Skip to main content

TSPSC పరీక్షా విధానంలో మార్పులు.. 900 మార్కులతో గ్రూప్‌ 1

changes in the group 1 exam pattern New Syllabus details here
changes in the group 1 exam pattern New Syllabus details here
  • 900 మార్కులతో గ్రూప్‌ 1
  • ఇంటర్వ్యూ రద్దు నేపథ్యంలో పరీక్షా విధానంలో మార్పులు
  • ఉత్తర్వులు జారీ చేసిన రాష్ట్ర ప్రభుత్వం

గ్రూప్స్‌ ఉద్యోగాల భర్తీకి సంబంధించిన అర్హత పరీక్షల్లో ఇంటర్వ్యూలను (మౌఖిక పరీక్షలు) తొలగించిన రాష్ట్ర ప్రభుత్వం తాజాగా పరీక్ష విధానంలో మార్పులు చేస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. గ్రూప్‌–1, గ్రూప్‌–2లో ఇప్పటివరకు రాత పరీక్షలతో పాటు మౌఖిక పరీక్షలుండేవి. దీనివల్ల నియామక ప్రక్రియలో జాప్యం జరుగుతోందన్న భావనతో ఇంటర్వ్యూలను రద్దు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. భర్తీ ప్రక్రియను మరింత పారదర్శకంగా నిర్వహించేందుకు వీలవుతుందని భావించి ఈ మేరకు ఇటీవల ఉత్తర్వులు కూడా జారీ చేసింది. ఈ నేపథ్యంలో పరీక్ష విధానంలో జరిగే మార్పులపై టీఎస్‌పీఎస్సీ సమర్పించిన ప్రతిపాదనలను రాష్ట్ర ప్రభుత్వం ఆమోదించింది. ఈ మేరకు సోమవారం సీఎస్‌ సోమేశ్‌కుమార్‌ జీఓ నంబర్‌ 55ను జారీ చేశారు. గతంలో మొత్తం 1,000 మార్కులకు ఉండే గ్రూప్‌–1 పరీక్షను (ఇంటర్వ్యూ 100 మార్కులు పోను) 900 మార్కులకు. 

చ‌ద‌వండి: TSPSC & APPSC : గ్రూప్-1 & 2లో ఉద్యోగం కొట్ట‌డం ఎలా? ఎలాంటి బుక్స్ చ‌ద‌వాలి..?  

గ్రూప్‌–1 సర్వీసెస్‌

డిప్యూటీ కలెక్టర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ పోలీస్, కమర్షియల్‌ టాక్స్‌ ఆఫీసర్, రీజినల్‌ ట్రాన్‌ ్సపోర్ట్‌ ఆఫీసర్, జిల్లా పంచాయతీ అధికారి, జిల్లా రిజిస్ట్రార్, డివిజినల్‌ ఫైర్‌ ఆఫీసర్, డిప్యూటీ సూపరింటెండెంట్‌ ఆఫ్‌ జైల్స్, అసిస్టెంట్‌ కమిషనర్‌ ఆఫ్‌ లేబర్, అసిస్టెంట్‌ ఎక్సైజ్‌ సూపరింటెండెంట్, మున్సిపల్‌ కమిషనర్, అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (ఎస్సీడీడీ), అసిస్టెంట్‌ డైరెక్టర్‌ (బీసీడబ్ల్యూఓ), జిల్లా గిరిజన సంక్షేమాధికారి, జిల్లా ఉపాధి కల్పనాధికారి, అడ్మినిస్ట్రేషన్‌ ఆఫీసర్‌(మెడికల్‌ అండ్‌ హెల్త్‌ సర్వీసెస్‌), అసిస్టెంట్‌ ట్రెజరీ ఆఫీసర్, అసిస్టెంట్‌ అకౌంట్స్‌ ఆఫీసర్, శిక్షణ కళాశాలలో అసిస్టెంట్‌ లెక్చరర్, అసిస్టెంట్‌ ఆడిట్‌ ఆఫీసర్, మండల పరిషత్‌ డెవలప్‌మెంట్‌ ఆఫీసర్‌.

స్కీమ్‌ ఆఫ్‌ ఎగ్జామినేషన్‌ : మొత్తం మార్కులు: 900

సబ్జెక్ట్‌ సమయం (గంటలు) గరిష్ట మార్కులు 
ప్రిలిమినరీ టెస్ట్‌ (జనరల్‌ స్టడీస్, మెంటల్‌ ఎబిలిటీ) 2 1/2 150
రాత పరీక్ష (మెయిన్‌ ) (జనరల్‌ ఇంగ్లిష్‌)(అర్హత పరీక్ష) 3 150

