TSPSC గ్రూప్–3 పరీక్షా విధానం ఇదే!
గ్రూప్స్ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్–1, గ్రూప్–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్ సోమేశ్‌కుమార్ జీఓ నంబర్ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 675 మార్కులకు ఉండే గ్రూప్–2 పరీక్షను (ఇంటర్వ్యూ 75 మార్కులు పోను) 600 మార్కులకు కుదించారు.
గ్రూప్–3 సర్వీసెస్
సీనియర్ అకౌంటెంట్, ఆడిటర్ (పే అండ్ అకౌంట్స్), సీనియర్ అకౌంటెంట్ (ట్రెజరీ), సీనియర్ ఆడిటర్, అసిస్టెంట్ ఆడిటర్, జూనియర్ అసిస్టెంట్, జూనియర్ అకౌంటెంట్
స్కీమ్ ఆఫ్ ఎగ్జామినేషన్ : మార్కులు: 450
పేపర్ | సబ్జెక్ట్ | ప్రశ్నలు | సమయం (గంటలు) | మార్కులు |
1 | జనరల్ స్టడీస్, జనరల్ సైన్స్ | 150 | 2 1/2 | 150 |
2 | హిస్టరీ, పాలిటీ అండ్ సొసైటీ
|
150 | 2 1/2 | 150 |
3 | ఎకానమీ అండ్ డెవలప్‌మెంట్
|
150 | 2 1/2 | 150 |
(ఈ పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, హిందీలో నిర్వహిస్తారు)
చదవండి:
TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్ 1
TSPSC గ్రూప్–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!