TSMJBC: ‘జూనియర్ కాలేజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
Sakshi Education
సాక్షి, హైదరాబాద్: మహాత్మా జ్యోతిబాపూలే వెనుకబడిన తరగతుల సంక్షేమ గురుకుల సంస్థల సొసైటీ పరిధిలోని జూనియర్ కాలేజీల్లో మొదటి సంవత్సరం అడ్మిషన్ కోసం నిర్వహించిన ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి.
‘జూనియర్ కాలేజీ’ ప్రవేశ పరీక్ష ఫలితాలు విడుదల
మే 29న తెలంగాణ బీసీ సంక్షేమ శాఖ మంత్రి గంగుల కమలాకర్ సచివాలయంలోని తన చాంబరులో ఫలితాలను విడుదల చేశారు. అభ్యర్థులు బీసీ గురుకుల సొసైటీ వెబ్‌సైట్ నుంచి ఫలితాలను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. ఎంపీసీలో 150 మార్కులకుగాను 122 మార్కులతో మొదటి స్థానంలో సిద్దిపేట జిల్లాకు చెందిన పి.జ్యోత్స్న, బైపీసీలో నల్లగొండ జిల్లాకు చెందిన పి.శ్రీవల్లి 108 మార్కులతో, సీఈసీలో పెద్దపల్లి జిల్లాకు చెందిన కె.సాయి సంహిత 107 మార్కులతో, ఎంఈసీలో మేడ్చల్ జిల్లాకు చెందిన ఎ.అర్చన 109 మార్కులతో అగ్ర స్థానంలో నిలిచారు. జూన్ 10లోగా విద్యార్థులు నిర్దేశించిన కాలేజీలో అడ్మిషన్ తీసుకోవాలని గంగుల చెప్పారు.