Skip to main content

Separate States: దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు ఇవే!

భాషాప్రయుక్త ప్రాతిపదికన ఆంధ్రరాష్ట్రం ఏర్పడింది. దీంతో దేశంలోని ఇతర ప్రాంతాల్లోనూ భాషా ప్రాతిపదికపై రాష్ట్రాలను ఏర్పాటు చేయాలనే డిమాండ్‌ బలంగా ప్రస్తావనకు వచ్చింది. దీనికి అనుగుణంగా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ కమిషన్‌ను నియమించింది. కె.­ఎం.ఫణిక్కర్, హెచ్‌.ఎం.కుంజ్రు సభ్యులుగా ఉన్న ఈ కమిషన్‌కు ఫజల్‌ అలీ నేతృత్వం వహించారు.
Separation of states

1955 సెప్టెంబర్‌లో ఈ కమిషన్‌ నివేదిక సమర్పించింది. భాషా ప్రాతిపదికన రాష్ట్రాల ఏర్పాటును ఫజల్‌ అలీ కమిషన్‌ సమర్థించింది. కానీ ఒక భాష–ఒక రాష్ట్రం అనే డిమాండ్‌ను తిరస్కరించింది. ప్రస్తుతం ప్రత్యేక రాష్ట్రాల కోసం ఇంకా చాలా చోట్ల ఉద్యమాలు జరుగుతూనే ఉన్నాయి.

చదవండి: 1956 తర్వాత ఏర్పాటైన రాష్ట్రాలు..ఫజల్‌ అలీ కమిషన్‌ ప్రతిపాదనలు.. 

దేశవ్యాప్తంగా ప్రత్యేక రాష్ట్రాల కోసం జరుగుతున్న ఉద్యమాలు

  • అసోం    – బోడోలాండ్, కర్బి, అంగ్లాంగ్‌
  • కర్ణాటక    – కొడగు (కూర్గ్‌)
  • మహారాష్ట్ర    – విదర్భ
  • గుజరాత్‌    – సౌరాష్ట్ర
  • ఉత్తరప్రదేశ్‌    – హరితప్రదేశ్, పశ్చిమ ప్రదేశ్, అవధ్‌ ప్రదేశ్, పూర్వాంచల్‌
  • మధ్యప్రదేశ్‌    – వింధ్యప్రదేశ్, అవధ్‌
  • బిహార్, జార్ఖండ్‌    – మిథిలాంచల్, కోసల్‌
  • కేరళ, కర్ణాటక సరిహద్దులో     – తుళునాడు
  • పశ్చిమ బెంగాల్‌    – గూర్ఖాలాండ్‌
  • ఒడిశా    – కోసల్‌
  • జమ్మూ కశ్మీర్‌    – లడక్‌
  • మేఘాలయ    – గారోలాండ్‌
  • మణిపూర్‌    – కుకీలాండ్‌

చదవండి: భారత రాజ్యాంగ పీఠికలోని పదజాలం!

Published date : 14 Dec 2023 06:29PM

Photo Stories