Spouse Teachers: స్పౌజ్ టీచర్ల సమస్యలు పరిష్కరించాలి
317 జీవో వల్ల నష్టపోయిన వారికి తక్షణమే న్యాయం చేయాలని కోరింది. సంఘం రాష్ట్ర కమిటీ సమావేశం నవంబర్ 29న హైదరాబాద్‌లో జరిగింది. ఈ సందర్భంగా ప్రాథమిక పాఠశాలల్లో పనిచేస్తున్న ఉపాధ్యాయులకు.. ఉపాధ్యాయ ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటు హక్కు కల్పించేలా రాజ్యాంగ సవరణ చేయాలని సమావేశం కోరింది.
చదవండి: Balaji Sucess Story: తోబుట్టువుల స్ఫూర్తితో ‘బాలాజీ’.. ఏకంగా మూడు ఉద్యోగాలు సాధించాడు
కాంట్రిబ్యూటరీ పెన్షన్ విధానాన్ని వెంటనే రద్దు చేయాలని, సమగ్ర శిక్ష, కేజీబీవీల్లో పనిచేస్తున్న బోధన, బోధనేతర సిబ్బందికి కనీస వేతన చట్టాన్ని అమలు చేస్తూ.. క్రమబద్ధీకరించి, మినిమం టైం స్కేల్‌ను వర్తింపజేయాలని కోరింది. మధ్యాహ్న భోజనానికి సంబంధించి హెచ్‌ఎంలపై చర్యలు తీసుకోవడం సరికాదని సంఘం అభిప్రాయపడింది. సమావేశంలో సంఘ అధ్యక్షుడు సీహెచ్ అనిల్‌కుమార్, ప్రధాన కార్యదర్శి నన్నెబోయిన తిరుపతి తదితరులు పాల్గొన్నారు.