Territories Study Material: భారత భూభాగం– భారత యూనియన్
రాష్ట్రాల ఏర్పాటు–పునర్ వ్యవస్థీకరణ
భారత దేశంలో సమాఖ్య వ్యవస్థ ఉంది. కేంద్ర, రాష్ట్రాలు రాజ్యాంగ పరంగా అధికార విభజన సూత్రం ఆధారంగా పనిచేస్తాయి. సమాఖ్య, రాష్ట్రాల ఏర్పాటు, పునర్ వ్యవస్థీకరణ తదితర అంశాలను ఒకటో భాగంలో ప్రకరణలు 1 నుంచి 4 వరకు ప్రస్తావించారు.
భారత భూభాగం
ప్రకరణ–1
ఈ ప్రకరణ ప్రకారం, భారత భూభాగం అంటే రాష్ట్రాల సరిహద్దులు, కేంద్రపాలిత ప్రాంతాలు, కేంద్ర ప్రభుత్వం సముపార్జించిన ఇతర భూభాగాలు ఉంటాయి.
భారత భూభాగం అనే భావన విస్తృతమైంది. భారత సార్వభౌమాధికారం ఏ విధంగా విస్తరించి ఉంటుందో తెలుపుతుంది. భారత సార్వభౌమాధికారం భౌగోళిక ప్రాంతాలకే పరిమితం కాదు. భారత సముద్ర ప్రాదేశిక జలాలు 12 నాటికల్ మైళ్ల వరకు, విశిష్ట ఆర్థిక మండళ్లు 200 నాటికల్ మైళ్ల వరకు, అలాగే భారత అంతరిక్ష సరిహద్దులకూ సార్వభౌమాధికారం వర్తిస్తుంది.
భారత యూనియన్
ఇందులో రాష్ట్రాలు మాత్రమే ఉంటాయి. రాష్ట్రాలు సమాఖ్యలో అంతర్భాగంగా ఉంటూ నిర్ణీత అధికారాలను కలిగి ఉంటాయి. ఈ పదం కేంద్ర రాష్ట్ర సంబంధాలను సూచిస్తుంది.
https://education.sakshi.com/appsc/study-material/procedural-method-formation-states-study-material-155212
రాష్ట్రాల సమ్మేళనం
భారత రాజ్యాంగం, ఒకటో ప్రకరణలో భారతదేశాన్ని రాష్ట్రాల యూనియన్‌గా పేర్కొంది. సమాఖ్య అనే పదాన్ని ఎక్కడా ప్రస్తావించలేదు. కెనడా సమాఖ్యను స్ఫూర్తిగా తీసుకుని యూనియన్ అనే పదాన్ని రాజ్యాంగంలో చేర్చారు.
భారత సమాఖ్య అమెరికాలా రాష్ట్రాల మధ్య ఒప్పందం ద్వారా ఏర్పడలేదు. అలాగే కెనడా మాదిరిగా ఏకకేంద్ర రాజ్యం సమాఖ్యగా విభజితమవలేదు. భారత సమాఖ్య ఒక ప్రత్యేక పద్ధతిలో ఏర్పడింది.
కేంద్ర రాష్ట్రాల మధ్య ఒప్పందం లేదు. కాబట్టి యూనియన్ నుంచి రాష్ట్రాలు విడిపోలేదు. అమెరికా సమాఖ్యలో ప్రారంభంలో రాష్ట్రాలకు కేంద్రం నుంచి విడిపోయే హక్కు ఉండేది. అయితే ఆ హక్కును తర్వాత రద్దు చేశారు.
కాబట్టి భారత సమాఖ్యను విచ్ఛిన్నం కాగల రాష్ట్రాల, అవిచ్ఛిన్న యూనియన్ (ఇన్ డెస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ డెస్ట్రక్టిబుల్ స్టేట్స్)గా పేర్కొంటారు. అమెరికాను ఇన్‌డెస్ట్రక్టిబుల్ యూనియన్ ఆఫ్ ఇన్‌డెస్ట్రక్టిబుల్ స్టేట్స్‌గా పేర్కొంటారు.
ప్రకరణ–2
ఈ ప్రకరణ ప్రకారం పార్లమెంటు ఒక చట్టం ద్వారా కొత్త ప్రాంతాలను చేర్చుకోవచ్చు, ఇతర దేశాలకు బదిలీ చేయవచ్చు. ఈ అధికారం భారత భూభాగంలో లేని అంశాలకు వర్తిస్తుంది. ఈ అధికారం పార్లమెంటుకు సంబంధించినదైనా అంతర్జాతీయ ఒప్పందాలకు లోబడి ఉంటుంది.
వివరణ..
విదేశీ భూభాగాలను భారతదేశంలో చేర్చుకున్నప్పుడు పార్లమెంటు ప్రత్యేక మెజారిటీతో రాజ్యాంగ సవరణ చేయాలి.
ఉదాహరణ:1961లో గోవాను భారత్‌లో కలిపినప్పుడు 12వ రాజ్యాంగ సవరణ చేశారు. అలాగే పాండిచ్చేరికి సంబంధించి 1962లో 14వ రాజ్యాంగ సవరణ చేశారు. 1975లో 36వ రాజ్యాంగ సవరణ ద్వారా సిక్కింను భారత రాష్ట్రంగా చేర్చుకున్నారు.
ప్రకరణ–3
ఇందులో కింది అంశాలు ఉన్నాయి.
- కొత్త రాష్ట్రాన్ని ఏర్పాటు చేయడం.
- రెండు లేదా అంతకంటే ఎక్కువ రాష్ట్రాలను కలిపి నూతన రాష్ట్రం ఏర్పాటు.(ఆంధ్ర రాష్ట్రం, హైదరాబాద్ కలయికతో 1956లో ఆంధ్రప్రదేశ్ ఏర్పాటు). అలాగే రాష్ట్రాన్ని విడగొట్టి కొత్త రాష్ట్రం ఏర్పాటు చేయడం. (2014 జూన్‌లో ఏర్పడిన తెలంగాణ)
- రాష్ట్ర విస్తీర్ణాన్ని పెంచవచ్చు.
- రాష్ట్ర విస్తీర్ణాన్ని తగ్గించవచ్చు.
- రాష్ట్ర సరిహద్దులను సవరించవచ్చు.
- రాష్ట్రాల పేర్లను మార్చవచ్చు.
Tags
- APPSC
- Polity
- groups
- indian territory
- Indian Polity
- Indian Polity Study Material
- Competitive Exams
- TSPSC
- groups preparation plan
- Sakshi Education News
- group exams
- study material for competitive exams
- study material for groups exam
- TSPSC Study Material
- APPSC Study Material
- Education News
- study material in sakshi education