Skip to main content

Best Course After Intermediate MPC: ఎంపీసీ.. ఇంజనీరింగ్‌తోపాటు మరెన్నో!

ఇంటర్మీడియెట్‌.. పరీక్షలు రాశారా.. భవిష్యత్‌ ఉన్నత విద్యావకాశాల గురించి ఆలోచిస్తున్నారా.. బీటెక్‌తోపాటు.. ఇతర కోర్సులు ఏమున్నాయని అన్వేషిస్తున్నారా?! ఇంటర్‌ ఎంపీసీతో ఇంజనీరింగ్‌తోపాటు అనేక వినూత్న కోర్సులు అందుబాటులో ఉన్నాయి. వీటి గురించి ముందుగానే తెలుసుకొని సన్నద్ధమైతే లక్ష్య సాధన సులువవుతుంది. తెలుగు రాష్ట్రాల్లో ఇంటర్‌ పరీక్షలు ముగిశాయి. ఈ నేపథ్యంలో.. ఇంటర్‌ ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్నత విద్య కోర్సుల వివరాలు..
Best Course After Intermediate MPC
  • ఇంటర్మీడియెట్‌ ఎంపీసీ అర్హతతో అనేక ఉన్నత విద్యావకాశాలు
  • ఇంజనీరింగ్, సైన్స్, లా, ఫార్మసీ, ఫ్యాషన్‌ కోర్సుల్లో చేరొచ్చు

ఇంజనీరింగ్‌.. ఎవర్‌గ్రీన్‌

ఇంజనీరింగ్‌(బీఈ/బీటెక్‌).. ఎంపీసీ విద్యార్థులకు ఎవర్‌గ్రీన్‌ కోర్సు. ఇందుకోసం జేఈఈ మెయిన్, జేఈఈ అడ్వాన్స్‌డ్, టీఎస్‌ ఎంసెట్, ఏపీఈఏపీసెట్, బిట్‌శాట్‌ వంటి ఎంట్రన్స్‌ టెస్ట్‌లకు విద్యార్థులు సిద్ధమవుతుంటారు. 

జేఈఈ-మెయిన్‌

జేఈఈ-మెయిన్‌.. జాతీయ స్థాయిలోని ఎన్‌ఐటీలు, ట్రిపుల్‌ ఐటీలు, కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని ఇతర టెక్నికల్‌ ఇన్‌స్టిట్యూట్‌లలో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ ఎంటెక్‌ వంటి కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రెన్స్‌ టెస్ట్‌. ఐఐటీల్లో ప్రవేశానికి నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్‌కు ప్రామాణికంగా నిలుస్తున్న పరీక్ష ఇది. మొత్తం మూడు విభాగాల్లో(ఫిజిక్స్, మ్యాథమెటిక్స్, కెమిస్ట్రీ) ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. జేఈఈ-మెయిన్‌తో బీటెక్‌ మాత్రమే కాకుండా..నిట్‌లు, ఇతర కేంద్ర ప్రభుత్వ ఆధ్వర్యంలోని సంస్థల్లో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌ కోర్సులో సైతం ప్రవేశం లభిస్తుంది. ఇందుకోసం ప్రత్యేకంగా నిర్వహించే జేఈఈ-మెయిన్‌ పేపర్‌-2లో ర్యాంకు పొందాల్సి ఉంటుంది. పేపర్‌-2బి పేరుతో బ్యాచిలర్‌ ఆఫ్‌ ప్లానింగ్‌ కోర్సుల్లో ప్రవేశానికి మరో పేపర్‌లో పరీక్ష నిర్వహిస్తారు. 

