After Inter: ఇంటర్‌తోనే.. ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు..
Sakshi Education
ఇంటిగ్రేటెడ్ పోస్ట్ గ్రాడ్యుయేషన్ (ఇంటిగ్రేటెడ్ పీజీ).. ఇటీవల కాలంలోవిస్తృతంగా వినిపిస్తున్న మాట! సంప్రదాయ విభాగాల నుంచి ప్రొఫెషనల్ ప్రోగ్రామ్‌ల వరకు.. పలు ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అందుబాటులోకి వస్తున్నాయి. వీటివైపు దృష్టిసారించే విద్యార్థుల సంఖ్య కూడా పెరుగుతోంది.
లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్..
లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్‌లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఆయా లాంగ్వేజ్ కోర్సుల పరంగా ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు.
ప్రముఖ యూనివర్సిటీలు :
ఇంటర్‌తోనే పీజీలో చేరేందుకు వీలుండటమే అందుకు కారణం! ఇంటర్ పరీక్షలు పూర్తయి.. ఉన్నత విద్య దిశగా అడుగులు వేస్తున్న విద్యార్థులకు ఉపయోగపడేలా ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లపై విశ్లేషణ...
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్ :
ఇంటర్మీడియెట్ అర్హతతోనే కోర్సులో చేరి.. పీజీ సర్టిఫికెట్‌తో బయటికి వచ్చే అవకాశం కల్పించే ప్రోగ్రామ్‌లు.. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్. వాస్తవానికి అన్ని యూనివర్సిటీల్లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లను ప్రవేశపెట్టాలని 2008లోనే జాతీయ స్థాయిలో నిర్ణయించారు. క్రమేణా వీటిని అందిస్తున్న వర్సిటీలు, ఇన్‌స్టిట్యూట్‌ల సంఖ్య పెరుగుతోంది. ప్రస్తుతం దేశవ్యాప్తంగా అన్ని యూనివర్సిటీల్లో ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులు అమల్లోకి వస్తున్నాయి. మార్కెట్ పరిస్థితులను పరిగణనలోకి తీసుకుంటూ.. పీజీ స్థాయిలో కొత్త సబ్జెక్ట్‌లను కూడా ఆఫర్ చేస్తున్నారు.
చదవండి: After Class 10+2
అర్హత... ఇంటర్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులతో విద్యార్థులకు ప్రధాన ప్రయోజనం.. ఇంటర్మీడియెట్‌తోనే పీజీలో ప్రవేశం పొందే అవకాశం ఉండటం. ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల వల్ల విద్యార్థులకు కలిగే మరో ఉపయోగం... సమయం ఆదా అవడం. ఉదాహరణకు టెక్నికల్ కోర్సుల పరంగా ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంటెక్ ప్రోగ్రామ్ వ్యవధి అయిదేళ్లు. అదే సంప్రదాయ విధానంలో.. బీటెక్ నాలుగేళ్లు, ఆ తర్వాత ఎంటెక్‌కు మరో రెండేళ్లు చదవాలి. అంటే.. రెగ్యులర్ విధానంలో బీటెక్, ఎంటెక్ పూర్తిచేయాలంటే ఆరేళ్లు పడుతుంది. ఇంటిగ్రేటెడ్ పీజీ ద్వారా ఐదేళ్లలోనే అటు బీటెక్ పట్టాతోపాటు ఇటు ఎంటెక్ సర్టిఫికెట్ కూడా చేతికి అందుతుంది. ఎంతో విలువైన ఒక ఏడాది సమయం కలిసొస్తుంది. ఇది వారు తమ కెరీర్ పరంగా ముందంజలో నిలిచేందుకు అవకాశం కల్పిస్తుంది.
