Skip to main content

Telangana Inter Results : ఇంటర్ రిజ‌ల్ట్స్ ఆల‌స్యం..? కార‌ణం ఇదేనా..?

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ‌లో ఇంట‌ర్మీడియ‌ట్‌ జవాబు పత్రాల మూల్యాంకనం వేగంగా కొన‌సాగుతోంది.
TS Inter Results
TS Inter Results 2022

అలాగే ఇంటర్‌ స్పాట్‌ వ్యాల్యుయేషన్‌ దాదాపు పూర్తయినట్టేనని అధికార వర్గాలు అంటున్నాయి. కానీ ఇంట‌ర్ ఫ‌లితాల విడుద‌ల‌పై ఇంకా తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్‌ బోర్డ్ ఒక స్ప‌ష్ట‌మైన క్లారిటీ ఇవ్వ‌డం లేదు. ఈ నేప‌థ్యంలో ఇటు విద్యార్థులు, వారి త‌ల్లిదండ్రులు అయోమ‌యంలో ఉన్నారు. ఇటీవ‌ల కాలంలో సోష‌ల్ మీడియాలో ఫ‌లితాల విడుద‌ల‌పై వివిధ తేదీలు చ‌క్క‌ర్లు కొట్టాతున్నాయి. అయితే ఇలాంటి వార్త‌ల‌ను న‌మ్మ‌వ‌ద్ద‌ని, ఫ‌లితాలు ఎప్పుడు విడుద‌ల చేస్తామో త్వ‌ర‌లోనే ప్ర‌క‌టిస్తామ‌ని తెలంగాణ ఇంట‌ర్మీడియ‌ట్ బోర్డ్ స్ప‌ష్టం చేసింది. అయితే ఫ‌లితాల విడుద‌ల ఎందుకు ఆల‌స్యం అవుతోందో మాత్రం చెప్ప‌డం లేదు. అయితే గ‌తంలో జ‌రిగిన అనుభ‌వాల‌ను దృష్టితో పెట్టుకొని.., ఈ సారి ఎటువంటి స‌మ‌స్య‌లు రాకుండా ముందు జాగ్ర‌త్త‌లు తీసుకుంటున్నారు..! మే 6వ తేదీన‌ మొదలైన ఇంటర్మీడియెట్‌ పరీక్షలు మే 24న ముగిసిన విష‌యం తెల్సిందే. తెలంగాణ ఇంట‌ర్ ఫ‌లితాల‌ను సాక్షిఎడ్యుకేషన్‌.కామ్ (www.sakshieducation.com)లో చూడొచ్చు.

After Inter: ఇంటర్మీడియెట్‌ తర్వాత.. ఏకకాలంలో డిగ్రీతోపాటు పీజీ పూర్తి..

How to check TS Inter 2022 Results:

➤ Visit results.sakshieducation.com or education.sakshi.com

➤ Click on TS Inter 2nd year results - General / Vocational on the home page

➤ In the next page, enter your hall ticket number and submit

➤ The results will be displayed on the screen.

➤ Save a copy of the marks sheet for further reference.

After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..

9,07,396 మంది విద్యార్థులు..
ఈ సారి ఇంట‌ర్ ప్రథమ, ద్వితీయ సంవత్సరం పరీక్షలకు 9,07,396 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో ఇంట‌ర్‌ సెకండియ‌ర్‌ విద్యార్థులు 4,42,768 మంది ఉన్నారు. అలాగే ఈ సారి 1,443 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు.  25,530 మంది ఇన్విజిలేటర్లను, 150 మందితో సిట్టింగ్‌ స్క్వాడ్, మరో 75 మందితో ఫ్లయింగ్‌ స్క్వాడ్‌ల‌ను ఏర్పాటు చేసి ప‌టిష్టంగా ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హించారు. అలాగే ఇంట‌ర్ ఫస్టియర్ ప‌రీక్ష‌ల‌కు 4,64,626 మంది విద్యార్థులు హాజ‌ర‌య్యారు.

