TGPSC AE Selection List: ‘సివిల్ అసిస్టెంట్ ఇంజనీర్’ జాబితా విడుదల.. జాబితా కోసం క్లిక్ చేయండి..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: వివిధ ప్రభుత్వ శాఖల్లో అసిస్టెంట్ ఇంజనీర్ (సివిల్) ఉద్యోగాలకు అర్హత సాధించిన అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ జనవరి 24న విడుదల చేసింది.

సెప్టెంబర్ 12, 2022లో అసిస్టెంట్ ఇంజనీర్, మున్సిపల్ అసిస్టెంట్ ఇంజనీర్, టెక్నికల్ ఆఫీసర్, జూనియర్ టెక్నికల్ ఆఫీసర్ అండ్ డ్రిల్లింగ్ సూపర్‌వైజర్ ఉద్యోగాలకు టీజీపీఎస్సీ నోటిఫికేషన్ జారీ చేసింది. అసిస్టెంట్ ఇంజనీర్ ఉద్యోగాలకు 2023, అక్టోబర్ 18, 19 తేదీల్లో అర్హత పరీక్షలను నిర్వహించిన టీజీపీఎస్సీ.. ప్రాథమిక జాబితా విడుదల చేసిన అనంతరం మూడు విడతల్లో ధ్రువపత్రాల పరిశీలన చేపట్టింది.
చదవండి: TGPSCని సందర్శించిన ఈ రాష్ట్ర సర్వీస్ కమిషన్ బృందం.. న్యాయపరమైన చిక్కులపై చర్చ..
తాజాగా ఉద్యోగాలకు అర్హత సాధించిన 650 మంది అభ్యర్థుల ప్రొవిజినల్ జాబితాను విడుదల చేసినట్లు టీజీపీఎస్సీ కార్యదర్శి ఇ.నవీన్‌నికోలస్ జనవరి 24న ఒక ప్రకటనలో తెలిపారు. అభ్యర్థులు కమిషన్ వెబ్‌సైట్‌ను సందర్శించి పూర్తివివరాలు తెలుసుకోవాలని సూచించారు.
![]() ![]() |
![]() ![]() |
Published date : 27 Jan 2025 10:07AM
PDF
Tags
- Civil Assistant Engineer
- Assistant Engineer Selection List
- Telangana PSC releases provisional selection list for AE posts
- telangana public service commission
- TGPSC
- TGPSC AE 2024 Recruitment
- TSPSC
- TSPSC AE Result 2024 Released
- List of candidates for the post of Assistant Engineer
- Telangana News
- telanganajobs
- TSPSCRecruitment