TS EAMCET 2023 : టీఎస్ఎంసెట్- 2023 పరీక్ష తేదీలు మార్పులు.. కొత్త తేదీలు ఇవే..
ముందుగా ప్రకటించిన షెడ్యూలు ప్రకారం మే 7వ తేదీ నుంచి 11వ తేదీ వరకు జరగాల్సిన ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షల తేదీల్లో మార్పులు చేసినట్లు రాష్ట్ర ఉన్నత విద్యామండలి మార్చి 31వ తేదీ (శుక్రవారం) వెల్లడించింది.
Also Read: EAMCET - QUICK REVIEW | BIT BANK | GUIDANCE | MODEL PAPERS | PREVIOUS PAPERS | PRACTICE QUESTIONS
కొత్త తేదీలు ఇవే..
కొత్త షెడ్యూలు ప్రకారం ఎంసెట్ ఇంజినీరింగ్ పరీక్షలను మే 12, 13, 14 తేదీల్లో నిర్వహించనున్నట్లు అధికారులు ప్రకటించారు. అయితే మే 10, 11 తేదీల్లో ఎంసెట్ అగ్రికల్చర్ పరీక్షను మాత్రం యథాతథంగా నిర్వహిస్తామని ఉన్నత విద్యామండలి తెలిపింది.
చదవండి: EAMCET 2023: ఎంసెట్.. టాప్ స్కోర్ ఇలా!
ఏప్రిల్ 30 నుంచి..
తెలగాణ ఎంసెట్ దరఖాస్తుల గడువు ఏప్రిల్ 4తో ముగియనుంది. అలాగే ఆలస్య రుసుముతో మే 2వ తేదీ వరకు ఎంసెట్ దరఖాస్తులు స్వీకరించనున్నారు. ఏప్రిల్ 30 నుంచి ఎంసెట్ హాల్‌టికెట్లు డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఉన్నత విద్యామండలి పేర్కొంది.
ఎంసెట్ షెడ్యూల్ ఇలా..
28.2.2023 |
నోటిఫికేషన్ విడుదల |
3.3.2023 |
ఆన్‌లైన్ దరఖాస్తుల స్వీకరణ మొదలు |
10.4.2023 |
అపరాధ రుసుం లేకుండా దరఖాస్తుల స్వీకరణకు తుది గడువు |
12–14.4.2023 |
ఆన్‌లైన్ ఎడిట్ ఆప్షన్స్ |
15.4.2023 |
రూ. 250 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
20.4.2023 |
రూ. 500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
25.4.2013 |
రూ. 2,500 లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
2.5.2023 |
రూ.5 వేల లేట్ ఫీజుతో దరఖాస్తుకు గడువు |
30.4.2023 |
హాల్ టికెట్ల డౌన్‌లోడ్ |
మే 12, 13, 14 |
ఇంజనీరింగ్ విభాగం ఎంసెట్ పరీక్ష (ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 వరకు) |
10,11.5.2023 |
అగ్రి, మెడికల్ ఎంసెట్ పరీక్ష |
ఫీజు వివరాలు ఇలా..
➤ ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.500
➤ ఇతరులకు రూ.900
➤ ఇంజనీరింగ్, మెడికల్ రెండు ఎంసెట్‌లు రాసే ఎస్సీ, ఎస్టీ, పీడబ్ల్యూడీ అభ్యర్థులకు రూ.1,000
➤ రెండూ రాసే ఇతరులకు రూ.1,800
TS EAMCET 2023 పూర్తి వివరాలు ఇవే..