Skip to main content

TS Inter Results 2023 : మే 10వ తేదీన‌ ఇంటర్ ఫలితాలు..? పూర్తి వివ‌రాలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణలో ఇంట‌ర్ ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు మార్చి 15వ తేదీన‌ నుంచి ఏప్రిల్ 4వ తేదీ వరకు జరిగిన విష‌యం తెలిసిందే. ఇంట‌ర్ ప్ర‌థ‌మ , ద్వితీయ సంవ‌త్స‌రం కలిపి దాదాపు 9,48,010 మంది విద్యార్థులు ఈ పరీక్షలకు హాజరయ్యారు.
TS Inter Results News 2023 Telugu
TS Inter Results News 2023

ఇంట‌ర్ సెకండియర్ పరీక్షలకు మొత్తం 4,17,525 మంది విద్యార్థులు హాజరుకావాల్సి ఉండగా.. 4,02,630 మంది హాజరయ్యారని అధికారులు తెలిపారు. ఈ ఏడాది ఫస్టియర్‌ ఇంటర్‌కు 4,82,619 మంది ఉన్నారు. మే 10న ఇంటర్ ఫలితాలు వెల్లడించేందుకు ఇంట‌ర్ బోర్డ్‌ కసరత్తులు చేస్తోంది. ఈ ఇంట‌ర్‌ ఫ‌లితాల‌ను https://results.sakshieducation.com/ వెబ్‌సైట్‌లో చూడొచ్చు.

చదవండి: Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

ఈ సారి ఇంటర్ పరీక్ష ఫలితాలను..

ts inter results news 2023

తెలంగాణలో ఎంసెట్ పరీక్షలు మే 10 నుంచి 14 వరకు నిర్వహించనున్నారు. ఆ తర్వాత ఎంసెట్ అడ్మిషన్లు ప్రారంభం అవుతాయి. అటు నీట్, జేఈఈ ప్రవేశ పరీక్షలు కూడా జరగనున్నాయి. ఈ నేపథ్యంలో, ఇంటర్ పరీక్ష ఫలితాలను వేగంగా తీసుకువచ్చేందుకు ఇంటర్ బోర్డు కృషి చేస్తోంది. సాధ్యమైనంత త్వరగా ఇంటర్ జవాబు పత్రాల మూల్యాంకనం పూర్తి చేయాలని నిర్ణయించింది.

చదవండి: Career Guidance: మూడేళ్ల డిగ్రీ.. ఎలా ముందుకుసాగాలో తెలుసుకుందాం..

ఇంటర్ అకడమిక్ ​క్యాలెండర్​ ఇదే..

ts inter academic calendar 2023-24

తెలంగాణలో జూనియర్ కళాశాలల అకడమిక్ ​క్యాలెండర్​ని ఇంటర్మీడియట్ బోర్డు ప్రకటించించిన విష‌యం తెల్సిందే. రాష్ట్రంలోని అన్ని జూనియర్​ కళాశాలలు జూన్​ 1న ప్రారంభమవుతాయిన బోర్డు అధికారులు వెల్లడించారు. జూన్ 1 నుంచే తరగతులు కూడా ప్రారంభమవుతాయని తెలిపారు. ఈ మేరకు 2023-24 విద్యా సంవత్సరానికి సంబంధించిన తాత్కాలిక విద్యా క్యాలెండర్ బోర్డు వెలువరించింది.

➤ TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్‌- 2023 ప‌రీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..

సెల‌వులు ఇవే..

ts inter holidays list 2023-24

ప్ర‌కటించిన క్యాలెండర్ ప్రకారం.. జూనియర్ కాలేజీలకు అక్టోబర్ 19వ తేదీ నుంచి 25 వరకు దసరా సెలవులు, 2024 జనవరి 13వ తేదీ నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. వచ్చే ఏడాది జనవరి 13 నుంచి 16 వరకు సంక్రాంతి సెలవులు ఉండనున్నాయి. ఇంటర్మీడియట్ విద్య కోసం ఈ ఏడాది మొత్తం 227 పని దినాలు ఉంటాయని బోర్డు తెలిపింది. ఇక ఫిబ్రవరి రెండో వారం నుంచి ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షలు నిర్వహించనున్నారు. థియరీ పరీక్షలను మార్చి మొదటివారం నుంచి నిర్వహిస్తారు. ఏప్రిల్ 1 నుంచి వేసవి సెలవులు ఇవ్వనున్నారు.

చదవండి: Jobs After 10th & Inter: పది, ఇంటర్‌తోనే... కొలువుల దిశగా!

Published date : 18 Apr 2023 03:06PM

Photo Stories