Jobs In Israel: 10వ తరగతి పాసయ్యారా.. అయితే నెలకు రూ.1.37 లక్షల జీతం ఇచ్చే ఉద్యోగాన్ని పొందండి..
భారతీయ కార్మికులను ఇజ్రాయెల్ రిక్రూట్ చేసుకుంటోంది.
తెలంగాణలో పది వేల మందిని తీసుకునే అవకాశం ఉంది. ఫిబ్రవరిలో తెలంగాణ ఓవర్సీస్ మ్యాన్పవర్ కంపెనీ (టామ్‌కామ్) నైపుణ్య పరీక్షలు నిర్వహించనుంది. క్వాలిఫై అయితే పోలీస్ వెరిఫికేషన్ చేసి వీసాలు ఇస్తారు. వీరికి నెలకు రూ.1.37 లక్షల జీతం (6,100 ఇజ్రాయెలీ న్యూషెకల్)తోపాటు, నెలకు రూ.16,515 బోనస్ కూడా ఉండనుంది.
ఎంపికైన వారికి దీనితో పాటు మెడికల్ ఇన్సూరెన్స్, భోజనం, వసతి సదుపాయం కూడా కల్పించనుంది. 10వ తరగతి పాసై మూడేళ్ల అనుభవం, 25-45 సంవత్సరాల లోపు వయసు ఉన్న వారు అర్హులు. ఉద్యోగం సాదించిన వారు రోజుకు 9 గంటలు పనిచేయాలి. ఎక్కువ గంటలు పనిచేస్తే నిబంధనల ప్రకారం ఓవర్‌టైమ్ ఇస్తారు. మరిన్ని వివరాలకు 7893566493, 9849639539, 9100798204 నెంబర్లను సంప్రదించవచ్చు.
Jobs In Israel: ఇజ్రాయెల్‌లో ఉద్యోగాలు.. నెలకు రూ.1.37 లక్షల జీతం.. రూ.16 వేలు బోనస్..!
#Tags