TS Inter Revaluation & Recounting: ఇంటర్ రీ కౌంటింగ్, వెరిఫికేషన్‌కు చివరి తేదీ ఇదే..
ఫస్టియర్‌లో 63.86 శాతం మంది ఉత్తీర్ణత సాధించగా సెకండియర్‌లో 43.77 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఈ మేరకు అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీ పరీక్షల ఫలితాలను విద్యాశాఖ ముఖ్య కార్యదర్శి బుర్రా వెంకటేశం, బోర్డ్ కార్యదర్శి శ్రుతి ఓజా జూన్ 24న విడుదల చేశారు.
చదవండి: టిఎస్ ఇంటర్ - సీనియర్ ఇంటర్ | టైం టేబుల్ 2024 | సిలబస్ | స్టడీ మెటీరియల్ | మోడల్ పేపర్స్ | న్యూస్ | ఏపీ ఇంటర్
ఇంటర్ వార్షిక పరీక్షల్లో ఫస్టియర్ జనరల్‌లో 2,62,829 మంది ఉత్తీర్ణు లవగా అడ్వాన్స్‌డ్ సప్లిమెంటరీలో 1,62,520 మంది ఉత్తీర్ణులయ్యారు. అలాగే ద్వితీయ సంవత్సరం జనరల్ విద్యార్థులకు జరిగిన సాధారణ పరీక్ష ల్లో 2,93,596 మంది పాసవగా అడ్వాన్స్‌డ్‌లో 60,615 మంది పాసయ్యారు. పరీక్ష రాసిన విద్యార్థులు రీ కౌంటింగ్, రీ వెరిఫికేషన్‌కు అవసరమైతే జూన్ 26 నుంచి 29 వరకు దరఖాస్తు చేసుకోవాలని బోర్డ్ సూచించింది.
|
ఫస్టియర్ ఫలితాలు |
ద్వితీయ సంవత్సరం |
||
జనరల్ |
ఒకేషనల్ |
జనరల్ |
ఒకేషనల్ |
|
పరీక్ష రాసిన వారు |
2,54,498 |
18,913 |
1,38,477 |
15,136 |
పాసయిన వారు |
1,62,520 |
10,070 |
60,615 |
7,737 |
ఇంప్రూవ్‌మెంట్ రాసిన వారు |
1,06,484 |
1,633 |
– |
– |
జనరల్, అడ్వాన్స్‌డ్ కలిపి ఉత్తీర్ణులు |
3,18,967 |
32,191 |
3,54,242 |
36,585 |
బాలికల ఉత్తీర్ణత |
82,374 |
4,826 |
25,673 |
2,372 |
బాలుర ఉత్తీర్ణత |
80,146 |
5,244 |
34,942 |
5,365 |