Skip to main content

TCS-NQT: డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ చదివిన వారికి గుడ్‌ న్యూస్‌.. కార్పొరేట్‌ రంగంలో కొలువు..

TCS NQT Skill Test
TCS NQT Skill Test

సాధారణ కాలేజీల్లో డిగ్రీ లేదా ఇంజనీరింగ్‌ చదివి.. కార్పొరేట్‌ రంగంలో కెరీర్‌ సొంతం చేసుకోవాలని కోరుకునే ప్రతిభావంతులకు గుడ్‌ న్యూస్‌! యూజీ, పీజీ, బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ అభ్యర్థుల కోసం టీసీఎస్‌ నేషనల్‌ క్వాలిఫయర్‌ టెస్ట్‌(ఎన్‌క్యూటీ) ప్రకటన వెలువడింది. ఈ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా టీసీఎస్‌తోసహ పలు కార్పొరేట్‌ కంపెనీలు ఉద్యోగావకాశాలు కల్పిస్తున్నాయి. ప్రస్తుతం 2021 డిసెంబర్, 2022 మార్చి సెషన్‌కు సంబంధించి టీసీఎస్‌ ఎన్‌క్యూటీ దరఖాస్తులు కోరుతోంది. ఈ నేపథ్యంలో.. ఎన్‌క్యూటీ పూర్తి వివరాలు...

  • టీసీఎస్‌–ఎన్‌క్యూటీకి నోటిఫికేషన్‌ విడుదల 
  • 2021 డిసెంబర్, 2022 మార్చి సెషన్‌కు దరఖాస్తులు

దేశంలోని ఐటీ దిగ్గజ సంస్థల్లో టాటా కన్సల్టెన్సీ(టీసీఎస్‌) ఒకటి. మరి ఇలాంటి సంస్థల్లో ఉద్యోగం సొంతం చేసుకోవాలంటే.. సాధారణ డిగ్రీతో సాధ్యమేనా.. అని విద్యార్థులు ఆలోచిస్తుంటారు. చదివిన కాలేజీ, డిగ్రీతో సంబంధం లేకుండా.. ప్రతిభనే ప్రామాణికంగా తీసుకొని ఉద్యోగావకాశాలు కల్పిస్తోంది టీసీఎస్‌.

ఇందుకోసం 2018 నుంచి టీసీఎస్‌ అనుబంధ సంస్థ అయిన టీసీఎస్‌ అయాన్‌.. నేషనల్‌ క్వాలిఫైయర్‌ టెస్ట్‌(ఎన్‌క్యూటీ) పేరుతో పరీక్షలు నిర్వహిస్తోంది. ఈ పరీక్షను టీసీఎస్‌తో సహా ఐటీ, బీఎఫ్‌ఎస్‌ఐ, మ్యానుఫ్యాక్చరింగ్, ఫార్మా, ఎఫ్‌ఎంసీజీ తదితర రంగాల కంపెనీల్లో రిక్రూట్‌మెంట్‌కు సింగిల్‌ విండో టెస్ట్‌గా పరిగణిస్తున్నారు. ఈ టెస్ట్‌లో సాధించిన స్కోర్‌కు రెండేళ్ల వ్యాలిడిటీ ఉంటుంది. 

అర్హతలు
టీసీఎస్‌ ఎన్‌క్యూటీ పరీక్షకు రెండేళ్ల పని అనుభ‌వం ఉన్న యంగ్‌ ప్రొఫెషనల్స్‌ తోపాటు యూజీ, పీజీ(ఏ విభాగం విద్యార్థులైనా), బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్, ఎమ్మెస్సీ, ఎంసీఏ.. వీటిలో ఏదైనా కోర్సు ఫుల్‌టైమ్‌ విధానంలో ఉత్తీర్ణులైన అభ్యర్థులు అర్హులు. ప్రీ ఫైనల్‌/ఫైనల్‌ ఇయర్‌ విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు. ఇంజనీరింగ్‌ అన్ని బ్రాంచ్‌లూ, ఎమ్మెస్సీ అన్ని విభాగాల విద్యార్థులూ ఈ పరీక్షకు హాజరుకావచ్చు. 

