TSPSC New Exams Dates 2023 List : టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన కొత్త పరీక్ష తేదీలు ఇవే.. ఏఏ పరీక్ష ఎప్పుడంటే..?
ఈ మేరకు ఐదు నిమాయక పరీక్షలకు సంబంధించిన కొత్త షెడ్యూల్‌ను విడుదల చేసింది. ఏప్రిల్ 23వ తేదీన జరగాల్సిన అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్‌స్పెక్టర్ పరీక్షను జూన్ 28వ తేదీకి వాయిదా వేసింది.
అలాగే ఏప్రిల్ 25వ తేదీన జరగాల్సిన అగ్రికల్చర్ ఆఫీసర్ పరీక్షను జూన్ 16వ తేదీకి వాయిదా వేసింది. మే 7వ తేదీన జరగాల్సిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్షను మే 19వ తేదీకి వాయిదా వేస్తున్నట్లు ప్రకటించింది.
ఏప్రిల్ 26, 27 తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 18వ తేదీకి వాయిదా వేసింది. అలాగే మే 15, 16వ తేదీల్లో జరగాల్సిన గ్రౌండ్ వాటర్ డిపార్ట్‌మెంట్ నాన్ గెజిటెడ్ కేటగిరీల పరీక్షను జులై 20వ తేదీకి రీషెడ్యూల్ చేస్తున్నట్లు టీఎస్‌పీఎస్సీ ప్రకటించింది.
ఈ పరీక్షలు యథావిధిగానే..
రీషెడ్యూలు కానివి యథావిధిగా జరిగే అవకాశాలున్నాయి. వాటిని ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో నిర్వహించేందుకు కమిషన్ ఏర్పాట్లు చేస్తోంది. జూన్ 11న గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్షతో పాటు మిగతా గ్రూప్స్, ఇతర పరీక్షలు ఇప్పటికే ప్రకటించిన తేదీల్లో జరగనున్నాయి.
టీఎస్‌పీఎస్సీ ప్రకటించిన పరీక్షల తేదీలు ఇలా..
1. అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ :
ఏఈఈ పరీక్షల తేదీలను కూడా ఇటీవల టీఎస్‌పీఎస్సీ ప్రకటన చేసింది. ఈ పరీక్షలను మే 8, మే9, మే 21వ తేదీన నిర్వహించనున్నారు.
2. అగ్రికల్చర్ ఆఫీసర్ :
ఈ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట ఏప్రిల్ 25న టీఎస్‌పీఎస్సీ ప్రకటించగా.. తాజాగా దీనిని మే 16 నిర్వహించనున్నట్లు ప్రకటించింది.
3. డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులు :
డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులకు సంబంధించి పరీక్ష తేదీని మొదట మే 7వ తేదీ ప్రకటించగా.. తాజాగా దీనిని మే 19న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
4. గ్రూప్-1 ప్రిలిమినరీ పరీక్ష :
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్షను జూన్ 11, 2023న నిర్వహించనున్నట్లు టీఎస్పీఎస్సీ ప్రకటించింది.
5. గ్రూప్-2 పరీక్ష :
తెలంగాణలో గ్రూప్ 2 ఉద్యోగాలకు సంబంధించి పరీక్ష తేదీలను టీఎస్‌పీఎస్సీ ఇటీవల ఖరారు చేసింది. ఆగస్టు 29, 30 తేదీల్లో ఈ పరీక్షలను నిర్వహించనున్నట్లు పేర్కొంది. ఈ తేదీల్లో ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు. తెలంగాణలో గ్రూప్-2 దరఖాస్తు ప్రక్రియ ఫిబ్రవరి 16 సాయంత్రం 5 గంటలకు ముగిసింది. మొత్తం 5,51,943 దరఖాస్తులు వచ్చినట్లు పబ్లిక్ సర్వీస్ కమిషన్ ప్రకటన విడుదల చేసింది.
6. గ్రూప్-4 పరీక్ష :
గ్రూప్-4 పరీక్షను ఆఫ్‌లైన్ విధానంలోనే నిర్వహించనున్నారు. దీనికి దాదాపు 10లక్షల దరఖాస్తులు వచ్చాయి. జులై 1వ తేదీనన ఈ పరీక్షను నిర్వహించనున్నారు. ఈ పరీక్ష షెడ్యూల్ లో కూడా ఎలాంటి మార్పు ఉండకపోవచ్చు.
☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ
7. హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు :
ఈ ఉద్యోగాలకు సంబంధించి పరీక్షల షెడ్యూల్ కూడా మార్పులు చేశారు. మొదట ఏప్రిల్ 4వ తేదీన నిర్వహించాల్సి ఉండగా.. దీనిని జూన్ 17కి టీఎస్‌పీఎస్సీ వాయిదా వేసింది.
8. గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ :
గ్రౌండ్ వాటర్ బోర్డులో నాన్ గెజిటెడ్ ఉద్యోగాలకు జులై 21వ తేదీన పరీక్ష నిర్వహించనున్నారు. గెజిటెడ్ ఉద్యోగాలకు టీఎస్‌పీఎస్సీ జులై 18, 19న పరీక్షలు నిర్వహించనుంది.
☛ Separate States: దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు ఇవే!
9. అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ పోస్టులు :
అసిస్టెంట్ మోటార్ వెహికిల్ ఇన్ స్పెక్టర్ (AMVI) పోస్టులకు మొదట ఏప్రిల్ 23న పరీక్ష తేదీని ప్రకటించగా.. దీనిని టీఎస్‌పీఎస్సీ జూన్ 26కు వాయిదా వేశారు.
టీఎస్పీఎస్సీ విడుదల చేసిన నోటిఫికేషన్లు | కొత్త పరీక్షల తేదీలు |
గవర్నమెంట్ పాలిటెక్నిక్ కాలేజీ లెక్చరర్స్ | మే 13 |
అగ్రికల్చర్ ఆఫీసర్ | మే 16 |
ఫిజికల్ డైరెక్టర్ అండ్ లైబ్రైరియన్ పోస్టులు | మే 17 |
అసిస్టెంట్ ఎగ్జిక్యూట్ ఇంజనీర్ | మే 08, మే 09, మే 21 |
డ్రగ్స్ ఇన్ స్పెక్టర్ పోస్టులు | మే 19 |
గ్రూప్ 1 ప్రిలిమినరీ పరీక్ష | జూన్ 11 |
హార్టికల్చర్ ఆఫీసర్ ఉద్యోగాలు | జూన్ 17 |
ఏఎంవీఐ | జూన్ 26 |
గ్రూప్ 4 పరీక్ష | జులై 01 |
గ్రౌండ్ వాటర్ డిపార్ట్ మెంట్ (గెజిటెడ్ - నాన్ గెజిటెడ్) | జులై 18, 19, 21 |
గ్రూప్ 2 పరీక్ష.. | ఆగస్టు 29, 30 |