Skip to main content

TS Government Jobs : ఇంజనీరింగ్ అభ్య‌ర్థ‌ల‌కు గుడ్‌న్యూస్‌.. 1,663 ప్ర‌భుత్వ ఉద్యోగాల భ‌ర్తీకి పచ్చజెండా..

సాక్షి ఎడ్యుకేష‌న్ : ఇంజనీరింగ్‌ చదివిన నిరుద్యోగులకు గుడ్ న్యూస్‌. వివిధ ప్రభుత్వ శాఖల్లో ఉద్యోగాల భర్తీని వేగవంతం చేసిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం.. తాజాగా 1,663 కొలువుల నియామకాలకు గ్రీన్‌ సిగ్నల్ ఇచ్చింది.
telangana government jobs
Telangana Government Jobs 2022

ఈ మేరకు ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ఉత్తర్వులు జారీ చేశారు. తాజాగా భర్తీకి అనుమతులిచ్చిన పోస్టుల్లో 90 శాతం కొలువులు ఇంజనీరింగ్‌ కేటగిరీకి సంబంధించినవే.ఇరిగేషన్‌ అండ్‌ క్యాచ్‌మెంట్‌ ఏరియా డెవలప్‌మెంట్‌ (ఐ–క్యాడ్‌), ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌బీ, ఆర్థిక శాఖల పరిధిలోని ఈ ఖాళీలను తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (టీఎస్‌పీఎస్సీ)ద్వారా భర్తీ చేయనున్నారు. 

TSPSC: 9,168 గ్రూప్-4 ఉద్యోగాలు.. ప‌రీక్ష సిలబస్ ఇదే..!

TSPSC: 1,373 గ్రూప్-3 ఉద్యోగాలు.. ఎగ్జామ్స్‌ సిలబస్ ఇదే..!

ఇప్పటివరకు 46,988 పోస్టుల భర్తీకి..
ప్రస్తుతం అనుమతిచ్చిన పోస్టుల్లో ఐ–క్యాడ్‌కు సంబంధించి 1,326 ఉద్యోగాలు, ట్రాన్స్‌పోర్ట్‌–ఆర్‌అండ్‌ బీ శాఖకు సంబంధించి 284 ఉద్యోగాలు, ఆర్థిక శాఖకు సంబంధించి 53 ఉద్యోగాలున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం తాజాగా జారీ చేసిన అనుమతులతో కలిపి ఇప్పటివరకు 46,988 పోస్టుల భర్తీకి ఆమోదం తెలిపినట్లైంది.

TSPSC Groups Success Tips: కోచింగ్‌కు వెళ్లడం శుద్ధ దండగ.. ఇలా చ‌దివితే నెలలో ‘గ్రూప్స్‌’ కొట్టొచ్చు..

ఇప్ప‌టికే..

టీఎస్‌పీఎస్సీ ఉద్యోగాల స్డ‌డీ మెటీరియ‌ల్‌, బిట్‌బ్యాంక్‌, మోడ‌ల్‌పేప‌ర్స్‌, ప్రీవియ‌స్ పేప‌ర్స్‌, గైడెన్స్‌, ఆన్‌లైన్ టెస్టులు, స‌క్సెస్ స్టోరీలు మొద‌లైన వాటి కోసం క్లిక్ చేయండి
తెలంగాణ రాష్ట్ర పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ ద్వారా 9,526 ఉద్యోగాలు భర్తీ చేయనుండగా, రాష్ట్ర స్థాయి పోలీసు నియామకాల బోర్డు ద్వారా 18,279 ఉద్యోగాలు, మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 10,028 ఉద్యోగాలు, జిల్లా నియామకాల కమిటీ ద్వారా 59, తెలంగాణ రెసిడెన్షియల్‌ ఎడ్యుకేషనల్‌ ఇన్‌స్టిట్యూషన్స్‌ రిక్రూట్‌మెంట్‌ బోర్డు ద్వారా 9,096 ఉద్యోగాలు భర్తీ చేస్తారు. వీటిలో పోలీసు, గ్రూప్‌–1, మెడికల్‌ ఆఫీసర్‌ ఉద్యోగాలకు నోటిఫికేషన్లు వెలువడగా.. మిగతా పోస్టులకు సంబంధించి ప్రకటనలు వెలువడాల్సి ఉంది.

TS Government Jobs

TSPSC& APPSC Groups: గ్రూప్స్‌లో గెలుపు బాట‌ కోసం.. ప్ర‌ముఖ స‌బ్జెక్ట్ నిపుణుల సూచ‌న‌లు- సలహాలు ..

 

Success Story: వేలల్లో వచ్చే జీతం కాద‌నీ.. నాన్న కోరిక కోసం గ్రూప్-2 సాధించానిలా..

Published date : 03 Jul 2022 11:35AM

Photo Stories