Skip to main content

TS Tenth Class Public Exams 2023 Dates : ఇక ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల‌కు ఆరు పేపర్లే.. ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

సాక్షి ఎడ్యుకేష‌న్ : తెలంగాణ ప్ర‌భుత్వం 10వ తరగతి చదువుతున్న విద్యార్థులకు గుడ్‌న్యూస్ చెప్పింది. గత విద్యా సంవత్సరం మాదిరే ఈ ఏడాది కూడా టెన్త్‌ పరీక్షలను ఆరు పేపర్ల తోనే నిర్వహించాలని తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం నిర్ణయించింది.
ts 10th Class Pulic Exams Sabitha Indra Reddy
Sabitha Indra Reddy

ఈ మేరకు రాష్ట్ర ప్ర‌భుత్వం డిసెంబ‌ర్ 28వ తేదీన (బుధవారం) జీవో జారీ చేసింది. 2021లో కరోనా మహమ్మారి కారణంగా 11 పేపర్లకు బదులు 6 పేపర్లతో పదో తరగతి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయం తీసుకున్న విషయం తెలిసిందే. అలాగే 2022లో కూడా 6 పేపర్లతోనే పదో తరగతి పరీక్షలు నిర్వహించింది. ఇప్పుడు 2023లోనూ ఆరు పేపర్లకే పరీక్షలు నిర్వహించేందుకు ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. ఏప్రిల్ 3వ తేదీ నుంచి ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌లు నిర్వ‌హించ‌నున్నారు. సైన్స్‌ పరీక్షకు 3.20 నిమిషాల సమయం కేటాయించగా.. మిగతా అన్ని సబ్జెక్టులకు 3 గంటలు పరీక్షా సమయం ఉంటుంది. ఈ సారి వంద శాతం సిల‌బ‌స్‌తో ప‌రీక్ష‌ల‌ను నిర్వ‌హింస్తామ‌ని విద్యాశాఖ మంత్రి స‌బితా ఇంద్రారెడ్డి తెలిపారు. ఫిబ్రవరి, మార్చి నెలల్లో ఫ్రీ పైనల్‌ పరీక్షలు నిర్వహించాలన్నారు.

పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు..

ఈ ప‌రీక్ష‌ల్లో వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఇంటర్నరల్‌ ఛాయిస్‌ ఉంటుందని, సూక్ష్మ రూప ప్రశ్నలకు ఛాయిస్ ఉండు. నమూనా ప్రశ్న పత్రాలను వెంటనే విద్యార్థులకు అందుబాటులో ఉంచాలని మంత్రి అధికారులను ఆదేశించారు. అలాగే పదో తరగతి పరీక్షలకు సిద్ధమవుతున్న విద్యార్థులకు ప్రత్యేక తరగతులు నిర్వహించాలని కూడా సూచించారు. అలాగే సెలవు రోజుల్లో కూడా ప్రత్యేక తరగతులు నిర్వహించాలన్నారు. ఆయా సబ్జెక్టుల్లో వెనుకబడిన విద్యార్థులను గుర్తించి వారికి ప్రత్యేకంగా బోధించాలని ఆదేశించారు.

ఇక‌ 9వ త‌ర‌గ‌తి విద్యార్థుల‌కు..
9, 10 తరగతులకు ఆరు పేపర్లతోనే పరీక్షలు నిర్వహించాలని నిర్ణయించారు. ఈమేరకు రాష్ట్ర ప్రభుత్వం డిసెంబ‌ర్ 28వ తేదీన (బుధవారం) ఉత్తర్వులు జారీ చేసింది. 2022-23 నుంచి సంస్కరణలు అమలు అవుతాయని పేర్కొంది. ఒక్కో సబ్జెక్ట్‌లో పరీక్షలకు 80, ఫార్మెటివ్‌ అసెస్‌మెంట్‌కు 20 మార్కులు కేటాయిస్తున్నట్లు తెలిపింది. సైన్స్‌ పేపర్‌లో ఫిజిక్స్‌, బయోలజీకి చెరి సగం మార్కులు ఉంటాయని మంత్రి వెల్లడించింది.

తెలంగాణ ప‌దో త‌ర‌గ‌తి ప‌బ్లిక్ ప‌రీక్ష‌ల తేదీలు ఇవే..

