Free training in beautician and fashion designing: బ్యూటీషియన్, ఫ్యాషన్ డిజైనింగ్‌లో ఉచిత శిక్షణ
మహబూబ్‌నగర్: జిల్లా కేంద్రంలోని వృత్తి నైపుణ్య శిక్షణ కేంద్రం ఆధ్వర్యంలో జిల్లాలోని నిరుద్యోగ యువతకు స్వయం ఉపాధి కోర్సుల్లో ఈనెల 18 నుంచి 13వ బ్యాచ్ శిక్షణ తరగతులు ప్రారంభిస్తున్నట్లు జిల్లా యువజన, క్రీడల అధికారి ఎస్.శ్రీనివాస్ సోమవారం ఓ ప్రకటనలో తెలిపారు. ఈ మేరకు దరఖాస్తు తేదీని ఈనెల 17 వరకు పొడిగించినట్లు తెలిపారు.
ఆసక్తిగల వారు పాత డీఈఓ కార్యాలయంలోని వృత్తి నైపుణ్య శిక్షణకేంద్రంలో దరఖాస్తులు అందజేయాలని కోరారు. దరఖాస్తు వెంట విద్యార్హత, ఆధార్ కార్డు, పాస్‌పోర్టు సైజ్ ఫొటో, కులం సర్టిఫికెట్లు జతచేయాలని కోరారు. పదో తరగతి పాస్ లేదా ఫెయిల్ అయిన యువతకు మూడు నెలల పాటు ఫ్యాషన్ డిజైనింగ్, గార్మెట్ తయారీ, బ్యూటీషియన్, ఎంఎస్ ఆఫీస్, రిఫ్రిజిరేషన్, ఎయిర్ కండిషన్, మొబైల్ సర్వీసింగ్, సీసీ కెమెరాలు ఇన్‌స్టాల్, సర్వీసింగ్‌పై శిక్షణ ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
7వ తరగతి పాసైన వారికి జర్దోసి, మగ్గం, ఎలక్ట్రిషియన్‌పై శిక్షణ ఉంటుందని తెలిపారు. శిక్షణ అనంతరం పరీక్ష నిర్వహించి ఉత్తీర్ణులైన వారికి హైదరాబాద్ సెట్విన్ వారిచే సర్టిఫికెట్ ఇస్తారని, నిరుద్యోగ యువత ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని ఆయన సూచించారు.
మిగతా వివరాలకు సెంటర్ ఇన్‌చార్జి ఎస్.విజయ్‌కుమార్ (94415 65895)ను సంప్రదించాలని కోరారు.
Tags
- Free training in beautician and fashion designing courses
- Free training in beautician
- Free training
- Free Training for Women
- Free training in courses
- designing courses
- Fashion Designing Courses
- beautician course
- women in beautician course
- free training program
- Free training for unemployed youth
- Training classes
- Free Online Training Classes
- Special Training Classes
- beautician and fashion designing courses
- trending courses
- women training
- Vocational Training Centre
- Educational qualifications
- skill trainings
- Skill Development
- sakshieducation updates