IPS Officer Success Story : ఎటువంటి కోచించి లేకుండానే.. సివిల్స్ కొట్టా.. ఐపీఎస్ అయ్యా.. కానీ

యూనియ‌స్ ప‌బ్లిక్ స‌ర్వీస్ క‌మిష‌న్(UPSC) నిర్వ‌హించే సివిల్స్ క్లియ‌ర్ చేయ‌డం అనుకున్నంత ఈజీ కాదు. ఎంతో క‌ష్ట‌ప‌డి చ‌దివితే కానీ.. ఈ ల‌క్ష్యం చేరుకోలేము.
Mahesh Gite, IPS Officer Success Story

కానీ మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన మహేశ్‌ బి.గీతే మాత్రం ఎటువంటి కోచింగ్‌ లేకుండానే.. రెండో ప్రయత్నంలోనే ఐసీఎస్ కొట్టాడు. ఈ నేప‌థ్యంలో ఈ యువ ఐపీఎస్ మహేశ్‌ బి.గీతే స‌క్సెస్ స్టోరీ మీకోసం..

కుటుంబ నేప‌థ్యం : 

మహారాష్ట్రలోని అహ్మద్‌నగర్‌కు చెందిన బాబా సాహెబ్‌, సోజల్‌ దంపతుల రెండో సంతానం మహేశ్‌ బి.గీతే. పూర్తిగా వ్యవసాయ కుటుంబనేపథ్యంలోనే పెరిగారు. వ్యవసాయంలో తల్లిదండ్రుల కష్టాలను చూసి అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదువేందుకు పూణే వెళ్లారు.

☛➤ Success Story: ఒక‌టి త‌ర్వాత ఒక‌టి... ఆరు ప్ర‌భుత్వ ఉద్యోగాలు సాధించిన హైద‌రాబాదీ కుర్రాడు... ఎలా సాధించాడంటే..

వీరి ఇచ్చిన‌ సలహాతోనే సివిల్‌ వైపు.. 

మహేశ్‌ బి.గీతే.. అగ్రికల్చర్‌ బీఎస్‌సీ చదివారు. గ్రాడ్యుయేషన్‌ చదువుతున్న సమయంలో సీనియర్లు ఇచ్చిన సలహాతో సివిల్‌ సర్వీసెస్‌ వైపు దృష్టి సారించారు. ఎటువంటి కోచింగ్‌ లేకుండా నిరంతర సాధన చేశారు. రెండో ప్రయత్నంలో ఐసీఎస్‌కు ఎంపికయ్యారు. ప్రస్తుతం చొప్పదండి ఠాణాలో శిక్షణ ఐపీఎస్‌గా విధులు నిర్వహిస్తున్నారు.

☛ UPSC Civils Ranker Akhila Success Story : ప్రమాదంలో చేయిని కోల్పోయా..ఒంటి చేత్తోనే.. పోరాటం.. సివిల్స్ కొట్టానిలా..

డిగ్రీ పూర్తి కాగానే 2020లో సివిల్‌ సర్వీసెస్‌ పరీక్షకు హాజరయ్యారు. మొదటి ప్రయత్నంలో లక్ష్యం చేరకపోవడంతో రెండోసారి ప్రయత్నించారు. ఎటువంటి ప్రత్యేక కోచింగ్‌లు తీసుకోకుండా రెండో ప్రయత్నంలో ఐపీఎస్‌కు ఎంపికయ్యాడు. 2021 బ్యాచ్‌ ఐపీఎస్‌ అధికారిగా ప్రస్తుతం చొప్పదండి పోలీస్‌స్టేషన్‌ స్టేషన్‌ హౌజ్‌ ఆఫీసర్‌గా విధులు నిర్వహిస్తున్నారు. యువత మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలి.

☛ Inspirational IAS Success Story : డబ్బు కోసం ఆ ప‌ని చేశా.. చివ‌రికి ఇలా చ‌దివి ఐఏఎస్ ఆఫీస‌ర్ అయ్యానిలా.. కానీ..

మూడు నెలల పాటు ఇక్కడ..

ఓపెన్‌ డ్రింకింగ్‌, డ్రంక్‌ అండ్‌ డ్రైవ్‌, మైనర్‌ డ్రైవింగ్‌, ఈవ్‌ టీజింగ్‌ నియంత్రణపై దృష్టి సారిస్తాం. ఎస్సీ,ఎస్టీ కేసులపై అవేర్‌నెస్‌ పెంచుతాం. భూమి తగాదా సమస్యలు ఎక్కువగా వస్తున్నాయి. అధికారుల సహకారంతో సమస్యలు పరిష్కరిస్తాం. మూడు నెలల పాటు ఇక్కడ విధులు నిర్వహిస్తానని మహేశ్‌ బీ. గీతే. వివరించారు.

☛ IAS Officer Success Story : ఒక వైపు కరోనాతో తండ్రి మ‌ర‌ణం.. మ‌రో వైపు సివిల్స్ ఇంటర్వ్యూ.. చివ‌రికి..

#Tags