TSPSC: ఏఈఈ ఉద్యోగ పరీక్షలు తేదీలివే.. ఈసారి హాల్‌టికెట్లు ఇలా..
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: ప్రశ్నపత్రాల లీకేజీ వ్యవహారంతో రద్దయిన పరీక్షలను తిరిగి నిర్వహించేందుకు తెలంగాణ స్టేట్ పబ్లిక్ సర్విస్ కమిషన్ దృష్టి సారించింది.
మే నెలలో ఏఈఈ ఉద్యోగ పరీక్షలు.. పరీక్ష తేదీలివే..
తాజాగా అసిస్టెంట్ ఎగ్జిక్యూటివ్ ఇంజనీర్ (ఏఈఈ) ఉద్యోగ పరీక్షల తేదీలను ఖరారు చేసింది. ఈ పరీక్షలకు దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు నిర్దేశించిన తేదీల్లో హాజరు కావాలని స్పష్టం చేసింది. పరీక్ష తేదీకి వారం రోజుల ముందు హాల్‌టికెట్లను వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచనున్నట్లు టీఎస్‌పీఎస్సీ కార్యదర్శి వెల్లడించారు.