Skip to main content

TS Gurukulam Jobs Application Process : 9,231 గురుకుల పోస్టులకు.. దరఖాస్తు విధానం ఇదే..! ఈ విధానంలోనే పోస్టుల భర్తీ..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (టీఆర్‌ఈఐఆర్‌బీ) 9,231 ఉద్యోగాల భ‌ర్తీకి ప‌లు జాగ్ర‌త్త‌లు తీసుకుంటూ.. వ్యూహాత్మకంగా ముందుకు సాగుతోంది.
ts gurukulam jobs application details in telugu
ts gurukulam jobs application process

ఒకేసారి 9,231 కొలువుల భర్తీకి ఒకే దఫా 9 నోటిఫికేషన్లు జారీ చేసిన బోర్డు.. నూరు శాతం ఉద్యోగాల్లో నియామకాలు జరిపేలా వ్యూహాత్మక ప్రణాళికతో ముందుకు సాగుతోంది. ప్రస్తుతం భర్తీ చేయనున్న పోస్టులన్నీ బోధన రంగానికి సంబంధించినవే.

☛ ఇవి పాటిస్తే.. టీచ‌ర్ జాబ్ మీదే..||DSC Best Preparation Tips

ఒక్కో అభ్యర్థి ఈ పోస్టులకు మాత్ర‌మే..
ఒక అభ్యర్థి మూడు నుంచి నాలుగు పోస్టులకు (వేర్వేరు సబ్జెక్టులకు) దరఖాస్తు చేసుకునే వీలుంది. ఈ పరీక్షలన్నీ వేర్వేరు తేదీల్లో నిర్వహిస్తుండటంతో ఇలాంటి వారంతా  వివిధ పరీక్షలకు హాజరై అర్హత సాధించే అవకాశాలు ఎక్కువగానే ఉన్నాయి. ఈ నేపథ్యంలో వ్యూహాత్మక ప్రణాళిక ద్వారా భర్తీ ప్రక్రియ చేపట్టకుంటే ఖాళీలు ఎక్కువగా మిగిలేపోయే ప్రమాదం ఉంటుంది. అందువల్ల అవరోహణ (డిసెండింగ్‌ ఆర్డర్‌) విధానాన్ని అమలు చేయాలని టీఆర్‌ఈఐఆర్‌బీ నిర్ణయించింది. ఈ పద్ధతిలో నియామకాలు చేపడితే పూర్తిస్థాయిలో పోస్టులు భర్తీ చేపట్టవచ్చని బోర్డు అంచనా వేస్తోంది. 

☛ తెలంగాణ డీఎస్సీ/టెట్‌ స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి

తొమ్మిది కేటగిరీల్లో కొలువుల భ‌ర్తీ ఇలా..
ఐదు సంక్షేమ గురుకుల సొసైటీల పరిధిలో గురుకుల డిగ్రీ కాలేజీలు, జూనియర్‌ కాలేజీలు, పాఠశాలల్లో 9,231 పోస్టుల భర్తీకి టీఆర్‌ఈఐఆర్‌బీ నోటిఫికేషన్లు జారీ చేసింది. ఇందులో డిగ్రీ లెక్చరర్‌ (డీఎల్‌), జూనియర్‌ లెక్చరర్‌(జేఎల్‌), ఫిజికల్‌ డైరెక్టర్‌ (పీడీ), పోస్టు గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (పీజీటీ), ట్రైన్డ్‌ గ్రాడ్యుయేట్‌ టీచర్‌ (టీజీటీ), డ్రాయింగ్, ఆర్ట్, క్రాఫ్ట్, మ్యూజిక్‌ టీచర్, లైబ్రేరియన్‌ పోస్టులున్నాయి.కొన్ని పోస్టులు కాలేజీలు, స్కూళ్లలో ఉండడంతో రెండింటికీ దాదాపుగా ఒకే అర్హతలున్న అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవచ్చు. అంటే డిగ్రీ లెక్చరర్‌కు అర్హతలున్న అభ్యర్థులు, జూనియర్‌ లెక్చరర్‌తో పాటు పీజీటీ, టీజీటీ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

☛ చదవండి: టీఎస్‌పీఎస్సీ - స్టడీ మెటీరియల్ | బిట్ బ్యాంక్ | సక్సెస్ స్టోరీస్ | గైడెన్స్ | సిలబస్ | ప్రివియస్‌ పేపర్స్ | ఎఫ్‌ఏక్యూస్‌ | ఆన్‌లైన్ క్లాస్ | ఆన్‌లైన్ టెస్ట్స్ | ఏపీపీఎస్సీ

ఈ పద్ధతి ద్వారానే.. 
ఉద్యోగ ఖాళీల భర్తీ ప్రక్రియను నియామక సంస్థలు ఒక క్రమ పద్ధతిలో చేపడతాయి. ఇష్టానుసారంగా చేపడితే అన్ని పోస్టులూ భర్తీకాక తిరిగి ప్రకటనలు జారీ చేసి నియామకాలు చేపట్టాల్సి ఉంటుంది. దరఖాస్తుల స్వీకరణ, పరీక్షల నిర్వహణ, ఫలితాల ప్రకటన అంతా బోర్డు పరిస్థితులకు అనుగుణంగా నిర్వహించినప్పటికీ నియామకాల కౌన్సెలింగ్‌ను మాత్రం ఒక ప్రణాళిక ప్రకారం పూర్తి చేస్తారు.

