత శిక్షణను 45 రోజుల పాటు అనుభవజ్ఞులైన ఫ్యాకల్టీచే అందించనున్నట్లు పేర్కొన్నారు.
ఆసక్తి ఉన్న అభ్యర్థులు హనుమకొండ సుబేదారిలోని కలెక్టరేట్ కాంప్లెక్స్ 2వ అంతస్తులోని కార్యాలయంలో ఈనెల 22 తేదీలోగా దరఖాస్తులు అందజేయాలన్నారు. పూర్తి వివరాలకు 7330990322 నంబర్‌లో సంప్రదించాలన్నారు.
Tags
- Free Coaching for Group Exams
- Group-1
- Free Coaching
- Group II Free Coaching
- Free Coaching ts exams
- ts exams
- group exms
- Free training
- TSPSC
- APPSC
- TSPSC Coaching
- state govt jobs
- govt exams
- compititive exams
- Minority Candidates
- Experienced faculty
- Hanumakonda district
- SakshiEducationUpdates
- Telangana State Government
- Minority Study Circle
- Newsayampet
- SakshiEducationUpdates