Skip to main content

TS Inter Supplementary Exam dates 2023 : తెలంగాణ ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే.. ఈ సారి ప‌రీక్ష‌ల‌ను..

సాక్షి ఎడ్యుకేష‌న్‌ : తెలంగాణ ఇంటర్మీడియట్ ఫ‌స్ట్‌, సెకండియ‌ర్ ఫ‌లితాల‌ను ఒకేసారి మే 9వ తేదీ(మంగ‌ళ‌వారం) ఉద‌యం 11:00 గంట‌ల‌కు విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రా రెడ్డి విడుద‌ల చేసిన విష‌యం తెల్సిందే.
TS Inter Supplementary Exam dates 2023 Telugu news
TS Inter Supplementary Exam dates 2023

ఈ సంద‌ర్భంగా మంత్రి స‌బితా ఇంటర్ అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ ప‌రీక్ష‌ల తేదీలను కూడా వెల్ల‌డించారు. ఈ ప‌రీక్ష‌ల‌ను జూన్ 4 నుంచి అడ్వాన్స్డ్ సప్లిమెంటరీ పరీక్షలు జరుగుతాయని విద్యాశాఖ మంత్రి తెలిపారు. 

ఫెయిల్ అయిన విద్యార్థులు..
రీకౌంటింగ్‌, రీవెరిఫికేషన్‌ చేసుకునే అవకాశం ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఫెయిల్ అయిన విద్యార్థులు ఆందోళన చెందవద్దన్నారు. వారిని ఒత్తిడికి గురి చేయొద్దని తల్లిదండ్రులకు మంత్రి విజ్ఞప్తి చేశారు. 

ఎంసెట్ రాసేవాళ్ళు..

ts inter results 2023 latest news telugu

ఎంసెట్ రాసేవాళ్ళు ప్రశాంతంగా పరీక్షలు రాయండని మంత్రి సూచించారు. ఎంసెట్‌లో ఇంటర్ వేయిటేజీ లేదు కాబట్టి విద్యార్థులు ఈ ఫలితాలను పట్టించుకోవద్దని మంత్రి తెలిపారు.

ఉత్తీర్ణ‌త ఇలా..
ఇంట‌ర్ ఫస్టియర్‌, సెకండియర్‌ ఫలితాల్లో మెదక్‌ చివరి స్థానంలో నిలిచింది.సెకండియర్‌ ఫలితాల్లో ములుగు జిల్లాకు ప్రథమ స్థానం నిలిచింది. గత సంవత్సరం కంటే పాస్ పర్సెంటేజ్ ఈ ఏడాది చాలా తగ్గింది. ఇంటర్ మొదటి సంవత్సరం ఫలితాల్లో మేడ్చల్ జిల్లా మొదటిస్థానంలో, రెండో స్థానంలో రంగారెడ్డి జిల్లా, మూడో స్థానంలో కొమరం భీం ఆసిఫాబాద్ జిల్లా నిలిచింది. ఈ ఫలితాల్లో ప్రైవేట్ కాలేజీల కంటే ముందంజలో ప్రభుత్వ జూనియర్ కాలేజీలు ఉన్నాయి. ప్రైవేట్ జూనియర్ కాలేజీలో పాసైన విద్యార్థులు 63 శాతం ఉన్నారు. అలాగే రెసిడెన్షియల్ కాలేజీల్లో 92 శాతం మంది ఉత్తీర్ణ‌త ఉన్నారు. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 80 శాతం మంది విద్యార్థులు పాసయ్యారు. 

☛ ఇంట‌ర్  ఫస్టియర్‌లో 63.85 శాతం ఉత్తీర్ణ‌త‌

ts inter results pass news telugu

☛ ఫస్ట్‌ ఇయర్‌ 4,33.82 మందికి 2,72,208 మంది ఉత్తీర్ణ‌త‌
☛ ఏ గ్రేడ్‌- లక్షా 60 వేల మంది
☛ బి గ్రేడ్‌ -68వేల 330 మంది పాస్‌
☛ బాలికలు -2,17454 మందికి లక్షా 1,49729 మంది పాస్

☛ సెకండియర్‌ ఫలితాల్లో 67.26 శాతం ఉత్తీర్ణత
☛ తెలంగాణ ఇంటర్ సెకండ్‌ ఇయర్ ఫలితాల్లో 73వేల 61 మందికి ఏ గ్రేడ్‌ వచ్చింది. బీ గ్రేడ్‌ 54వేల 776 మందికి వచ్చింది. సెకండ్ ఇయర్‌లో 2,56,241 మంది ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం ఫలితాలను చూడాలంటే https://results.sakshieducation.com  ఈ లింక్‌ను క్లిక్ చేయండి.

How to Check Telangana Inter First and Second Year Results 2023 :
1) Visit https://results.sakshieducation.com/
2) Click on TS Inter Results appearing on the home page
3) Enter your hall ticket number and click on submit
4) Your mark sheet will open
5) Download and save results for further reference

ఈ సారి బాలికలదే పైచేయి..

ts inter results latest news telugu

ఈ తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో బాలకలదే పైచేయిగా నిలిచారు. ఇంటర్‌ ఫస్ట్‌ ఇయర్‌లో 68 శాతం మంది అమ్మాయిలు ఉత్తీర్ణత సాధించగా, 56.82 శాతం మంది అబ్బాయిల పాస్‌ అయ్యారు. ఇక సెకండ్‌ ఇయర్‌లో 73.46 శాతం మంది అమ్మాయిలు, 60.66 శాతం మంది అబ్బాయిలు పాస్‌ అయ్యారు

గురుకుల విద్యార్థులు  హావా..
తెలంగాణ ఇంటర్‌ ఫలితాల్లో గురుకుల పాఠశాలల విద్యార్థులు సత్తా చాటారు. గురుకుల కాలేజీల్లో మొత్తం 92 శాతం మంది విద్యార్థులు పాస్‌ అయ్యారు. ఇక ప్రైవేటు కాలేజీల్లో 63 శాతం మంది పాస్‌ కాగా.. సోషల్ వెల్ఫేర్ కాలేజీల్లో 89 శాతం, బీసీ గురుకుల 87 శాతం ఉత్తీర్ణత, కేజీబీవీ 77%, ట్రైబల్ 84 %, ప్రభుత్వ జూనియర్ కాలేజిల్లో 54 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు.

తెలంగాణ‌ ఇంటర్‌ ప్రథమ, ద్వితీయ సంవ‌త్స‌రం 2023 ఫలితాల కోసం క్లిక్ చేయండి

ఇంట‌ర్ మొదటి సంవత్సరం ఇలా..
➤ బాలికల ఉత్తీర్ణతాశాతం : 68.68 %
➤ బాలుర ఉత్తీర్ణతాశాతం : 54.66 %
➤ మొత్తం పాసైన వారు : 63.85 %

ఇంట‌ర్‌ రెండో సంవత్సరం ఫ‌లితాలు ఇలా.. 

➤బాలికల ఉత్తీర్ణతాశాతం : 71.57 %
➤బాలుర ఉత్తీర్ణతాశాతం : 55.60 %
➤ మొత్తం పాసైన వారు : 63.49 %

Published date : 09 May 2023 12:41PM

Photo Stories