Study Material for Competitive Exams: రాష్ట్రాల ఏర్పాటు – ప్రక్రియా పద్ధతి!
పై అంశాలకు సంబంధించిన బిల్లును పార్లమెంటులోని ఏ సభలోనైనా ప్రవేశపెట్టవచ్చు.
వివరణ..
రాష్ట్ర పునర్‌వ్యవస్థీకరణ బిల్లులో ఆర్థిక వనరుల పంపకాలు ఉంటే అది స్పెషల్ కేటగిరీ బిల్లు అవుతుంది. అలాంటి సందర్భాల్లో బిల్లును లోక్‌సభలోనే ప్రతిపాదించాలి. తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు విషయంలో ఈ వివాదాన్ని గమనించవచ్చు.
- పై బిల్లులను రాష్ట్రపతి పూర్వ అనుమతితోనే ప్రవేశపెట్టాలి.
- ఈ షరతును 1955లో అయిదో రాజ్యాంగ సవరణ ద్వారా చేర్చారు.
- సంబంధిత బిల్లును పార్లమెంటులో ప్రవేశపెట్టడానికి ముందే ప్రభావితమవుతున్న రాష్ట్ర శాసనసభల అభిప్రాయాన్ని రాష్ట్రపతి కోరతారు.
- సంబంధిత రాష్ట్ర శాసనసభ రాష్ట్రపతి సూచించిన నిర్ణీత సమయంలోనే తమ అభిప్రాయాన్ని తెలపాలి.
- రాష్ట్ర శాసనసభలు వ్యక్తీకరించిన అభిప్రాయాలను పార్లమెంటు పరిగణలోకి తీసుకోవచ్చు లేదా తీసుకోకపోవచ్చు.
వివరణ..
1966లో పంజాబ్ నుంచి హర్యానా రాష్ట్రాన్ని ఏర్పాటు చేసినప్పుడు పంజాబ్‌లో రాష్ట్రపతి పాలన, విధానసభ సుప్తచేతనావస్థలో ఉండటం వల్ల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును రాష్ట్ర శాసనసభ అభిప్రాయానికి నివేదించలేదు. ఆంధ్రప్రదేశ్ పునర్ వ్యవస్థీకరణ బిల్లును శాసనసభ తిరస్కరించింది.
- పార్లమెంటు ఉభయసభలు సంబంధిత బిల్లును సాధారణ మెజారిటీతో వేర్వేరుగా ఆమోదించాలి. ఉభయసభల మధ్య ప్రతిష్టంభన ఏర్పడితే, సంయుక్త సమావేశానికి ఆస్కారం లేదు. బిల్లు వీగిపోతుంది.
- బిల్లును రాష్ట్రపతి తప్పని సరిగా ఆమోదించాలి. పునఃపరిశీలనకు అవకాశం లేదు.
- రాష్ట్రపతి ఆమోదం తెలిపితే బిల్లు చట్టంగా మారుతుంది. దీంతో ప్రక్రియ పూర్తి అవుతుంది.
- కొత్త రాష్ట్రం ఎప్పటి నుంచి అమల్లోకి వస్తుందనేది కేంద్ర ప్రభుత్వం ప్రకటిస్తుంది. దీన్ని అపాయింటెడ్ డేట్ అంటారు.
ప్రకరణ–4
ఈ ప్రకరణ సంబంధిత తదుపరి పరిణామాలను వివరిస్తుంది. ప్రకరణ 2, 3 ప్రకారం ఏదైనా సవరణ చేసినప్పుడు 1, 4 షెడ్యూల్‌లో పేర్కొన్న అంశాలను కూడా తదనుగుణంగా మార్చాలి. దీనికోసం పార్లమెంటు ప్రత్యేక చట్టం చేయాల్సిన అవసరం లేదు. ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా, తదనుగుణంగా 1, 4 షెడ్యూల్‌లోని అంశాలు కూడా మార్పునకు గురవుతాయి.