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 2,008 జూనియర్‌ లెక్చరర్, ఇతర పోస్టులు

దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో..
ప్రస్తుతం 9 కేటగిరీల్లో కొలువులున్నాయి. వీటిని పైస్థాయి నుంచి కింది స్థాయికి అవరోహణ క్రమంలో  విభజించిన తర్వాత వాటికి కౌన్సెలింగ్‌ నిర్వహించి నియామకాలు చేపడతారు. అంటే ముందుగా డిగ్రీ కాలేజీల్లో కొలువులు భర్తీ చేసిన తర్వాత జూనియర్‌ కాలేజీల్లో పోస్టులు భర్తీ చేస్తారు. ఆ తర్వాత పాఠశాలల్లో పైస్థాయి పోస్టులైన పీజీటీ, టీజీటీ తర్వాత ఇతక కేటగిరీ పోస్టుల్లో నియామకాలు చేపడతారు. దీంతో ప్రకటించిన పోస్టులన్నీ పూర్తిస్థాయిలో భర్తీ అవుతాయని అధికారులు భావిస్తున్నారు. ఇలా కాకుండా కిందిస్థాయి నుంచి మొదలు పెడితే ఇక్కడ ఎంపికైన అభ్యర్థి, ఆ తర్వాత పైస్థాయి పోస్టుకు ఎంపికైతే కిందిస్థాయి పోస్టును వదిలేసేందుకు అవకాశం ఉంటుంది. ఆ విధంగా ఆ ఖాళీ భర్తీ కాకుండా మిగిలిపోతుంది. ఈ నేపథ్యంలోనే వ్యూహాత్మక ప్రణాళిక రూపొందించి అమలు చేసేందుకు టీఆర్‌ఈఐఆర్‌బీ అధికారులు కసరత్తు చేస్తున్నారు.

చదవండి: TS Gurukulam Notification 2023: తెలంగాణ గురుకులాల్లో 1276 పీజీటీ పోస్టులు

ఒక అభ్యర్థి తన అర్హత‌ను బ‌ట్టి..
గురుకుల విద్యా సంస్థల్లో ఉద్యోగాల భర్తీకి సంబంధించి దరఖాస్తు ప్రక్రియ ఐదు అంచెల్లో సాగనుంది. ఇందుకోసం తెలంగాణ గురుకుల విద్యా సంస్థల నియామకాల బోర్డు (బీటీఆర్‌ఈఐఆర్‌బీ) ప్రత్యేకంగా వెబ్‌సైట్‌ను రూపొందించింది. బోర్డు ఒకేసారి 9 నోటిఫికేషన్లు జారీ చేసి 9 వేలకు పైగా ఉద్యోగాల భర్తీకి చర్యలు చేపట్టిన నేపథ్యంలో.. ఒక అభ్యర్థి తన అర్హతల మేరకు ఒకటి కంటే ఎక్కువ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అవకాశం ఉంది.

ద‌ర‌ఖాస్తు విధానం ఇలా..
అభ్యర్థి ఆన్‌లైన్‌లో ప్రతిసారి దరఖాస్తు సమయంలో వివరాలను సమర్పించాల్సిన అవసరం లేకుండా వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ (ఓటీఆర్‌) ప్రక్రియను తీసుకొచ్చింది. గతంలో కేవలం ప్రిన్సిపాల్‌ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు మాత్రమే ఓటీఆర్‌ పూర్తి చేయాల్సి ఉండేది. తాజాగా తెలంగాణ స్టేట్‌ పబ్లిక్ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ) మోడల్‌ను అనుసరిస్తూ ప్రతి అభ్యర్థికీ ఓటీఆర్‌ను తప్పనిసరి చేసింది.

