Skip to main content

Kakatiya University: మాడిన అన్నం.. రుచిలేని పప్పు

కేయూ క్యాంపస్‌: భోజనం బాగా లేదని, నాణ్యమైన ఆహారం అందించాలని డిమాండ్‌ చేస్తూ కాకతీయ యూనివర్సిటీలోని మహిళా హాస్టల్‌ విద్యార్థినులు న‌వంబ‌ర్‌ 29న రాత్రి ఆందోళనకు దిగారు.
KU students protest negligence after hostel

యూనివర్సిటీ మొదటి గేట్‌ వద్ద బైఠాయించారు. భోజనం బాగుండటం లేదని చెప్పినా ఎవరూ పట్టించుకోవడం లేదని వాపోయారు. అన్నం మాడిపోతోందని, పప్పు కూడా బాగుండటం లేదని వివరించారు.

చదవండి: 10th Class Exam Pattern: ఈ ఏడాదికి టెన్త్‌లో ఇంటర్నల్‌ మార్కులు

వీసీ, రిజిస్టర్‌ రావాలని నినాదాలు చేశారు. పోలీసులు వచ్చి వారికి సర్దిచెప్పే యత్నం చేశారు. సమాచారం అందుకున్న హాస్టళ్ల డైరెక్టర్‌ రాజ్‌కుమార్‌ రాత్రి 11.30 గంటలకు అక్కడికి వచ్చి విద్యార్థినులతో మాట్లాడారు. విద్యార్థినులు తీసుకొచ్చిన ఆహారాన్ని పరిశీలించారు.

Join our WhatsApp Channel: Click Here
Join our Telegram Channel: Click Here
Follow our YouTube Channel: Click Here
Follow our Instagram Page: Click Here

ఈ సమస్యను న‌వంబ‌ర్‌ 30న పరిశీలించి.. తప్పకుండా పరిష్కరిస్తానని హామీ ఇవ్వడంతో విద్యార్థినులు ఆందోళన విరమించారు. వెంటనే డైరెక్టర్‌ హాస్టల్‌కు వెళ్లి పరిశీలించారు.

Published date : 02 Dec 2024 09:41AM

Photo Stories