రెండు డిగ్రీలు :
అయిదేళ్ల వ్యవధి ఉండే ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల్లో అడుగుపెట్టిన విద్యార్థులు.. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదవాల్సి ఉంటుంది. ఆ తర్వాత రెండేళ్లు పీజీ స్థాయి సబ్జెక్టులను అభ్యసించాలి. తొలి మూడేళ్లు బ్యాచిలర్ డిగ్రీ స్థాయి సబ్జెక్టులను చదివిన విద్యార్థులు.. పీజీ స్థాయిలో అందుబాటులో ఉన్న స్పెషలైజేషన్లలో ఏదో ఒకదాన్ని ఎంపిక చేసుకోవచ్చు. మూడేళ్ల తర్వాత బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్, అయిదేళ్ల తర్వాత పీజీ సర్టిఫికెట్ లభిస్తుంది. మూడేళ్ల తర్వాత పీజీ ప్రోగ్రామ్‌లో కొనసాగడం ఇష్టం లేకపోతే.. బ్యాచిలర్ డిగ్రీ సర్టిఫికెట్ అందుకోవచ్చు.
బీటెక్+ఎంబీఏ :
ప్రస్తుతం మన దేశంలో ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌ల పరంగా మేనేజ్‌మెంట్ కోర్సులు ముందంజలో నిలుస్తున్నాయి. ఇటీవల కాలంలో ఎక్కువ మంది విద్యార్థులు బీటెక్ పూర్తికాగానే.. ఎంబీఏ వైపు అడుగులు వేస్తున్నారు. అందుకే పలు ఇన్‌స్టిట్యూట్‌లు, బీస్కూల్స్‌లో బీటెక్+ఎంబీఏ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్‌లకు శ్రీకారం చుట్టాయి. ఫలితంగా విద్యార్థులకు ఒకవైపు టెక్నికల్ స్కిల్స్, మరోవైపు మేనేజ్‌మెంట్ నైపుణ్యాలు రెండూ లభిస్తున్నాయి.
సైన్స్ కోర్సులు :
సెంట్రల్ యూనివర్సిటీలు, రాష్ట్రాల స్థాయిలోని యూనివర్సిటీలు.. సైన్స్ విభాగంలో.. ఇంటిగ్రేటెడ్ బీఎస్సీ+ఎంఎస్సీ వంటి ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను అందిస్తున్నాయి. వీటిద్వారా విద్యార్థులకు ఐ.ఎమ్మెస్సీ పేరుతో సర్టిఫికెట్ లభిస్తోంది. ఈ విధానంలో ఎమ్మెస్సీ పూర్తి చేసిన విద్యార్థులకు.. సదరు యూనివర్సిటీలోనే పీహెచ్‌డీ ప్రవేశంలో ప్రాధాన్యం ఇస్తున్నాయి. ముఖ్యంగా సెంట్రల్ యూనివర్సిటీల్లో ఈ విధానం అమలవుతోంది.
చదవండి: After 10+2/Inter: బైపీసీతో విస్తృతావకాశాలు!!
సోషల్ సెన్సైస్ :
ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సుల పరంగా క్రమేణా క్రేజ్ పెరుగుతున్న మరో విభాగం.. సోషల్ సెన్సైస్. సంప్రదాయ బీఏ కోర్సుల ఔత్సాహికులు.. భవిష్యత్తును ఉజ్వలంగా మార్చుకోవడానికి ఇవి అవకాశం కల్పిస్తున్నాయి. టిస్, జేఎన్‌యూ వంటి ప్రముఖ యూనివర్సిటీలు, సెంట్రల్ యూనివర్సిటీలు.. ఇంటిగ్రేటెడ్ ఎంఏ పేరుతో పలు ప్రోగ్రామ్స్‌ను అందుబాటులోకి తెచ్చాయి. వీటిలో ఎంఏ స్థాయిలో సోషల్ వర్క్, సోషియాలజీ, రూరల్ డెవలప్‌మెంట్, ఎన్‌జీవో మేనేజ్‌మెంట్ వంటి స్పెషలైజేషన్లు అందిస్తున్నాయి.
అయిదేళ్ల ‘లా’ కోర్సు :
ఇంటర్మీడియెట్ విద్యార్థులకు కెరీర్ పరంగా చక్కటి బాట వేస్తున్న మరో కోర్సు.. అయిదేళ్ల బీఏ ఎల్‌ఎల్‌బీ. ఇంటర్మీడియెట్ అర్హతతో లాసెట్, క్లాట్ వంటి పరీక్షల్లో ఉత్తీర్ణత ఆధారంగా రాష్ట్ర స్థాయి యూనివర్సిటీలు, నేషనల్ లా యూనివర్సిటీల్లో న్యాయశాస్త్ర పట్టా చేతికందుతుంది. ఇటీవల కాలంలో విద్యార్థుల వైపు నుంచి కూడా ఈ కోర్సుల పట్ల ఆదరణ పెరుగుతోంది.