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://jeemain.nta.nic.in/

చ‌ద‌వండి: After Inter Jobs: ఇంటర్‌తోనే సాఫ్ట్‌వేర్‌ కొలువు

జేఈఈ-అడ్వాన్స్‌డ్‌

ఐఐటీ క్యాంపస్‌ల్లో బీటెక్, ఇంటిగ్రేటెడ్‌ బీటెక్‌+ఎంటెక్‌ కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే పరీక్ష.. జేఈఈ అడ్వాన్స్‌డ్‌. జేఈఈ-మెయిన్‌ పేపర్‌-1లో ప్రతిభ ఆధారంగా 2.5 లక్షల మందిని జేఈఈ-అడ్వాన్స్‌డ్‌కు అర్హత కల్పిస్తారు. ఈ పరీక్ష రెండు పేపర్లలో ఉంటుంది. ఒక్కో పేపర్‌ పరీక్ష సమయం మూడు గంటలు. ప్రతి పేపర్‌లోనూ మ్యాథమెటిక్స్, ఫిజిక్స్, కెమిస్ట్రీల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ఆన్‌లైన్‌ విధానంలో జరిగే ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా ఐఐటీలతోపాటు ఐఐఎస్‌టీ, ఐఐఎస్‌సీ తదితర ప్రముఖ ఇన్‌స్టిట్యూట్‌లలో కూడా ప్రవేశం పొందొచ్చు.
2023కు సంబంధించి జేఈఈ-అడ్వాన్స్‌డ్‌ ద­రఖాస్తు ప్రక్రియ ఏప్రిల్‌ 30 నుంచి మొదలు కానుంది. ఎంట్రన్స్‌ను జూన్‌ 4న నిర్వహించనున్నారు.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.jeeadv.ac.in/


చ‌ద‌వండి: EAMCET 2023: ఎంసెట్‌.. టాప్‌ స్కోర్‌ ఇలా!

టీఎస్‌ ఎంసెట్‌/ఏపీ ఈఏపీసెట్‌

  • రెండు తెలుగు రాష్ట్రాల్లో ఇంజనీరింగ్‌ కళాశాలల్లో ప్రవేశానికి నిర్వహించే ఎంట్రన్స్‌లు టీఎస్‌ ఎంసెట్, ఏపీ ఈఏపీసెట్‌
  • తెలంగాణ రాష్ట్రంలో ఎంసెట్‌ పేరుతో, ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ ఈఏపీ(ఇంజనీరింగ్, అగ్రికల్చర్‌ అండ్‌ ఫార్మసీ) సెట్‌ పేరుతో ఈ పరీక్ష నిర్వహిస్తున్నారు.
  • రెండు స్ట్రీమ్‌లకు సంబంధించి 160 మార్కులకు పరీక్ష ఉంటుంది. ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌లో మ్యాథమెటిక్స్‌లో 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 ప్రశ్నలు చొప్పున అడుగుతారు.
  • అగ్రికల్చర్, ఫార్మసీ, మెడిసిన్‌ విభాగాల్లో బయాలజీ(బోటనీ, జువాలజీ) నుంచి 80 ప్రశ్నలు, ఫిజిక్స్, కెమిస్ట్రీలలో 40 ప్రశ్నలు చొప్పున ఉంటాయి.
  • టీఎస్‌ ఎంసెట్‌-2023(ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌) పరీక్షను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నా­రు. ఏప్రిల్‌ 10 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. 
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://eamcet.tsche.ac.in/
  • ఏపీ ఈఏపీసెట్‌-2023 ఇంజనీరింగ్‌ స్ట్రీమ్‌ పరీక్షలు మే 15నుంచి 18 వరకు నిర్వహించనున్నా­రు. ఆలస్య రుసుము లేకుండా ఏప్రిల్‌ 15 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

బిట్‌శాట్‌

బీటెక్‌ అభ్యర్థులకు అందుబాటులో ఉన్న మరో ఎంట్రన్స్‌ టెస్ట్‌.. బిట్‌ శాట్‌. ఇంజనీరింగ్‌ విద్యలో పేరు గడించిన ది బిర్లా ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ టెక్నాలజీ అండ్‌ సైన్స్‌ (బిట్స్‌ -పిలానీ) బీటెక్, బీఫార్మసీ కోర్సుల్లో ప్రవేశానికి బిట్‌శాట్‌ నిర్వహిస్తుంది. ఈ పరీక్షలో ప్రతిభ ద్వారా బిట్స్‌ పిలానీ, గోవా, హైదరాబాద్‌ క్యాంపస్‌లలో బ్యాచిలర్‌ ఆఫ్‌ ఇంజనీరింగ్, బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశం పొందొచ్చు. ఇంటర్మీడియెట్‌లో 75 శాతం మార్కులతో ఉత్తీర్ణత సాధించాలనే నిబంధన ఉంది. 

