Skip to main content

తేనెను నిల్వ చేయడానికి దానిని రెఫ్రిజరేటర్‌లో పెట్టాల్సిన పనిలేదు. ఎందుకు?

honey ఏ పదార్థమైనా పాడవడానికి కారణం బ్యాక్టీరియా, సూక్ష్మజీవులే. సాధారణంగా అతి చల్లని ఉష్ణోగ్రతల్లో అవి జీవించలేవు. కాబట్టి పదార్థాలు పాడవకుండా ఉండటానికి వాటిని రెఫ్రిజరేటర్‌లో పెడుతుంటారు. చెడిపోవడానికి ఏ మాత్రం ఆస్కారం లేని పదార్థాలలో ‘తేనె’ ఒకటి. దానికి కారణం ఇందులో ఎక్కువ శాతం చక్కెర, అతి తక్కువగా నీరు ఉండడమే. చక్కెర 70 నుంచి 80 శాతం వరకు ఉంటే, నీరు 15 నుంచి 20 శాతం ఉంటుంది. తేనెలో బ్యాక్టీరియా, సూక్ష్మజీవులు వృద్ధి చెందలేవు. తేనెలో ఉండే కొన్ని ఎంజైములు. ఆమ్లాలు సూక్ష్మజీవులను నశింపజేస్తాయి. ఆ కారణంగానే డాక్టర్లు ఒక్కోసారి గాయాలు నయం కావడానికి వాటిపై తేనెను పూస్తారు.

ఇంకా తేనెలో పుప్పొడి ఖనిజాలు, విటమిన్లు, ప్రోటీన్లు ఉంటాయి. మామూలు చక్కెరలో పూర్తిగా సుక్రోన్ అనే పదార్థం ఉంటే తేనెలో వివిధ రకాల చక్కెరలు ముఖ్యంగా గ్లూకోజ్ ప్రక్టోజ్ ఉంటాయి. అందువల్ల తేనె గడ్డకట్టదు.
Published date : 25 Sep 2013 12:02PM

Photo Stories