ఐఐటీలు, ఐఐఎంల్లోనూ..
టెక్నికల్, మేనేజ్‌మెంట్ కోర్సుల్లో అంతర్జాతీయంగా మంచి పేరున్న ఐఐటీలు, ఐఐఎంలు కూడా పలు ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్‌లు అందిస్తున్నాయి.

-
ఐఐటీ-చెన్నై 2006లోనే ఇంటిగ్రేటెడ్ ఎంఏ కోర్సును అందుబాటులోకి తెచ్చింది.
- ఐఐటీ-ఖరగ్‌పూర్ ఇంటిగ్రేటెడ్ బీటెక్+ఎంబీఏ ప్రోగ్రామ్‌ను అందిస్తోంది.
- ఐఐటీ-కాన్పూర్, రూర్కీలు కూడా ఈ తరహా ప్రోగ్రామ్‌లను అందిస్తున్నాయి.
- ఐఐఎం-ఇండోర్ కూడా ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ ఇన్ మేనేజ్‌మెంట్ పేరుతో ఇంటర్మీడియెట్ అర్హతగా ప్రత్యేక కోర్సును నిర్వహిస్తోంది.
- సైన్స్ కోర్సులకు ప్రత్యేకంగా ఏర్పాటైన ఐఐఎస్‌ఈఆర్‌ల్లో సైతం బీఎస్+ఎంఎస్ పేరుతో ఇంటిగ్రేటెడ్ ప్రోగ్రామ్ అందుబాటులో ఉంది.
లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్..
లాంగ్వేజ్ ప్రోగ్రామ్స్‌లోనూ ఇంటిగ్రేటెడ్ పీజీ కోర్సులను పలు యూనివర్సిటీలు అందిస్తున్నాయి. ఆయా లాంగ్వేజ్ కోర్సుల పరంగా ఇంగ్లిష్ అండ్ ఫారెన్ లాంగ్వేజెస్ యూనివర్సిటీ-హైదరాబాద్, జేఎన్‌యూ, ఢిల్లీ యూనివర్సిటీలు ముందంజలో నిలుస్తున్నాయని చెప్పొచ్చు.
ప్రముఖ యూనివర్సిటీలు :
- సెంట్రల్ యూనివర్సిటీలు
- ఐఐటీ-ఖరగ్‌పూర్, చెన్నై, రూర్కీ
- ఐఐఎం-ఇండోర్
- ఢిల్లీ యూనివర్సిటీ
- బిట్స్-పిలానీ
- ఎక్స్‌ఎల్‌ఆర్‌ఐ
- నేషనల్ లా యూనివర్సిటీస్
- నేషనల్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ ఎడ్యుకేషన్ అండ్ రీసెర్చ్
ఎన్నో ప్రయోజనాలు..
ఇంటిగ్రేటెడ్ పీజీ ప్రోగ్రామ్స్‌తో విద్యార్థులకు ఎన్నో ప్రయోజనాలు లభిస్తున్నాయి. బ్యాచిలర్ డిగ్రీ స్థాయి నుంచే వారు పీజీ స్థాయిలో ఎంపిక చేసుకున్న స్పెషలైజేషన్లకు సంబంధించిన కోర్సులను చదివే వెసులుబాటు లభిస్తుంది. అలాగే ఇంజనీరింగ్, సైన్స్ విద్యార్థుల కోణంలో ఆలోచిస్తే.. బ్యాచిలర్ స్థాయి నుంచే విద్యార్థుల్లో రీసెర్చ్ ఆప్టిట్యూడ్ పెరుగుతుంది.
-ప్రొఫెసర్.వి.ఎస్.రావు, డెరైక్టర్, ఎన్‌ఐఐటీ యూనివర్సిటీ
చదవండి: After Inter MPC: ఇంజనీరింగ్‌తోపాటు వినూత్న కోర్సుల్లో చేరే అవకాశం.. అవకాశాలు, ఎంట్రన్స్ టెస్టుల వివరాలు ఇలా..

Published date : 21 Jan 2022 03:26PM