పరీక్ష విధానం

  • ఎంట్రీ లెవల్‌ జాబ్స్‌కు సంబంధించి కార్పొరేట్‌ సంస్థలు కోరుకునే కాగ్నిటివ్‌ ఎబిలిటీస్‌ని ఎన్‌క్యూటీ టెస్ట్‌ ద్వారా పరీక్షిస్తారు. అభ్యర్థుల అంతర్గత ప్రతిభను గుర్తించే విధంగా ఈ పరీక్ష వి«ధానం ఉంటుంది. ఇందులో కాగ్నిటివ్‌ స్కిల్స్, సైకోమెట్రిక్‌ టెస్ట్, ఐటీ ఇండస్ట్రీ, బ్యాంకింగ్‌ అండ్‌ ఫైనాన్షియల్‌ సర్వీసెస్‌ ఇండస్ట్రీ, ఐటీ ప్రోగ్రామింగ్, అకౌంటెంట్, ఎంఎల్, ఏఐ తదితర అంశాలుంటాయి. 
  • ఈ పరీక్షలో అభ్యర్థుల జనరల్‌ ఎబిలిటీ, వెర్బల్, న్యూమరికల్,రీజనింగ్‌ ఎబిలిటీస్‌ను పరీక్షిస్తారు. వీటన్నింటికి నార్మలైజ్డ్‌ ఎన్‌క్యూటీ స్కోర్‌ను ఇస్తారు. ఇండస్ట్రీ అవసరాలకు అనుగుణంగా ఎప్పటికప్పుడు ఈ పరీక్షలో ప్రమాణాలు పెంచుతుంటారు.

ఇంటర్వ్యూ
ఎన్‌క్యూటీ పరీక్షలో సాధించిన స్కోర్‌ ఆధారంగా మెరిట్‌ ప్రకారం అభ్యర్థులను ఇంటర్వ్యూలకు పిలుస్తారు. అందులో ప్రతిభ చూపిన వారిని ఉద్యోగంలోకి తీసుకుంటారు. ఈ పరీక్షకు సంబంధించిన మోడల్‌ టెస్ట్‌.. టీసీఎస్‌ పోర్టల్‌లో అందుబాటులో ఉంటుంది. 

ఇలా రాసుకోవచ్చు
ఎన్‌క్యూటీ పరీక్షను ఆన్‌లైన్‌ విధానంలో.. ఇంటి నుంచే రాసుకునే వెసులుబాటు ఉంది. ఒకవేళ ఇంటి నుంచే రాయడానికి అవసరమైన సౌకర్యాలు లేకుంటే.. సమీపంలోని టీసీఎస్‌ అయాన్‌ కేంద్రంలో పరీక్షకు హాజరుకావచ్చు. ప్రతి మూడు నెలలకు ఒకసారి ఎన్‌క్యూటీ పరీక్ష ఉంటుంది. 

ముఖ్యమైన సమాచారం

  • దరఖాస్తు విధానం: ఆన్‌లైన్‌ ద్వారా దరఖాస్తు చేసుకోవాలి.
  • డిసెంబర్‌ సెషన్‌ దరఖాస్తులకు చివరి తేదీ: 05.12.2021
  • డిసెంబర్‌ సెషన్‌ పరీక్ష తేదీ: 25.12.2021
  • మార్చి 2022 సెషన్‌కు సంబంధించి ఎన్‌క్యూటీ పరీక్షకు హాజరుకావాలనుకునే వారు కూడా ప్రస్తుతం దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఈమెయిల్‌: info.tcsionhub@tcs.com
  • వెబ్‌సైట్‌: https://learning.tcsionhub.in

చ‌ద‌వండి: Industry 4.0: బ్రాంచ్‌ ఏదైనా.. ఈ స్కిల్స్‌పై పట్టు సాధిస్తేనే అవకాశాలు

Published date : 18 Nov 2021 06:51PM

Photo Stories