TS Inter Short Memo 2023 Link : టీఎస్ ఇంటర్ మార్కుల మెమో వచ్చాయ్.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
Sakshi Education
సాక్షి ఎడ్యుకేషన్ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫస్ట్, సెకండియర్ ఫలితాలను ఒకేసారి మే 9వ తేదీ(మంగళవారం) ఉదయం 11:00 గంటలకు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుదల చేసిన విషయం తెల్సిందే.
TS Inter Marks Memo 2023
ఇంటర్ ఫలితాల అనంతరం షార్ట్ మెమోలను (TS Inter Short Memo 2023) ఇంటర్ బోర్డ్ అధికారం వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంచారు.
ఈ సందర్భంగా మంత్రి సబితా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షల తేదీలను కూడా వెల్లడించారు. ఈ పరీక్షలను జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు.
ఫెయిల్ అయిన విద్యార్థులు..
రీకౌంటింగ్, రీవెరిఫికేషన్ చేసుకునే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. వారిని ఒత్తిడికి గురి చేయొద్దని తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు.