ఇద్దరు ముఖ్యమంత్రులు, గవర్నర్‌కు విద్య నేర్పిన పాఠశాల.. 150 ఏళ్ల ఉత్సవాలు..

అదే రంగారెడ్డి జిల్లా షాద్‌నగర్ నియోజకవర్గ పరిధిలోని ఫరూఖ్‌నగర్ మండలంలోని మొగిలిగిద్ద ప్రభుత్వ ఉన్నత పాఠశాల. ఇది స్వాతంత్య్రానికి పూర్వమే ఏర్పాటైంది. జనవరి 31న 150 ఏళ్ల ఉత్సవాలను ఘనంగా నిర్వహిస్తున్నారు.
అనేకమంది ప్రముఖుల అక్షరాభ్యాసం
ఈ బడిలో అనేక మంది ప్రముఖులు అక్షరాభ్యాసం చేశారు. తర్వాత ఉన్నత చదువులు చదువుకుని వివిధ రంగాల్లో దేశవిదేశాల్లో స్థిర పడ్డారు.
హైదరాబాద్ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి బూర్గుల రామకృష్ణారావు, ఉమ్మడి ఏపీ మాజీ ముఖ్యమంత్రి మర్రి చెన్నారెడ్డి, యూపీ మాజీ గవర్నర్ సత్యనారాయణరెడ్డి, మాజీ విద్యాశాఖ మంత్రి శ్రీనివాసరావు, ఓయూ మాజీ వీసీ మల్లారెడ్డి, స్వాతంత్య్ర సమరయోధుడు రంగారావు, పౌర హక్కుల సంఘం నేత, ప్రొఫెసర్ హరగోపాల్ సహా అనేక మంది ఇక్కడ అక్షరాలు దిద్దినవారే.
చదవండి: 10th Class: ‘టెన్త్ విద్యార్థులకు లాంగ్వేజ్ అభ్యసన దీపికలు ఇవ్వాలి’
గ్రామస్తుల్లో చైతన్యం రగిలించేందుకు..
నిజాం పాలనకు వ్యతిరేకంగా ఉద్యమించిన తుర్రెబాజ్‌ఖాన్ అప్పట్లో వారి నుంచి తప్పించుకుని షాద్‌నగర్ నియోజకవర్గం ఫరూఖ్‌నగర్ మండలం మొగిలిగిద్దలో ఆశ్రయం పొందినట్లు చరిత్రకారులు చెబుతుంటారు. ఈ విషయం నిజాంకు తెలిసి తుర్రెబాజ్‌ఖాన్‌ను అరెస్ట్ చేసి, హైదరాబాద్‌కు తరలించి ఉరి తీసినట్లు ప్రచారం ఉంది. గ్రామస్తులను విద్యాపరంగా చైతన్యవంతులను చేయాలనే సంకల్పంతో నాటి నిజాం సర్కార్ 1873లో మొగిలిగిద్దలో పాఠశాలను ఏర్పాటు చేసింది.

మొదట్లో ఉర్దూ మీడియంలో విద్యాబోధన చేయగా, 1948లో తెలుగు మాధ్యమంలో బోధనను ప్రారంభించారు. నిజానికి పాఠశాల ప్రారంభమై 152 ఏళ్లుపూర్తి కావొస్తున్నా.. పూర్వ విద్యార్థుల సంఘం ఆధ్వర్యంలో ఇప్పుడు 150వ వార్షికోత్సవాన్ని (కోవిడ్ కారణంగా రెండేళ్లు ఉత్సవాలు వాయిదా వేశారు) జరుపుకొనేందుకు సంసిద్ధులయ్యారు. ఇక్కడ 500 మందికిపైగా విద్యార్థులు చదువుతున్నారు.
![]() ![]() |
![]() ![]() |
నేడు పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన
స్వాతంత్య్రానికి ముందే ఇక్కడ పోలీస్‌స్టేషన్‌తోపాటు గ్రంథాలయాన్ని కూడా ఏర్పాటు చేశారు. అప్పట్లో ఈ ఠాణా కింద 140 గ్రామాలు ఉండేవి. ఈ పోలీస్‌స్టేషన్‌ను 1983లో కొందుర్గ్‌కు తరలించారు. ఈ చారిత్రక గ్రామాన్ని మండల కేంద్రంగా ప్రకటించాలనే డిమాండ్ కూడా ఉంది.
పాఠశాల వార్షికోత్సవాలను పురస్కరించుకుని సీఎం రేవంత్‌రెడ్డి జనవరి 31న మొగిలిగిద్దకు చేరుకోనున్నారు. పాఠశాలలో పలు మౌలిక సదుపాయాల కల్పనకు, గ్రామంలో పలు అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేయనున్నారు. ఈ మేరకు అధికారులు ఏర్పాట్లు పూర్తిచేశారు.