Smooth Pursuit: గడియారంలో మొదటి సెకన్‌కు లేటెందుకు?
మెదడు ప్రాసెస్ చేసే తీరు వల్లే..
గడియారాన్ని చూసినప్పుడు మొదటి సెకన్ ఎక్కువ సేపు ఉన్నట్టు అనిపించడం వెనుక సైంటిఫిక్ కారణాలు ఉన్నాయి. సాధారణంగా మన కళ్లు రెండు రకాలుగా కదులుతుంటాయి.ఒకటి స్మూత్ పర్సూ్యట్, రెండోది సెక్కాడ్.
Also read: వాతావరణ శాస్త్రజ్ఞులు గాలివేగాన్ని ఎలా కొలుస్తారు?
స్మూత్ పర్సూ్యట్ విధానంలో కళ్లు చాలా మెల్లగా కదులుతూ గమనిస్తుంటాయి. ఉదాహరణకు మనకు కాస్త దూరంలో కారో, బైకో కదులుతూ ఉంటే.. కళ్లు దానికి అనుగుణంగా కదులుతూ చూస్తుంటాయి. ఈ విధానంలో కంటి నుంచి అందిన సమాచారాన్ని మెదడు వెంటవెంటనే ప్రాసెస్ చేస్తుంటుంది. మనం గడియారంలోకి చూసినప్పుడు.. రెండో సెకన్ నుంచి సెకన్ల ముల్లు అలా కదులుతూ ఉండటాన్ని గమనించడం కూడా ‘పర్సూ్యట్’ కిందకే వస్తుంది.
Also read: కొందరి కళ్లు నీలంగా ఉంటాయి ఎందుకు?
సెక్కాడ్ విధానం అంటే.. ఏదైనా ఒకచోటి నుంచి మరో చోటికి వేగంగా, వెంటనే దృష్టి మళ్లించడం. ఇలా చేసినప్పుడు తొలుత చూస్తున్న దృశ్యం, చివరిగా దృష్టిని ఆపిన దృశ్యం మాత్రమే క్లియర్‌గా కనిపిస్తాయి. మధ్యలో ఉన్నదంతా చూచాయగానే అనిపిస్తుంది. ఉదాహరణకు మీకు దూరంగా ఉన్న ఏదైనా భవనాన్ని చూస్తున్నారు. పక్కన ఏదో చప్పుడైతే ఒక్కసారిగా అటువైపు చూశారనుకోండి. ఆ భవనానికి, ఈ చప్పుడు వచి్చన చోటికి మధ్య దృశ్యాలేవీ పెద్దగా ఆనవు. కంటి నుంచి అందే సమాచారాన్ని మెదడు అంత వేగంగా, వెంటనే ప్రాసెస్ చేయలేకపోవడమే దీనికి కారణం.
Also read: చలనంలో శాస్త్రం
మనం గడియారం వైపు చూసినప్పుడు తొలి దృష్టి సెక్కాడ్ మోడ్‌లోనే ఉంటుంది. అప్పటికే కదులుతూ ఉన్న ముల్లు ఆగి, మళ్లీ కదులుతున్న సమయంలో.. మెదడు ఆ దృశ్యాన్ని ప్రాసెస్ చేయడానికి సమయం తీసుకుంటుంది. అంతకుముందు చూస్తూ ఉన్న దృశ్యం నుంచి గడియారం వైపు దృష్టిని మరల్చిన సమయాన్ని కూడా కలిపేస్తుంది. దీనితో తొలి సెకన్ గడిచేందుకు ఎక్కువసేపు పట్టినట్టు అనిపిస్తుంది. ఆ వెంటనే మన దృష్టి స్మూత్ పర్సూ్యట్‌లోకి వచ్చేస్తుంది కాబట్టి.. మిగతా సెకన్లు మామూలుగానే గడిచిపోతుంటాయి.
Also read: గోధుమ గింజలు, పంట బంగారు రంగులో ఉంటాయెందుకు?