వివరణ
ప్రకరణ 2, 3 ప్రకారం ఏ సవరణ చేసినా దాన్ని రాజ్యాంగ సవరణగా పరిగణించరు. ఈ అంశాన్ని ప్రకరణ 4(2)లో స్పష్టంగా పేర్కొన్నారు. రాష్ట్రాల ఏర్పాటు, పునర్‌వ్యవస్థీకరణ, ఇతర అంశాలకు రాజ్యాంగ సవరణ తప్పనిసరి కాదు.
JEE Advanced 2024 Registration: జేఈఈ అడ్వాన్స్‌డ్ రిజిస్ట్రేషన్‌కు రేపే చివరి తేదీ.. అప్లై చేశారా?
వివాదాలు– సుప్రీంకోర్టు తీర్పులు
బెరుబారి యూనియన్ వివాదం–1960
ప్రకరణ 3 ప్రకారం, రాష్ట్రాల సరిహద్దును కుదించే అధికారం పార్లమెంటుకు ఉంది. అయితే ఒక రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేసే అధికారం ఉందా? అనే వివాదం తలెత్తింది. దీనికి సంబంధించి రాష్ట్రపతి సుప్రీంకోర్టు సలహాను కోరారు. ఈ వివాదంలో సుప్రీంకోర్టు తీర్పు చెబుతూ, రాష్ట్ర భూభాగాన్ని ఇతర దేశాలకు బదిలీ చేయాలంటే ప్రకరణ 368 ప్రకారం పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలని పేర్కొంది. అయితే, అంతర్గతంగా బదిలీ చేసేందుకు సాధారణ మెజారిటీ సరిపోతుంది.
గమనిక: బెరుబారి అనేది పశ్చిమ బెంగాల్ రాష్ట్రంలోని ఒక ప్రాంతం. 9 చదరపు మైళ్ల విస్తీర్ణంతో ఉంటుంది. కేంద్ర ప్రభుత్వం ఒక ఒప్పందం ద్వారా పాకిస్తాన్‌కు కొంత భాగాన్ని బదిలీ చేసింది.
GPAT Notification 2024: జీప్యాట్–2024 నోటిఫికేషన్ విడుదల.. స్కోర్‌తో ఎం.ఫార్మసీలో ప్రవేశం..!
బాబూలాల్ మారాం వర్సెస్ ముంబై స్టేట్ కేస్ (1960)
రాష్ట్రాల పునర్‌వ్యవస్థీకరణ బిల్లును ఒక్క పర్యాయం మాత్రమే సంబంధిత రాష్ట్ర శాసనసభల అభిప్రాయానికి నివేదిస్తారు. ఒక వేళ ఆ బిల్లులో తర్వాత చేసిన మార్పులకు సంబంధించి మరోసారి రాష్ట్ర పరిశీలనకు పంపాల్సిన అవసరం లేదని సుప్రీంకోర్టు తీర్పు చెప్పింది. ఉదాహరణ:తెలంగాణ రాష్ట్రం, ఖమ్మం జిల్లాలోని పోలవరం కింది 7 ముంపు మండలాలను ఆంధ్రప్రదేశ్‌కు బదలాయించడం.
స్టేట్ ఆఫ్ పంజాబ్ వర్సెస్ యూనియన్ ఆఫ్ ఇండియా (1982)
భారత రాజ్యాంగం నిర్ణీతమైన సమాఖ్య వ్యవస్థను ఏర్పరచలేదు. నిర్మాణపరంగా సమాఖ్య అయినప్పటికీ ఇది సమాఖ్య, ఏక కేంద్ర ప్రభుత్వాల మిశ్రమంగా పేర్కొంది.
ముళ్ల పెరియార్ పర్యావరణ వివాదం (2006)
నదీజలాల పంపిణీ విషయంపై చట్టాలను చేసే అధికారం రాష్ట్ర శాసనసభకు ఉండదు. ఈ అధికారం పార్లమెంటుకు మాత్రమే ఉంటుందని సుప్రీంకోర్టు ఈ కేసులో తీర్పు చెప్పింది.