TSPSC గ్రూప్–4 సర్వీసెస్ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి
గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–1, గ్రూప్–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జీఓ నంబర్ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు.
గ్రూప్–4 సర్వీసెస్
వివిధ ప్రభుత్వ శాఖల్లో జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్ పోస్టులు
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ మొత్తం మార్కులు: 300
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ | 150 | 150 | 150 |
2 | సెక్రటేరియల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
గెజిటెడ్ కేటగిరీ (గ్రూప్–1, గ్రూప్–2 పరిధిలోకి రానివి)
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మొత్తం మార్కులు: 450
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) | ప్రశ్నలు | సమయం(ని.) | మార్కులు |
పేపర్–1 | 150 | 150 | 150 |
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్‌పేపర్–2 | 150 | 150 | 300 |
- కమిషన్ సూచించిన సబ్జెక్టులు
నాన్ గెజిటెడ్ కేటగిరీ (గ్రూప్–2, 3, 4 పరిధిలోకి రాని పోస్టులు)
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్: మొత్తం మార్కులు 300
రాత పరీక్ష (ఆబ్జెక్టివ్ టైప్) | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
పేపర్–1 | 150 | 150 | 150 |
జనరల్ స్టడీస్ మరియు జనరల్ ఎబిలిటీస్ పేపర్–2 | 150 | 150 | 150 |
- నిర్దేశించిన సబ్జెక్టులు
మిసలీనియస్ కేటగిరీస్ అసిస్టెంట్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్స్
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు 650
క్రమ సంఖ్య | సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | జనరల్ ఇంగ్లిష్ పేపర్ | 100 | 100 | 100 |
2 | జనరల్ స్టడీస్ పేపర్ | 150 | 150 | 150 |
3 | ఆప్షనల్ పేపర్–1 | 100 | 100 | 200 |
4 | ఆప్షనల్ పేపర్–2 | 100 | 100 | 200 |
ఫారెస్టు రేంజ్ ఆఫీసర్
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు 450
క్రమ సంఖ్య | సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | జనరల్ ఇంగ్లిష్ పేపర్ | 100 | 100 | 100 |
2 | మ్యాథమేటిక్స్ పేపర్ | 100 | 100 | 100 |
⦁ (జనరల్ ఇంగ్లిష్ పేపర్, మ్యాథమెటిక్స్ పరీక్షల మార్కులను ర్యాంకింగ్‌లోకి పరిగణించరు)
క్రమ సంఖ్య | సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ పేపర్ | 150 | 150 | 150 |
2 | ఆప్షనల్ పేపర్ (ఒక్కటే) | 150 | 150 | 300 |
జిల్లా సైనిక్ వెల్ఫేర్ ఆఫీసర్
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు 450
క్రమ సంఖ్య | సబ్జెక్టు | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | పేపర్–1 జనరల్ స్టడీస్ | 150 | 150 | 150 |
2 | పేపర్–2 ఇంగ్లిష్ | 150 | 150 | 150 |
3. | పేపర్–3 ఎలిమెంటరీ మ్యాథమెటిక్స్ | 150 | 150 | 150 |
సూపర్‌వైజర్/ మ్యాట్రన్ గ్రేడ్–2 (జువైనల్ వెల్ఫేర్)
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు 300
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (ని.) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ | 150 | 150 | 150 |
2 | సంబంధిత సబ్జెక్టు | 150 | 150 | 150 |
- (జనరల్ స్టడీస్ సబ్జెక్ట్: పదో తరగతి వరకు హిస్టరీ, జియోగ్రఫీ, సివిక్స్, ఎకనామిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీ, బాటనీ, జువాలజీ, కరెంట్ అఫైర్స్, బాలల హక్కులు, చట్టాలకు సంబధించిన అంశాలుంటాయి)
అసిస్టెంట్ తెలుగు ట్రాన్స్‌లేటర్
స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు 300
పేపర్ | సబ్జెక్టు | సమయం(ని.) | ప్రశ్నలు | మార్కులు |
1 | జనరల్ స్టడీస్ జనరల్ ఎబిలిటీస్ | 150 | 150 | 150 |
2 | ట్రాన్స్‌లేషన్ | 90 | – | 150 |
వివిధ శాఖల్లో సీనియర్ రిపోర్టర్ ఇంగ్లిష్/ తెలుగు/ ఉర్దూ
స్కీం ఆఫ్ ఎగ్జామినేషన్
సీనియర్ రిపోర్టర్ (ఇంగ్లిష్)
పేపర్: ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ –150 వర్డ్స్ పర్ మినిట్ డ్యూరేషన్: 7 మినిట్స్, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్–90 నిమిషాలు)
సీనియర్ రిపోర్టర్ (తెలుగు)
పేపర్: తెలుగు షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ –80 వర్డ్స్ పర్ మినిట్, డ్యూరేషన్–7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్–90 నిమిషాలు)
సీనియర్ రిపోర్టర్ (ఉర్దూ)
పేపర్: ఉర్దూ షార్ట్‌హ్యాండ్ డిక్టేషన్ – 130 వర్డ్స్ పర్ మినిట్ డ్యూరేషన్7 నిమిషాలు, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్– 90 నిమిషాలు)
ఇంగ్లిష్ రిపోర్టర్ ఇన్ లెజిస్లేచర్ సర్వీస్
రాత పరీక్ష (కన్వెన్షనల్ టైప్)
సీనియర్ రిపోర్టర్ (ఇంగ్లిష్)
పేపర్: ఇంగ్లిష్ షార్ట్‌హ్యాండ్ డ్యూరేషన్–180 వర్డ్స్ పర్ మినిట్ డ్యూరేషన్: 5 మినిట్స్, 150 మార్కులు
(ట్రాన్‌స్క్రిప్షన్ ఇన్ లాంగ్ హ్యాండ్– 90 నిమిషాలు)
అర్హత మార్కులు
- నిర్దేశించిన ఉద్యోగాలకు సంబంధించి స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ ప్రకారం అభ్యర్థి అన్ని పరీక్షలకు తప్పకుండా హాజరై అర్హత సాధించాలి.
- కేటగిరీల వారీగా అన్ని పేపర్లలో ఓసీ, ఈడబ్ల్యూఎస్, ఎక్స్ సర్వీస్‌మెన్, స్పోర్ట్స్‌మెన్‌లు కనీసం 40 శాతం, బీసీలు 35 శాతం, ఎస్సీ, ఎస్టీలు కనీసం 30 శాతం మార్కులు సాధించాలి.
చదవండి:
TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్ 1
TSPSC గ్రూప్–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!
TSPSC గ్రూప్–3 పరీక్షా విధానం ఇదే!