Skip to main content

Telangana: మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చు.. ఇలా అయితే కష్టమే..

సాక్షి, హైదరాబాద్‌: తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా విద్యా సంస్థలు ఫిబ్ర‌వ‌రి 1వ తేదీన‌ నుంచి పునః ప్రారంభమైన విష‌యం తెల్సిందే.
Telangana Students
Students

కరోనా దృష్ట్యా ఇప్పటికే స్కూళ్ళు, కాలేజీల్లో పెద్ద ఎత్తున శానిటైజేషన్‌ కార్యక్రమం చేపట్టారు. ప్రభుత్వ పాఠశాలల్లో ప్రధానోపాధ్యాయులు రెండు రోజులుగా గదులు, పరిసరాలను దగ్గరుండి శుభ్రం చేయించారు. విద్యార్థులు కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా పాటించేందుకు స్కూల్‌ పరిధిలో కమిటీలను కూడా ఏర్పాటు చేసినట్టు అధికారులు తెలిపారు.

మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చనే..
గతంలో విడుదల చేసిన కోవిడ్‌ నిబంధనలే ఇప్పుడూ అమలులో ఉంటాయని వారు చెప్పారు. అయితే తరగతి గదిలో పరిమిత సంఖ్యలో విద్యార్థులను కూర్చోబెట్టడం కష్టమని ఉపాధ్యాయ వర్గాలు అంటున్నాయి. ముఖ్యంగా బెంచ్‌కు ఒకరు చొప్పున, గదికి 20 మందిని మాత్రమే అనుమతించాలనే నిబంధన అమలు కష్టమేననే అభిప్రాయం వ్యక్తమవుతోంది. మొదట్లో విద్యార్థులు పెద్దగా రాకపోవచ్చనే అభిప్రాయం ఉన్నప్పటికీ కొన్ని స్కూళ్ళల్లో తక్కువ మంది వచ్చినా సామాజిక దూరం పాటించడానికి అవసరమైన మౌలిక వసతులు లేవని చెబుతున్నారు.  

వారం వరకు కష్టమే.. 
ప్రభుత్వ విద్యాసంస్థలు తెరిచినా వారం వరకు పెద్దగా క్లాసులు నిర్వహించలేమని ఉపాధ్యాయ వర్గాలు చెబుతున్నాయి. టీచర్లలో చాలామంది ఇప్పటికీ జలుబు, జ్వరాలు, ఇతర అనారోగ్య సమస్యలతో బాధపడుతున్నారని, వారిని ఇప్పటికిప్పుడు స్కూలుకు రమ్మనడం సరికాదని ఓ టీచర్‌ వ్యాఖ్యానించారు. రాష్ట్రవ్యాప్తంగా నిర్వహిస్తున్న ఇంటింటి జ్వర సర్వేలో కూడా ప్రతి ఇంట్లో ఒకరిద్దరికి అనారోగ్య సమస్యలున్నట్టు గుర్తించారని, దీనిని బట్టి చూస్తూ మొదటి వారం రోజుల వరకు విద్యార్థుల హాజరు పెద్దగా ఉండకపోవచ్చని ప్రధానోపాధ్యాయులు అంటున్నారు. అయితే టెన్త్‌ క్లాస్‌ విద్యార్థులకు ఏప్రిల్‌లో పరీక్షలుంటాయి. వారికి సకాలంలో సిలబస్‌ పూర్తి చేయాల్సి ఉంది. అందువల్ల వీరి హాజరు మాత్రం పెరిగే వీలుందని చెబుతున్నారు.  