  • ఈ పరీక్షను కూడా పూర్తిగా కంప్యూటర్‌ బేస్డ్‌ విధానంలోనే ఆన్‌లైన్‌ టెస్ట్‌గా నిర్వహిస్తారు. మొత్తం నాలుగు విభాగాల్లో ప్రశ్నలు అడుగుతారు. అవి.. ఫిజిక్స్‌; కెమిస్ట్రీ; ఇంగ్లిష్‌ ప్రొఫిషియన్సీ, లాజికల్‌ రీజనింగ్‌; మ్యాథమెటిక్స్‌(ఇంజనీరింగ్‌ ఔత్సాహికులకు); బయాలజీ(బీఫార్మసీ అభ్యర్థులు). మొత్తం 130 ప్రశ్నలతో పరీక్ష ఉంటుంది. ఒక్కో ప్రశ్నకు మూడు మార్కులు కేటాయిస్తారు. పరీక్ష వ్యవధి మూడు గంటలు.
  • 2023కు సంబంధించి బిట్‌శాట్‌-2023 దరఖా­స్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఈ ఏడాది బిట్‌ శాట్‌ను రెండు దశలుగా నిర్వహించనున్నారు. తొలిదశకు ఏప్రిల్‌ 9 వరకు; రెండో దశకు మే 22 నుంచి జూన్‌ 12 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. తొలిదశ పరీక్ష మే 21-26, రెండో దశ పరీక్ష జూన్‌ 18-22 తేదీల్లో నిర్వహిస్తారు.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://www.bitsadmission.com/


చ‌ద‌వండి: After‌ Inter MPC‌: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్‌ టెస్టుల వివ‌రాలు ఇలా..

ఆర్కిటెక్చర్‌కు నాటా

ఎంపీసీతో ప్రవేశం పొందే అవకాశమున్న కోర్సు.. బ్యాచిలర్‌ ఆఫ్‌ ఆర్కిటెక్చర్‌. ఇందులో ప్రవేశానికి నేషనల్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ ఇన్‌ ఆర్కిటెక్చర్‌(నాటా) నిర్వహిస్తారు. ఈ పరీక్షలో స్కోర్‌ ఆధారంగా బీఆర్క్‌ కోర్సులో చేరొచ్చు. ఆన్‌లైన్‌ విధానంలో నిర్వహించే నాటాలో 125 ప్రశ్నలు(200 మార్కులు) ఉంటాయి. డయగ్రమాటిక్‌ రీజనింగ్, న్యూమరికల్‌ రీజనింగ్, వెర్బల్‌ రీజనింగ్, ఇండక్టివ్‌ రీజనింగ్, సిట్యుయేషనల్‌ జడ్జ్‌మెంట్, లాజికల్‌ రీజనింగ్, అబ్‌స్ట్రాక్ట్‌ రీజనింగ్‌ విభాగాల నుంచి ప్రశ్నలు అడుగుతారు. ప్రస్తుతం నాటా-2023 దరఖాస్తు ప్రక్రి­య కొనసాగుతోంది. మొత్తం మూడు విడతల్లో నిర్వహించనున్నారు. తొలి విడత ఏప్రిల్‌ 21న, రెండో విడత మే 28న, మూడో విడత జూలై 9న నిర్వహించనున్నారు. తొలి విడత దరఖాస్తుకు చివరి తేదీ ఏప్రిల్‌ 10. 

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://www.nata.in/

ఐఐఎస్‌ఈఆర్‌.. బీఎస్‌+ఎంఎస్‌

సైన్స్‌ కోర్సుల్లో ప్రవేశం పొందాలనుకునే విద్యార్థులకు అందుబాటులో చక్కటి మార్గం..ఇండియన్‌ ఇన్‌స్టిట్యూట్స్‌ ఆఫ్‌ సైన్స్‌ ఎడ్యుకేషన్‌ అండ్‌ రీసెర్చ్‌ (ఐఐఎస్‌ఈఆర్‌)క్యాంపస్‌లలో బీఎస్‌+ఎంఎస్‌! ఇందుకోసం 3 అర్హత ప్రమాణాలను నిర్దేశించారు. 

