Free training in computer courses: కంప్యూటర్ కోర్సుల్లో ఉచితంగా శిక్షణ
Sakshi Education
నెల్లూరు (టౌన్): వెంకటేశ్వరపురంలోని ప్రభుత్వ బాలుర ఐటీఐలో నిరుద్యోగులకు డొమెస్టిక్ డేటా ఎంట్రీ ఆపరేటర్ అనే కంప్యూటర్ కోర్సును ఏపీఎస్సెస్డీసీ ఆధ్వర్యంలో మూడు నెలల పాటు ఉచితంగా నిర్వహించనున్నామని ప్రిన్సిపల్ శ్రీధర్‌రెడ్డి శుక్రవారం ఒక ప్రకటనలో తెలిపారు.
Free training in computer courses
శిక్షణ అనంతరం వివిధ పరిశ్రమల్లో ఉద్యోగావకాశాలను కల్పించనున్నామని వెల్లడించారు. ఆసక్తి గల వారు కళాశాలకు సోమవారం వచ్చి తమ పేర్లను నమోదు చేసుకోవాలని కోరారు. వివరాలకు 94944 56326, 97045 10793 నంబర్లను సంప్రదించాలని సూచించారు.