మెయిన్‌ పేపర్‌–1 జనరల్‌ ఎస్సే

  1. సమకాలీన సామాజిక అంశాలు, సామాజిక సమస్యలు
  2. ఆర్థికాభివృద్ధి మరియు న్యాయపరమైన (జస్టిస్‌) సమస్యలు
  3. డైనమిక్స్‌ ఆఫ్‌ ఇండియన్‌ పాలిటిక్స్‌
  4. భారతదేశ చారిత్రక మరియు సాంస్కతిక వారసత్వ సంపద
  5. శాస్త్ర, సాంకేతిక రంగాల్లో పురోగతి
  6. విద్య మరియు మానవ వనరుల అభివృద్ధి
3 150
పేపర్‌–2 హిస్టరీ, కల్చర్‌ అండ్‌ జియోగ్రఫీ      
  1. భారతదేశ చరిత్ర మరియు సంస్కతి (1757–1947)
  2. తెలంగాణ చరిత్ర మరియు వారసత్వ సంపద
  3. జియోగ్రఫీ ఆఫ్‌ ఇండియా అండ్‌ తెలంగాణ
3 150
పేపర్‌–3  ఇండియన్‌  సొసైటీ, కానిస్టిట్యూషన్‌  అండ్‌ గవర్నెన్స్‌  
  1. భారతీయ సమాజం, నిర్మాణం మరియు సామాజిక ఉద్యమం
  2. భారత రాజ్యాంగం
  3. పాలన
3 150
పేపర్‌–4 ఎకానమీ అండ్‌ డెవలప్‌మెంట్‌            
  1. భారతీయ ఆర్థిక వ్యవస్థ మరియు అభివృద్ధి
  2. తెలంగాణ ఆర్థిక వ్యవస్థ
  3. అభివృద్ధి మరియు పర్యావరణ సమస్యలు
3 150
పేపర్‌–5 సైన్స్‌ అండ్‌ టెక్నాలజీ అండ్‌ డేటా ఇంటర్‌ప్రిటేషన్‌     
  1. శాస్త్ర, సాంకేతిక రంగాల పాత్ర, ప్రభావం
  2. మెడరన్‌  ట్రెండ్స్‌ ఇన్‌  అప్లికేషన్‌  ఆఫ్‌ నాలెడ్జ్‌ ఆఫ్‌ సైన్స్‌
  3. డేటా ఇంటర్‌ ప్రిటేషన్‌  అండ్‌ ప్రాబ్లమ్‌ సాల్వింగ్‌
3 150
పేపర్‌–6 తెలంగాణ ఉద్యమం మరియు రాష్ట్ర ఆవిర్భావం 
  1. ది ఐడియా ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఆలోచన 1948–1970)
  2. మొబిలైజేషన్‌ ఫేజ్‌ (మద్దతు కూడగట్టే దశ 1971–1990)
  3. టువర్డ్స్‌ ఫార్మేషన్‌ ఆఫ్‌ తెలంగాణ (తెలంగాణ ఏర్పాటు దిశగా 1991–2014)
3 150

చ‌ద‌వండి: Competitive Exam Preparation Tips: పోటీపరీక్షల్లో విజయానికి కరెంట్‌ అఫైర్స్‌​​​​​​​
పరీక్ష విధానం..

  • ముందుగా ప్రిలిమినరీ టెస్ట్‌లో అర్హత సాధించాలి. అందులో అర్హత సాధించిన వారు మెయిన్‌ పరీక్షకు ఎంపికవుతారు. ప్రిలిమినరీ పరీక్ష ద్వారా ఎలాంటి ర్యాంకులు జారీ చేయరు. ప్రిలిమినరీ పరీక్ష తెలుగు,ఇంగ్లిష్,ఉర్దూ భాషలో నిర్వహిస్తారు.
  • ఉద్యోగ ఖాళీల సంఖ్యకు 50 రెట్ల మంది అభ్యర్థులను మల్టీజోన్ల వారీగా రూల్‌ ఆఫ్‌ రిజర్వేషన్ల ప్రకారం మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.
  • మెయిన్‌  పరీక్షను జనరల్‌ ఇంగ్లిష్‌ కాకుండా ఇతర పరీక్షలను తెలుగు, ఇంగ్లిష్, ఉర్దూ భాషలో నిర్వహిస్తారు. సమాధానాలను అభ్యర్థి ఎంపిక చేసుకునే భాష ప్రకారం ఇవ్వాల్సి ఉంటుంది.
  • జనరల్‌ ఇంగ్లిష్‌ పరీక్ష పదో తరగతి సబ్జెక్ట్‌ ప్రమాణాలకు అనుగుణంగా ఉంటుంది. ఇందులో ఓసీలు, స్పోర్ట్స్‌ మెన్, ఈడబ్ల్యూఎస్‌ అభ్యర్థులకు 40 శాతం కంటే తక్కువ కాకుండా, బీసీలకు 35 శాతం, ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు 30 శాతం కంటే తక్కువ కాకుండా మార్కులు రావాలి. ఈ పరీక్షలో వచ్చే మార్కులను కూడా ర్యాంకులకు పరిగణనలోకి తీసుకోరు.


చ‌ద‌వండి:
TSPSC గ్రూప్‌–2 పరీక్ష 600 మార్కులకు కుదింపు... పరీక్షా విధానం ఇదే!
TSPSC గ్రూప్‌–3 పరీక్షా విధానం ఇదే!
TSPSC గ్రూప్‌–4 సర్వీసెస్‌ ఇవే... పరీక్ష విధానం కోసం చూడండి

Published date : 02 Sep 2022 07:50PM

Photo Stories