  • అవి.. జేఈఈ-అడ్వాన్స్‌డ్‌లో పది వేలలోపు ర్యాంకు సాధించిన వారు నేరుగా ఐఐఎస్‌ఈఆర్‌ అడ్మిషన్‌ పోర్టల్‌లో దరఖాస్తు చేసుకోవచ్చు.
  • కేవీపీవై ఎస్‌ఏ స్ట్రీమ్‌లో సైన్స్‌ సబ్జెక్ట్‌లలో ఉత్తీర్ణత సాధించిన విద్యార్థులు కూడా ఐఐఎస్‌ఈఆర్‌కు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • ఐఐఎస్‌ఈఆర్‌ నిర్వహించే ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌లో ర్యాంకుతోనూ ప్రవేశం పొందొచ్చు. ఈ టెస్ట్‌లో ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ, మ్యాథమెటిక్స్‌ సబ్జెక్ట్‌లలో 15 ప్రశ్నల చొప్పున మొత్తం 60 ప్రశ్నలతో ఆన్‌లైన్‌ టెస్ట్‌ నిర్వహిస్తారు. ప్రతి ప్రశ్నకు మూడు మార్కులు చొప్పున 180 మార్కులకు ఈ పరీక్ష ఉంటుంది. 2023 సంవత్సరానికి సంబంధించి ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ను జూన్‌ 17న నిర్వహించనున్నారు. ఏప్రిల్‌ 15 నుంచి మే 25 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు.
  • వివరాలకు వెబ్‌సైట్‌: https://iiseradmission.in/

చ‌ద‌వండి: Inter Special: ఎంపీసీ.. అకడమిక్‌ సిలబస్‌తోపాటే పోటీ పరీక్షలకూ ప్రిపరేషన్‌!!

హోటల్‌ మేనేజ్‌మెంట్‌

వినూత్న కెరీర్‌ను కోరుకునే విద్యార్థులు హోటల్‌ మేనేజ్‌మెంట్‌ కోర్సులను ఎంచుకోవచ్చు. జాతీయ స్థాయిలో టూరిజం శాఖ పరిధిలోని ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌ క్యాంపస్‌లు బీఎస్సీ హాస్పిటాలిటీ అండ్‌ హోటల్‌ అడ్మినిస్ట్రేషన్‌ కోర్సు­ను అందిస్తున్నాయి. ఇందులో ప్రవేశానికి ఎన్‌టీఏ ఆధ్వర్యంలో నిర్వహించే పరీక్ష.. నేషనల్‌ కౌన్సిల్‌ ఫర్‌ హోటల్‌ మేనేజ్‌మెంట్‌-జాయింట్‌ ఎంట్రన్స్‌ ఎగ్జామినేషన్‌. ఈ ఎంట్రన్స్‌ను అయిదు విభాగాల్లో(న్యూమరికల్‌ ఎబిలిటీ అండ్‌ అనలిటికల్‌ ఆప్టిట్యూ­డ్‌; రీజనింగ్‌ అండ్‌ లాజికల్‌ డిడక్షన్‌; జనరల్‌ నాలె­డ్జ్‌ అండ్‌ కరెంట్‌ అఫైర్స్‌; ఇంగ్లిష్‌ లాంగ్వేజ్‌; ఆప్టిట్యూడ్‌ ఫర్‌ సర్వీస్‌ సెక్టార్‌) 200 ప్రశ్నలు అడుగుతారు. 2023కు సంబంధించి ఎన్‌సీహెచ్‌ఎం దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. ఏప్రిల్‌ 27 వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఎంట్రన్స్‌ టెస్ట్‌ను మే 14న నిర్వహించనున్నారు.

  • పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌: https://nchmjee.nta.nic.in/

చ‌ద‌వండి: Groups Preparation Tips: 'కరెంట్‌ అఫైర్స్‌'పై పట్టు.. సక్సెస్‌కు తొలి మెట్టు!

'న్యాయ శాస్త్రం'లో ఎల్‌ఎల్‌బీ

ఎంపీసీ విద్యార్థులకు అందుబాటులో ఉన్న మ­రో కోర్సు.. అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ. రాష్ట్ర స్థాయిలో నిర్వహించే లాసెట్‌లో స్కోర్‌ ఆధారంగా యూనివర్సిటీ అనుబంధ కళాశాలల్లో అయిదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ ఎల్‌ఎల్‌బీ కోర్సులో ప్రవేశం లభిస్తుంది.

