TS Inter Supplementary Exam 2024: ఇంటర్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీ పొడిగింపు
Sakshi Education
సాక్షి, హైదరాబాద్ : ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్ష ఫీజు తేదీని ప్రభుత్వం పొడిగించింది. ఈ మేరకు గురువారం తెలంగాణ ఇంటర్ బోర్డు ఉత్తర్వులు జారీ చేసింది. మే 4వ తేదీ వరకు ఫెయిలైన విద్యార్థులు పరీక్ష ఫీజు చెల్లించొచ్చని ఉత్తర్వుల్లో పేర్కొంది.
కాగా ఇంటర్ ఫలితాలు విడుదలైన రోజు జారీ చేసిన ఉత్తర్వుల ప్రకారం ఇంటర్ పరీక్ష ఫీజు చెల్లింపు తేదీ మే 2వ తేదీతో ముగిసింది. కానీ విద్యార్థుల విజ్ఞప్తుల మేరకు పరీక్ష ఫీజు చెల్లింపు తేదీని మే 4వ తేదీ వరకు పొడిగించారు. ఇంటర్ అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షలు మే 24 నుంచి నిర్వహిస్తారు. ఫస్టియర్‌కు ఉదయం 9 నుంచి మ. 12 గంటల వరకు సెకండియర్ విద్యార్థులకు మ. 2.30 నుంచి సాయంత్రం 5.30 గంటల వరకు నిర్వహించనున్నారు.
Published date : 03 May 2024 11:10AM
Tags
- ts inter supplementary exam date 2024
- telangana intermediate board
- Telangana Intermediate Board Exams
- Telangana Intermediate Board News
- inter 2nd year supplementary exam date 2024
- ts inter supply exam dates 2024
- ts inter supply exams dates announced 2024
- ts inter reverification 2024
- Inter Advanced Supplementary
- Inter Supplementary
- TS Inter Supplementary Exam dates News
- TS Inter Supplementary
- ts inter supplementary exams new dates 2024
- Hyderabad updates
- Government announcement
- Examination fee extension
- Telangana Inter Board notice
- sakshieducation updates