వర్సిటీల్లో ఆన్‌లైనే.. ?
విశ్వవిద్యాలయాల పరిధిలో మరో వారం పాటు ఆన్‌లైన్‌ బోధనే నిర్వహించాలని ఉస్మానియా, జేఎన్‌టీయూ యూనివర్సిటీలు నిర్ణయించాయి. ఉన్నత విద్యా సంస్థల్లో చదివే వాళ్ళంతా 20 ఏళ్లు పైబడిన యువతే. వీరిలో చాలామందికి కరోనా లక్షణాలున్నట్టు అధికారులు అనుమానిస్తున్నారు. ముఖ్యంగా వర్సిటీ క్యాంపస్‌లలోని హాస్టళ్ళకు వీరిని అనుమతిస్తే ఇతరులకు వేగంగా కరోనా వ్యాప్తి జరిగే ప్రమాదం ఉందని అంటున్నారు. ఈ నేపథ్యంలో వారంపాటు ఆన్‌లైన్‌ క్లాసులు తీసుకోవాలని నిర్ణయించినట్టు ఓయూ వీసీ రవీందర్‌ తెలిపారు. 

ఇలా అయితే గదులు సరిపోవు..
పాఠశాలల్లో కోవిడ్‌ నిబంధనలు కచ్చితంగా అమలు చేయాలనే ఆదేశాలొచ్చాయి. అయితే విద్యార్థుల హాజరు పెరిగితే నిబంధనల ప్రకారం క్లాసుకు 20 మందినే ఉంచడం సాధ్యం కాదు. ఎక్కువ బెంచీలు కావాల్సి ఉంటుంది. ఒకవేళ అవి ఉన్నా వేయడానికి తరగతి గదులు సరిపోవు. విద్యార్థులు ఎక్కువ సంఖ్యలో హాజరైతే ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయక తప్పదు.  
                               – అరుణ శ్రీ, ప్రధానోపాధ్యాయురాలు, నల్లగొండ 

Schools and Colleges : ప్రభుత్వ, ప్రైవేటు విద్యాసంస్థల్లో తొలి రోజు హాజ‌రు ఇంతే .. కొన్ని చోట్ల అయితే

Telangana: బడి బాటలో పిల్లలు.. బదిలీల బాధలో టీచర్లు..ఇంత‌కి స్కూల్స్‌ జ‌రిగేనా..?

TS High Court: కాలేజీలు మూసి.. స్కూళ్లు తెరుస్తారా..?

Telangana: స్కూల్స్ సెల‌వులు పొడిగింపు పైనే విద్యాశాఖ దృష్టి.. ఇప్పట్లో క‌ష్ట‌మే..?

విద్యాసంస్థలకు మళ్లీ రెండు వారాలు సెలవులు ఇచ్చే అవ‌కాశం..ఎందుకంటే..?

Telangana: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్‌, కాలేజీలు ప్రారంభం.. ఇవి త‌ప్ప‌నిస‌రిగా పాటించాల్సిందే..

Holidays: ఫిబ్రవరి 15 వరకు స్కూల్స్‌, కాలేజీలు మూసివేత.. అలాగే పరీక్షలు వాయిదా..!

Omicron & Covid effect: కల్లోలం..జనవరి 31వ తేదీ వ‌ర‌కు పాఠశాలలు సెల‌వులు

Schools: ఫిబ్రవరి 1 నుంచి స్కూల్స్ పునఃప్రారంభం.. అయితే ఈ తరగతుల వాళ్ల‌కు మాత్రం సెల‌వులే..

Covid effect : మా పిల్లల్ని బడికి పంపించేది లేదు..కార‌ణం ఇదే..?

Breaking News: జనవరి 31 వరకు సెలవులు.. తెలుగు రాష్ట్రాల్లో..?

Holidays: జూనియ‌ర్ కాలేజీల‌కు సెల‌వులు

Omicron Effect: రేప‌టి నుంచి స్కూల్స్‌, కాలేజీలకు సెల‌వులు..కార‌ణం ఇదే..

Omicron Breaking News : ఇప్పట్లో స్కూళ్లు తెరిచేదే లే..!

Holidays: స్కూళ్లకు సెలవులు

Published date : 02 Feb 2022 09:35AM

Photo Stories