TSPSC Paper Leak Case 2023 : లవర్ కోసం.. క్వశ్చన్ పేపర్‌ను రూ.6 లక్షలకు కొనుగోలు.. మరో ఇద్దరు ఆరెస్ట్.. ఇప్పటి వరకు..
తాజాగా టీఎస్‌పీఎస్‌సీ పేపర్ లీక్ కేసులో మరో ఇద్దరు అరెస్ట్ అయ్యారు. సాయి లౌకిక్, సుష్మితలను సిట్ అధికారులు అదుపులోకి తీసుకున్నారు. ప్రియురాలు సుష్మిత కోసం లౌకిక్ డీఏఓ(డివిజనల్ అకౌంట్స్ ఆఫీసర్) పేపర్ కొనుగోలు చేసినట్లు సిట్ అధికారులు గుర్తించారు. ప్రవీణ్ నుంచి రూ. 6 లక్షలకు లౌకిక్ ఈ పేపర్ కొన్నట్లు నిర్ధారించారు.
చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్..ఇంకా..
ఫిబ్రవరి 26వ తేదీ డీఏఓ పరీక్ష జరగ్గా.. పేపర్ లీక్ అంశం తెరపైకి వచ్చిన తరువాత టీఎస్‌పీఎస్‌సీ ఈ పరీక్షను కూడా రద్దు చేసిన విషయం తెల్సిందే. తెలంగాణలో టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్ వ్యవహారం సంచలనంగా మారిన విషయం తెలిసిందే. ఈ కేసులో ఇప్పటి వరకు 17 మందిని అరెస్ట్ చేశారు.
☛ TSPSC: ఏఈఈ ఉద్యోగ పరీక్షలు తేదీలివే.. ఈసారి హాల్‌టికెట్లు ఇలా..
చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా..
ఈ కేసు విచారణను దర్యాప్తు చేస్తున్న సిట్ అధికారులు సోమవారం కమిషన్ చైర్మన్ జనార్దన్‌రెడ్డి వాంగ్మూలం నమోదు చేశారు. రాజ్యాంగబద్ధమైన పదవి కావడంతో చైర్మన్‌కు నోటీసులు పంపకుండా స్వయంగా టీఎస్‌పీఎస్సీ కార్యాలయానికి అధికారులు వెళ్లారు. సిట్ చీఫ్‌గా ఉన్న అదనపు సీపీ ఏఆర్ శ్రీనివాస్ నేతృత్వంలో సీసీఎస్ ఏసీపీ కె.నర్సింగ్‌రావుతో కూడిన బృందం టీఎస్‌పీఎస్సీకి వెళ్లి మూడు గంటలకుపైగా చైర్మన్‌ను ప్రశ్నించింది. ఈ మేరకు సిట్‌కు జనార్దన్‌రెడ్డి వివరణ ఇచ్చారు.
చదవండి: TSPSC Paper Leak list : టీఎస్‌పీఎస్సీ.. లీకైన ఆ 15 ప్రశ్నపత్రాల లిస్ట్ ఇదే..
90 శాతం విచారణను..
టీఎస్‌పీఎస్సీ పేపర్ లీక్‌పై టెక్నికల్ సాక్ష్యాల కోసం సిట్ అధికారులు ఇప్పటికే ఎఫ్ఎస్‌ఎల్ విశ్లేషణ చేయించారు. ఆ నివేదిక కూడా పోలీసులకు అందింది. ప్రవీణ్, రాజశేఖర్, రేణుక నుంచి సీజ్ చేసిన సెల్‌ఫోన్లను ఎఫ్‌ఎస్‌ఎల్ తో విశ్లేషణ చేయించారు. టీఎస్‌పీఎస్సీ ఆఫీసులోని ప్రవీణ్, రాజశేఖర్ లాప్టాప్, సిస్టమ్స్‌ను ఎఫ్‌ఎస్‌ఎల్‌కు పంపించారు. ఈ నివేదిక రావడంతో 90 శాతం విచారణను సిట్ పూర్తి చేసినట్లయింది. ఎఫ్‌ఎస్‌ఎల్ రిపోర్టును కోర్టుకు సిట్ అందించనుంది. విదేశాల్లో ఉన్న ఎన్‌ఆర్‌ఐ ప్రశాంత్‌కు మరోసారి సిట్ నోటీసులు ఇవ్వనుంది. 150 మందికిపైగా వ్యక్తులను సిట్ ఇప్పటివరకు విచారించింది. టీఎస్‌పీఎస్సీ ఛైర్మెన్, సెక్రెటరీ, మెంబర్, 15 మంది నిందితులు, గ్రూప్-1 అభ్యర్థులను సిట్ విచారించింది. ఈ నెల 11న హై కోర్టుకు సిట్ స్టేటస్ రిపోర్ట్ సమర్పించనుంది.
చదవండి: TSPSC Exam Schedule 2023 : రద్దైన పరీక్షల రీషెడ్యూలు ఇలా.. మే నెలలో..!
అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు..
ఒకరి ద్వారా మరొకరికి పేపర్ చేరింది. ప్రవీణ్, రాజశేఖర్ నుంచి రూ.15 లక్షలకు పేపర్ తీసుకున్న నిందితులు.. మరికొంతమందికి విక్రయించారు. పోలీసుల విచారణలో ఈ విషయం బయటపడటంతో.. ఇలా ఎప్పటినుంచి పేపర్లు లీక్ అవుతున్నాయనే అంశం అభ్యర్థులను కలవరపెడుతోంది. ఇలా ఇంకా ఎన్ని పేపర్లు లీక్ అయ్యాయనేది ఆందోళనకరంగా మారింది. అనేక ప్రశ్నాపత్రాలను నిందితులు లీక్ చేసినట్లు గుర్తించారు. మరోవైపు పేపర్ లీక్ కేసుపై ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఈడీ మనీలాండరింగ్ కేసు నమోదు చేసి విచారిస్తోంది. నిందితుల మధ్య లావాదేవీల విషయంపై ఆరా తీస్తోంది. నగదు లావాదేవీలు హవాలా మార్గం ద్వారా జరిగినట్లు ఈడీ అనుమానం వ్యక్తం చేస్తోంది. దీంతో నిందితుల మధ్య లావాదేవీలు ఎలా జరిగాయనే దానిపై ఈడీ ఫోకస్ పెట్టినట్లు తెలుస్తోంది.
☛➤ KTR : ఈ టీఎస్‌పీఎస్సీ పరీక్షలకు.. మళ్లీ ఫీజు కట్టాల్సిన అవసరం లేదు.. అలాగే అన్ని..