  • ఆంధ్రప్రదేశ్‌లో ఏపీ లాసెట్‌ పరీక్ష.. మూడు విభాగాల్లో(జనరల్‌ నాలెడ్జ్‌ అండ్‌ మెంటల్‌ ఎబిలిటీ; కరెంట్‌ అఫైర్స్‌; అప్టిట్యూడ్‌ ఫర్‌ ద స్టడీ ఆఫ్‌ లా) 120 మార్కులకు నిర్వహిస్తున్నారు.
  • తెలంగాణలో టీఎస్‌ లాసెట్‌ పేరుతో ఎంట్రన్స్‌ నిర్వహిస్తున్నారు. ఈ పరీక్ష కూడా ఏపీ లాసెట్‌ మాదిరిగానే ఉంటుంది.
  • టీఎస్‌ లాసెట్‌ 2023, ఏపీ లాసెట్‌లకు దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతోంది. 
  • టీఎస్‌ లాసెట్‌ వివరాలకు వెబ్‌సైట్‌: https://lawcet.tsche.ac.in/
  • ఏపీ లాసెట్‌ వివరాలకు వెబ్‌సైట్‌: https://cets.apsche.ap.gov.in/

క్లాట్‌తో నేషనల్‌ లా స్కూల్స్‌

న్యాయ విద్యలో ప్రతిష్టాత్మకమైన నేషనల్‌ లా యూనివర్సిటీల్లో.. ఇంటర్‌తోనే ప్రవేశం పొందొచ్చు. ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్‌ బీఏ-ఎల్‌ఎల్‌బీలో అడ్మిషన్‌ కోసం కామన్‌ లా అడ్మిషన్‌ టెస్ట్‌-యూజీ (క్లాట్‌-యూజీ) ఎంట్రన్స్‌ను నిర్వహిస్తున్నారు. ఈ ఎంట్రన్స్‌లో ఉత్తీర్ణత, బెస్ట్‌ స్కోర్‌ ఆధారంగా.. జాతీయ స్థాయిలో నెలకొల్పిన 22 లా యూనివర్సిటీల్లో ప్రవేశం ఖరారు చేసుకోవచ్చు.

బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ

వినూత్న కెరీర్‌ కోరుకునే వారికి చక్కటి మార్గం.. నిఫ్ట్‌ కోర్సులు. ఫ్యాషన్‌ కోర్సులను అందించడంలో జాతీయ స్థాయిలో నేషనల్‌ ఇన్‌స్టిట్యూట్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ(నిఫ్ట్‌) మంచి గుర్తింపు ఉంది. ముఖ్యంగా ఇంటర్మీడియెట్‌ అర్హతగా బ్యాచిలర్‌ ఆఫ్‌ ఫ్యాషన్‌ టెక్నాలజీ కోర్సును నిఫ్ట్‌ క్యాంపస్‌లు అందిస్తున్నాయి. ఈ కోర్సులను పూర్తి చేసుకున్న వారికి గార్మెంట్స్, ఫ్యాషన్‌ సంబంధిత విభాగాల్లో చక్కటి ఉపాధి అవకాశాలు లభిస్తాయి. 

చ‌ద‌వండి: After 10+2: ఇంటర్మీడియెట్‌ తర్వాత ఫార్మసీ కోర్సులు.. కెరీర్‌కు ధీమా

బీఫార్మసీ, ఫార్మ్‌-డి

బీఫార్మసీ..ఫార్మసీ రంగంలో అడుగు పెట్టే అవకాశం కల్పించే కోర్సు. ఇందులో ఎంపీసీ విద్యార్థులకు కూడా అవకాశం ఉంటుంది. తెలుగు రాష్ట్రాల్లో బీ ఫార్మసీ, ఫార్మ్‌-డి కళాశాలల్లో సీట్ల భర్తీని ఎంసెట్‌(తెలంగాణలో), ఈఏపీసెట్‌ (ఆంధ్రప్రదేశ్‌)లో ర్యాంకు ఆధారంగా చేపడతారు. మొత్తం బీఫార్మసీ సీట్లలో 50 శాతం సీట్లను ఎంపీసీ విద్యార్థులకు కేటాయిస్తారు. బీ.ఫార్మసీ పూర్తి చేసుకుంటే.. ఫార్మాస్యుటికల్‌ సంస్థలు, డ్రగ్‌ డిస్కవరీ, ఫార్ములేషన్, బల్క్‌డ్రగ్‌ ప్రొడక్షన్‌ సంస్థల్లో కొలువులు సొంతం చేసుకోవచ్చు. 

Published date : 05 Apr 2023 07:00PM

Photo Stories