Inter Board Big Update : ప్రాక్టికల్స్ రాయకపోతే అంతేనా.. మరో అవకాశం ఉండదా.. బోర్డు క్లారిటీ!!

సాక్షి ఎడ్యుకేషన్: రాష్ట్రవ్యాప్తంగా ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ ప్రారంభం అయ్యాయి. ఈ మెరకు విద్యార్థులకు తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు ఒక శుభవార్త చెప్పింది. ఇప్పటికే చాలామంది విద్యార్థులు పరీక్షలకు హాజరయ్యి, పరీక్షలు పూర్తి చేస్తున్నారు. అయితే, కొందరు విద్యార్థులు మాత్రం అనుకోని కారణాల చేత పరీక్షలు రాయలేకపోతున్నారు. అయితే, వారంతా పరీక్ష ఇక పోయినట్టే అని బాధ పడుతుంటారు. కాని, వారి కోసమే ఈ శుభవార్త. వారు మరోసారి ఈ పరీక్షలను రాసే అవకాశం ఉంటుందని బోర్డు స్పష్టం చేసింది.
Inter Hall Tickets: ఇంటర్ ప్రాక్టికల్ పరీక్షల హాల్ టికెట్లు విడుదల.. డౌన్‌లోడ్ చేసుకోండిలా..
ఈ కారణాలుంటేనే..
ఈ నేపథ్యంలో ఉత్తర్వులు కూడా జారీ చేసింది. నిర్ణీత తేదీల్లో ప్రాక్టికల్స్ పరీక్షలను రాయలేకపోయిన విద్యార్థులు మరోసారి పరీక్షను రాసే అవకాశం ఉందంటూ ప్రకటించారు. కాని, ఇది కేవలం సరైన కారణం కలిగిన విద్యార్థులకే అని వారికి ఉండాల్సిన ప్రత్యేకమైన కారణాలను వివరించారు. విద్యార్థులకు ప్రత్యేకమైన పరిస్థితుల్లో లేదా కారణాలతో అంటే.. విద్యార్థుల అనారోగ్యం, వ్యక్తిగత, అత్యవసర పరిస్థితుల్లో గైర్హాజరయ్యే వారికి మాత్రమే వెసులుబాటు ఉంటుంది.
మూడు విడతల్లో..
ఇకపోతే, ఇంటర్ విద్యార్థులకు ప్రాక్టికల్స్ పరీక్షలను ఈ నెల 7 నుంచి నాలుగు విడతల్లో జరగనున్నాయి. మొదటి విడత 7న(శుక్రవారం), రెండో విడత 8 నుంచి 12 వరకు, మూడో విడత 13 నుంచి 17వరకు, నాలుగో విడత 18 నుంచి 22వరకు నిర్వహించనున్నారు.
☛Follow our YouTube Channel (Click Here)
☛ Follow our Instagram Page (Click Here)
Tags
- Telangana inter board
- Intermediate Students
- inter board good news
- inter board big update on practical
- practical exam for inter students
- Telangana Government
- Education Department
- Telangana Inter Board notice
- re exam for inter practical exams
- telangana inter practical exams re conduction
- absent students for inter practical exams
- second chance for inter practical students
- re exam for inter practical
- inter board latest good news for absent students
- inter practical exams 2025
- Education News
- Sakshi Education News