భారీగా దరఖాస్తులు వ‌స్తే..
సుదీర్ఘ కాలం తర్వాత గురుకుల బోర్డు భారీ సంఖ్యలో ఉద్యోగాల భర్తీకి ప్రకటనలు జారీ చేయడంతో, దరఖాస్తులు కూడా పెద్ద సంఖ్యలో వస్తాయని అధికారులు భావిస్తున్నారు. ఈ నేపథ్యంలో దరఖాస్తు ప్రక్రియ సులభతరంగా ఉండేందుకు బీటీఆర్‌ఈఐఆర్‌బీ ఐదు అంచెల పద్ధతి అనుసరిస్తోంది. దరఖాస్తు చేయాలనుకున్న అభ్యర్థి ముందుగా బోర్డు వైబ్‌సైట్‌ను తెరిచి ఆన్‌లైన్‌ అప్లై అనే ఆప్షన్‌ ద్వారా పేజీ తెరిచి దరఖాస్తు ప్రక్రియను ప్రారంభించాలి.

దరఖాస్తు పత్రం అత్యంత కీలకం..
తొలుత ఓటీఆర్‌ పూర్తి చేసుకోవాలి. ఆ తర్వాత అభ్యర్థికి యూజర్‌ ఐడీ, పాస్‌ వర్డ్‌ తయారవుతుంది. అనంతరం ఆ వివరాలతో లాగిన్‌ అయ్యాక పరీక్ష ఫీజును చెల్లించాలి. ఆ తర్వాత ఎంపిక చేసుకున్న పోస్టుకు సంబంధించిన వివరాలను ఆన్‌లైన్‌ దరఖాస్తు పత్రంలో పూరించి సబ్మిట్‌ చేయాలి. చివరగా వెబ్‌సైట్‌లో అప్‌లోడ్‌ అయిన దరఖాస్తును డౌన్‌లోడ్‌ చేసుకుని ప్రింట్‌ తీసుకోవాల్సి ఉంటుంది. ఈ దరఖాస్తు పత్రం అత్యంత కీలకం. ఉద్యోగానికి ఎంపికైన సమయంలో ఈ దరఖాస్తు పత్రం అవసరమవుతుందని అధికారులు చెబుతున్నారు. 

వన్‌ టైమ్‌ రిజిస్ట్రేషన్ ప్రారంభం..
బీటీఆర్‌ఈఐఆర్‌బీ వెబ్‌సైట్‌లో ఓటీఆర్‌ ప్రక్రియ బుధవారం నుంచి అందుబాటులోకి వచ్చింది. ఏప్రిల్ 17వ తేదీ నుంచి వివిధ ఉద్యోగాలకు సంబంధించిన దరఖాస్తు ప్రక్రియ ప్రారంభం కానుంది. ఆసక్తి ఉన్న అభ్యర్థులు వెంటనే ఓటీఆర్‌ ప్రక్రియ పూర్తి చేసుకోవాలని స్పష్టం చేసింది. ఆధార్‌ కార్డు నంబర్‌ ద్వారా ఓటీఆర్‌ ఫారాన్ని తెరిచి, వివరాలను నమోదు చేసి, సంబంధిత ధ్రువపత్రాలను కూడా అప్‌లోడ్‌ చేయాల్సి ఉంటుంది. 

బుధవారం తొలిరోజు అభ్యర్థులు పెద్ద ఎత్తున వెబ్‌సైట్‌ను తెరిచారు. దీంతో వెబ్‌సైట్‌పై ఒత్తిడి పెరిగి పేజీ తెరుచుకోవడంలో తీవ్ర జాప్యం జరిగినట్లు తెలిసింది. దీంతో బోర్డుకు ఫిర్యాదులు వెల్లువెత్తాయి. అనంతరం అధికారులు చర్యలు చేపట్టడంతో సాయంత్రానికి వెబ్‌సైట్‌ కాస్త స్పీడందుకుంది.

9231 పోస్టులు కేట‌గిరి వారీగా ఇలా..

ts gurukulam jobs details telugu

  పోస్టు పేరు పోస్టుల సంఖ్య
1. డిగ్రీ లెక్చరర్ పీడీ, లైబ్రేరియన్‌ 868
2. జూనియ‌ర్ లెక్చరర్‌, లైబ్రేరియన్‌, ఫిజికల్ డైరెక్టర్ 2008
3. పోస్ట్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్ (పీజీటీ) 1276
4. ట్రైయిన్డ్ గ్రాడ్యుయేట్ టీచ‌ర్స్ (టీజీటీ) 4090
5. లైబ్రేరియ‌న్ స్కూల్ 434
6. ఫిజిక‌ల్ డైరెక్టర్స్‌ ఇన్ స్కూల్ 275
7. డ్రాయింగ్ టీచ‌ర్స్ ఆర్ట్ టీచ‌ర్స్ 134
8. క్రాఫ్ట్ ఇన్‌స్ట్రక్టర్‌ క్రాఫ్ట్ టీచ‌ర్స్ 92
9. మ్యూజిక్ టీచ‌ర్స్ 124
  మొత్తం ఖాళీలు 9231
Published date : 15 Apr 2023 02:09PM

Photo Stories