Date (Tentative)

Subject Name

Time Schedule

3rd,April-2023

First Language Paper-1 (Group A)

&

First Language Paper-1 (Composite Course)

First Language paper 2 (Composite Course)

 9:30 AM to 12:30 PM

&

9:30 AM to 12:50 PM

4th April -2023

Second Language

 9:30 AM to 12:30 PM

6th April -2023

Third Language (English)

 9:30 AM to 12:30 PM

8th April -2023

Mathematics

 9:30 AM to 12:30 PM

10th April -2023

General Science Paper (Physical Science) and

 

General Science Paper (Biological Science)

 9:30 AM to 12:50 PM

11th April-2023

Social Studies

9:30 AM to 12:30 PM

12th April-2023

OSSC Main Language Paper-1

(Sanskrit/ Arabic / Persian)

&

SSC Vocational Course (Theory)

9:30 AM to 12:30PM

&

9:30 AM to 12:30PM

13th April-2023

Main Language Paper 2 (Sanskrit and Arabic)

9:30 AM to 12:30 PM

TS 10th Class Exams: ప‌దో త‌ర‌గ‌తి పరీక్షలు రాస్తున్నారా..? ఇలా రాస్తే అధిక మార్కులు మీవే..
విద్యార్థులు మంచి స్కోర్ సాధించాలంటే..

ts 10th class students

తెలంగాణ‌లో పదోతరగతి పరీక్షలు సమీపిస్తున్న వేళ విద్యార్థులు ఓ వైపు ఒత్తిడి, మరోవైపు వారిలో ఆందోళనను నివృత్తి చేసేందుకు వారికి ఉపాధ్యాయులు, అధికారులు పలు సూచనలు చేశారు. ఏకాగ్రత, ప్రణాళిక బద్ధంగా చదివితేనే విద్యార్థులు మంచి మార్కులతో ఉత్తీర్ణత సాధిస్తారని ఉపాధ్యాయులు పేర్కొన్నారు. ఒత్తిడికి గురి కాకుండా తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిన అవసరం ఉందని వారు స్పష్టం చేశారు.

ఇవి పాటిస్తే విజ‌యం మీదే..
☛ పరీక్షా సమయంలో సెల్‌ఫోన్, టీవీ, కంప్యూటర్ల వైపు దృష్టి మరలకుండా చూసుకోవాలి. ప్రతి రోజు విద్యార్థి నిర్ధేశించుకున్న టైమ్‌ టేబుల్‌ ప్రకారం చదువుకోవాల్సి ఉంటుంది. 
☛ ఉపాధ్యాయులు, స్నేహితులు, సీనియర్ల ద్వారా తమ సందేహాలను నివృత్తి చేసుకోవాలి. ఆత్మ విశ్వాసంతో పరీక్షలకు సిద్ధమైతేనే విజయం మరింత సులభమవుతుంది. 
☛ ప్రశాంత వాతావరణంలో పరీక్షలు రాసేందుకు ముఖ్యంగా విద్యార్థులకు  పరీక్ష సమాయాల్లో ఇంట్లో చక్కటి వాతావరణం కల్పించాలి.
☛ విద్యార్థిలో ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించేందుకు కృషి చేయడంతో పాటు అవసరమైన ధైర్యాన్ని అందించాలి.
☛ ఒత్తిడిని తగ్గించేందుకు వారికి సహకారం అందిస్తే అధిక సమయం చదువుకే కేటాయిస్తారు. 
☛ తల్లిదండ్రులు పిల్లల ఆరోగ్యం పట్ల జాగ్రత్తలు తీసుకోవాలి. సమయానుకూలంగా విద్యార్థికి తగిన ఆహారం అందించాలి.
☛ విద్యార్థులు సమయానికి తగినట్లుగా నిద్రపోయేలా కుటుంబసభ్యులు చూసుకోవాలి. 
విద్యార్థులు పరీక్షలకు వెళ్లే సమయంలో మంచి పౌష్టికాహారం తీసుకోవాలి. పరీక్షలకు వెళ్లే ముందు తప్పనిసరిగా బ్రేక్‌ఫాస్ట్‌ చేయాలి. ప్రశ్నా పత్రాన్ని క్షుణ్ణంగా అర్థం చేసుకున్న తర్వాతే జవాబులు రాయాలి. 

ఇలా రాస్తే అధిక మార్కులు.. 
ఉపాధ్యాయులు ఇచ్చిన మెటీరియల్‌ను విద్యార్థులు చదువుకుని పాఠ్య పుస్తకాలపైనే దృష్టిసారించాలి. సమయాన్ని వృధా చేయకుండా పరీక్షలకు సిద్ధం కావాలి. సొంతంగా రా సిన జవాబులకే అధిక మార్కులు వేసే అవకాశం ఉంటుంది. 

☛ పదో తరగతి బిట్‌బ్యాంక్

☛ పదో తరగతి సిలబస్

☛ పదో తరగతి మోడల్ పేపర్లు

☛ పదో తరగతి ప్రివియస్‌ పేపర్స్

☛ పదో తరగతి టెక్స్ట్ బుక్స్

☛ మోడల్ పేపర్లు కోసం క్లిక్ చేయండి

Published date : 29 Dec 2022 01:46PM

Photo Stories