Also Check:What after Inter/10+2...

ఈ సారి ఫలితాలు ఆశాజనకంగా..
ఇంటర్‌ అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ పరీక్షలు జూలై మొదటి వారంలో నిర్వహిస్తామని అధికారులు తెలిపారు. గ‌త రెండు సంవ‌త్స‌రాలుగా కరోనాతో విద్యా సంవత్సరంలో ఒడిదొడుకులు చోటుచేసుకున్న విష‌యం తెల్సిందే. అలాగే ఇంటర్‌ పరీక్షలు నిర్వహించకుండానే విద్యార్థులను పైతరగతులకు ప్రమోట్‌ చేశారు. అలాగే ఈ సారి ఇంటర్ ప‌రీక్ష‌ల ప్ర‌శ్న‌ప‌త్రాల‌ను 70 శాతం సిలబస్ నుంచి మాత్రమే ఇచ్చారు. దీంతో ఫలితాలు ఆశాజనకంగా ఉంటాయని అధికారులు అంచనా వేస్తున్నారు.

After Inter BiPC: వెటర్నరీ సైన్స్‌తో ఉద్యోగావకాశాలు.. బీవీఎస్సీతో డాక్టర్‌ హోదా పొందొచ్చు...

2022–23 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను..

ఇంటర్మీడియట్‌ 2022–23 విద్యా సంవత్సర క్యాలెండర్‌ను తెలంగాణ ఇంట‌ర్‌ బోర్డు మే 16న విడుదల చేసిన విష‌యం తెల్సిందే. జూన్ 15న ద్వితీయ సంవత్సరం విద్యార్థుల తరగతులు ప్రారంభించాలని పేర్కొంది. ఫస్టియర్ క్లాసులు జూలై 1 నుంచి మొదలవుతాయని, 2023 మార్చి 31తో విద్యా సంవత్సరం ముగుస్తుందని తెలిపింది. జూన్ నుంచి మార్చి వరకూ మొత్తం 304 దినాలుంటే, ఇందులో 83 సాధారణ, సంక్రాంతి, దసరా సెలవులు ఉంటాయని, ఇంటర్ కాలేజీలు 221 పనిదినాలు కొనసాగుతాయని షెడ్యూల్లో వివరించింది. ప్రభుత్వ, ప్రైవేటు కాలేజీలు ఈ షెడ్యూల్ను అనుసరించాలని బోర్డు పేర్కొంది.

ఇంటర్మీడియెట్ స్టడీ మెటీరియల్

2022–23 అకడమిక్ క్యాలెండర్ ఇదే..

సెకండియర్‌ మొదలు

15–6–22

ఫస్టియర్‌ ప్రారంభం

01–7–22

దసరా సెలవులు

2–10–22 నుంచి 9–10–22 వరకు

అర్ధ సంవత్సర పరీక్షలు

21–11–22 నుంచి 26–11–22 వరకు

సంక్రాంతి సెలవులు

13–1–23 నుంచి 15–1–23 వరకు

ప్రీ ఫైనల్‌ పరీక్షలు

6–2–23 నుంచి 13–2–23 వరకు

ప్రాక్టికల్‌ పరీక్షలు

20–2–23 నుంచి 6–3–23 వరరకు

థియరీ పరీక్షలు

15–3–23 నుంచి 4–4–23 వరకు

కాలేజీల చివరి పనిదినం

31–3–23

అడ్వాన్స్‌డ్‌ సప్లిమెంటరీ

2023 మే చివరి వారం

కాలేజీల పునఃప్రారంభం

1–6–23

ఇంటర్మీడియెట్ మోడల్ పేపర్స్​​​​​​​

ఇంటర్మీడియెట్ ప్రివియస్‌ పేపర్స్

Published date : 20 Jun 2022 05:35PM

Photo Stories